GUDIVADA Amarnath reddy
-
ఎవరికో పుట్టిన బిడ్డకు పేర్లు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు
-
బాబు వైస్రాయ్ రాజకీయాలకు.. YSRCP నేతలు లొంగరు
-
మీ రుణం తీర్చుకోలేనిది..మంత్రి భావోద్వేగం
-
సీఎం జన్మదినం సందర్భంగా ఆరోగ్య కార్డులు, బట్టలు పంపిణీ చేసిన మంత్రి
-
పచ్చ పత్రికలు ఎంత విషం కక్కినా అభివృద్ధి ఆగదు
-
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఏపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ ఆహ్వానించారు.గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, మన్సుఖ్ మాండవీయా, సర్బానంద సోనోవాల్‌లను రాష్ట్ర మంత్రులిద్దరూ కలిశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో 49 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన 13 రంగాలకు ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఉపకరించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో 49 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ పారిశ్రామిక ప్రగతికి ఉపకరిస్తాయని వెల్లడించారు. విశాఖ సదస్సుకు దేశంలోని పారిశ్రామికవేత్తలతో సహా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. గత ప్రభుత్వం సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల ప్రాజెక్టులతోపాటు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొందని.. అయితే రూ.1.87 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. విశాఖ రాజధాని అని సీఎం పేర్కొనడాన్ని ప్రభుత్వ విధానాల గురించి చెప్పడంలో భాగంగానే చూడాలన్నారు. కొత్త ప్రకటనలా చూడాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో కేంద్రం రాజధానిపై వేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు చదివినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. -
బాబు, పవన్ భేటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్
-
ఈనాడు పత్రిక అబద్ధపు రాతలు రాస్తోంది : మంత్రి అమర్నాథ్
-
బాబుకోసం ఎల్లో మీడియా ఊహాజనిత కథనాలు
-
మా ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి : మంత్రి అమర్నాథ్
-
‘చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడతారు’
తిరుమల: విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖకు ఇన్ఫోసిస్ తరహా కంపెనీలు రానున్నాయని తెలిపారు. రాష్ట విభజన అనంతరం అందరూ ఏపీని హైదరాబాద్‌తో పోలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్న అమర్నాథ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రచారం కోసం మాత్రమే పాకులాడతారని ఎద్దేవా చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు, అధికారులు, ఎస్పీలు, వలంటీర్లు ఉన్నారని తెలిపారు. వరదల కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించలేదు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇదీ చూడండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? -
సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా కడుపు మంట :గుడివాడ అమర్నాథ్ రెడ్డి
-
AP New Cabinet: డబుల్ ధమాకా
సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది. సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు. నమ్మకానికి మారుపేరు... సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినేట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు. 2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో సంబరాలు... ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను. – గుడివాడ అమర్నాథ్ సైనికుల్లా పనిచేస్తాం... కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు -
కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న జననేత
-
విశాఖకు ఏం చేశారో చెప్పాలి?
-
విశాఖపట్నంలో అన్ని రకాల వనరులున్నాయి
-
‘వచ్చే ఏడాది మహానాడు జైలులోనే’
సాక్షి, విశాఖపట్నం: పేదల సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, కొందరు అధికారులు పందికొక్కుల్లా తిన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ధ్వజమెత్తాడు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాక ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి టైం దొరకని చంద్రబాబుకు, ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అని ప్రశ్నించారు. అచ్చెంనాయుడు అరెస్ట్‌ను కిడ్నాప్‌గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదించారని, అవినీతికి కులం, మతం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు హయంలో హెచ్‌పీసీఎల్, ఒఎన్జీసీ ఘటనలు జరిగిన బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) తన సొంత ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం గోదావరీ పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నా టీడీపీ తరుపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ బాధిత ప్రాంతంలో నివసిస్తున్న 20 వేల జనాభాను ఆదుకుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. తాను చేసిన అరాచకాలు, అన్యాయాలు మర్చిపోయి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజల మీద ఉన్నది సవతి ప్రేమ అని, ఆయన అక్రమాలను తెలుగు ప్రజలు మర్చిపోరు అని అన్నారు. మొన్న మహానాడునను జూమ్ యాప్‌లో చేసుకున్న చంద్రబాబు వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. (అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం) -
సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్‌లో చర్చించాలా?
-
మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
-
హైదరాబాద్ దూరమని ఎందుకు రాయలేదు?
