
జిల్లాలో నేడు ఎంపీ పర్యటన
వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నిజామాబాద్‌కల్చరల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి నిజామాబాద్‌కు 10 గంటలకు చేరుకుంటారని, అనంతరం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఆసుపత్రుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.
బోధన్ మండలం భవానిపేటలో బోనాల పండుగలో, 12 గంటలకు బోధన్‌లో జరిగే జేఏసీ సమావేశంలో పాల్గొంటారని , సాయంత్రం 4 గంటలకు ధర్మారంలో పీఎంపీ అసోసియేషన్ భవన్‌కు శంకుస్థాపన చేస్తారని, 4.45 నిమిషాలకు నిజామాబాద్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీలో కంపోనెంట్ యూనిట్‌ను ప్రారంభిస్తారని, 5.15 నిమిషాలకు నగరంలోని ఖలీల్‌వాడిలో లయన్స్ ఆసుపత్రి ప్రారంభిస్తారని , 5.45 నిమిషాలకు అదే ప్రాంతంలో ఈశ్వర్ గ్యాస్ట్రో ఆసుపత్రిని ప్రారంభిస్తారని వివరించారు.