
సాక్షి, తిరుపతి: మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అనుచరులతో ప్రాణ హాని ఉందని నారాయణపురానికి చెందిన పుణ్యవతి అనే మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మంత్రి అల్లుడితోపాటు, ఆయన అనుచరులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారని ఆమె తెలిపింది.
తమ రెండెకరాల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారని మహిళ తెలిపింది. అంతేకాక, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. గత రాత్రి పొలం వద్ద ఉన్న సమయంలో మంత్రి అనుచరులు హతమర్చేందుకు ప్రయత్నాం చేశారని మహిళ చెప్పింది. మాకు ఏమైనా జరిగితే అందుకు మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అనుచరులే కారణమని పుణ్యవతి, ఆమె సోదరీమణులు ఆరోపించారు.