-
'దండుపాళ్యం గ్యాంగ్ ఎవరో తేలుతుంది'
సాక్షి, విశాఖపట్నం : విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు. విశాఖలో వైఎస్సార్ సీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే ఆ భూములు వారికే ఇచ్చేస్తామన్నారు. ఆలీబాబా అరడజను దొంగలు ఎవరో... దండుపాళ్యం గ్యాంగ్ ఎవరో త్వరలోనే తేలుతుందని హెచ్చరించారు. సుజనా చౌదరి లాంటి చీటర్ చెప్పే మాటలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం. సీఎం వైఎస్ జగన్ రాకతో విశాఖ నగరానికి మహర్దశ పట్టబోతుందని అమర్నాథ్ తెలిపారు. జీఎన్ రావు కమిటీతో పాటు నిపుణుల కమిటీ నివేదిక కూడా వచ్చిన తర్వాత రెండు కమిటీల నివేదికలపై చర్చించి విశాఖకు పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి తాటి చెట్ల పాలెం రైల్వే స్టేషన్ రోడ్, ఫ్లైఓవర్, వుడా పార్క్ కైలాసగిరి వరకు ఇరువైపులా విశాఖ పౌరులతో స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కైలాసగిరిపై 37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు వుడా సెంట్రల్ పార్క్‌లో రూ. 380 కోట్ల అంచనా వ్యయంతో, విఎంఆర్డీఏలో రూ. 800 కోట్ల వ్యయంతో జివిఎంసి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్ సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ ఫ్లవర్ షో ను ప్రారంభించిన అనంతరం అక్కడినుంచే ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. -
గాంధీజీ కలలను సీఎం జగన్ సాకారం చేశారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడారు. స్థానికంగా ప్రజల సమస్యలు తీర్చేందుకే గ్రామసచివాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 14శాఖల అధికారులు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా ప్రజలు వారికి విన్నవించుకోవచ్చునని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన వస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అట్టడుగు పల్లెలకు సైతం సీఎం వైఎస్ జగన్ పరిపాలనను తీసుకెళ్లారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలన్నింటినీ గ్రామసచివాలయాలు పరిష్కరిస్తామని, ఈ వ్యవస్థ ద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని కొనియాడారు. రైల్వేకోడూర్ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత చంద్రబాబు సర్కార్ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 34 రకాల సేవలు అందుతున్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రజలందిరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. -
రాష్ట్ర ప్రజలపై పవన్ కల్యాణ్‌ది కపటప్రేమ
-
అమర్ ప్రసంగం అదుర్స్
సాక్షి, అనకాపల్లి(విశాఖపట్నం) : విశాఖకేంద్రంగా ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. మంగళవారం అసెంబ్లీలో గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో 9.35 నిమిషాలు మాట్లాడి ఐటీ ప్రాధాన్యతలు, గత ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో వివరించారు. విశాఖకేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో ఐటీహబ్ ఏర్పాటు కావాలని, 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జిల్లాకో ఐటెక్ సిటీ, ఎయిర్‌పోర్టు, పోర్టు నిర్మిస్తామని హామీలు గుప్పించి విశాఖలో ఎకో సిస్టమ్ బాగోలేదని, అంతర్జాతీయ విమానాశ్రయం లేదని పేర్కొనడం అందరూ గమనించారని తెలిపారు. తెలంగాణలో ఐటీ మంత్రి పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తుండగా మనరాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి విదేశాలకు చెందిన కంపెనీ ప్రతినిధులతో ఏం మాట్లాడారో ఆయా కంపెనీల ప్రతినిధులకు ఏం అర్ధమైందో గానీ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగలేదని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 43 లక్షల మందికి ఉపాధి కల్పించామని గత ప్రభుత్వం రికార్డుల్లో పేర్కొందని తెలిపారు. కానీ వాస్తవ గణాంకాలు చూస్తే కేవలం 30 వేల మందికే ఉద్యోగాలు కల్పించినట్టుగా తేలిందన్నారు. 43 లక్షల ఉద్యోగాలు ఎక్కడ 30 వేల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. 2017–18లో రూ.690 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ జరగ్గా 2018–19 అది రూ. 570 కోట్లకు పడిపోయిందన్నారు. 18 శాతం ఐటీ ఎక్స్పోర్ట్ తగ్గినట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో ఐటీమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లోకేష్ విశాఖలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కష్టమని చెప్పిన నెలరోజుల్లోనే లక్షమందికి ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొనడం బట్టీ ఆయన మాటల్లో ఏమేరకు వాస్తవా లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో ఆడంబరాలు, హడావుడి చేయడానికే మంత్రులు పరిమితమయ్యారని చెప్పా రు. బోగస్ కంపెనీలను సృష్టించారని, తద్వారా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించారన్నారు. డీటీపీ ఆపరేటర్లు, మీసేవాకేంద్రాల నిర్వాహకులతో ఫొటోలు దిగి, ఐటీ సంస్థల అధికా రులంటూ పేర్కొంటూ గత ప్రభుత్వం పబ్బం గడుపుకొందన్నారు. సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్ను కనిపెట్టానని చెప్పుకొన్న వ్యక్తి గత ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఎంతో సంబరపడ్డామని, కానీ వాస్తవాలు చూస్తే దీనికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. తన తాతగారు, తండ్రిగారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారని, తనకు కూడా ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని అమర్నాథ్ చెప్పారు. విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకరించాలని కోరారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబుపైన, గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్‌పైన సంధించిన వ్యంగ్యాస్త్రాలను అసెంబ్లీ లో సభ్యులు ఆసక్తిగా విన్నారు. -
జగన్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారు