
నేటి నుంచి జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు జిల్లా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు పెనుబల్లిలో సాయిరాం హాస్పిటల్‌ను ఎంపీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఇంటర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
రాత్రి 7గంటలకు వైరా మండలంలోని కామిశెట్టి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి రంగస్థల నాటకోత్సవాల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు చండ్రుగొండ మండలంలోని మద్దుకూరు వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జరిగే అధికారుల సమీక్ష సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 6 గంటలకు నగరంలోని 32వ డివిజన్‌లో మినీవాటర్ స్కీమ్ ఫౌండేషన్ స్టోర్‌ను ఆయన ప్రారంభిస్తారు.