
ఇసుక అక్రమ రవాణాను అరికడతాం
►అధికార పార్టీ పేరు చెప్పుకుని కొందరు ఇసుక రవాణా
►అరెస్ట్ చేస్తాం..మళ్లీ రవాణా చేస్తే పీడీయాక్ట్ ప్రయోగం
►మంత్రి అమరనాథరెడ్డి వెల్లడి
►యుద్ధప్రాతిపదికన టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు : కలెక్టర్
చిత్తూరు, ఎడ్యుకేషన్: జిల్లాలో ఇసుక అక్ర మ రవాణాను అరికడతామని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో రెవె న్యూ, పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసు, రవాణాశాఖ అధి కారులు సంయుక్తంగా పని చేయాలని కోరారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇసు క అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయిస్తామని, తరువాత అదే తప్పు చేస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఎక్కువగా ఇసుక తరలించే ప్రాంతాలను గుర్తించి జాబితా తయారు చేయాలని తహసీల్దార్లకు సూచిం చారు. జేసీ గిరీషా, సబ్‌కలెక్టర్లు నిషాంత్‌కుమార్, వెట్రిసెల్వి పాల్గొన్నారు.