శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన శాసన మండలి రద్దు తీర్మానంలో అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.