అదిరిందయ్యా...రాజయ్య!
పంచకట్టుతో ఆకట్టుకున్న డిప్యూటీ సీఎం
సాక్షి, సంగారెడ్డి: నిత్యం ప్యాంటు, షర్టుతో కనిపించే డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య జిల్లా పర్యటనలో కొత్త లుక్‌తో అదరగొట్టారు. సోమవారం సంగారెడ్డి పర్యటనకు వచ్చిన ఆయన తెల్ల పంచె, జుబ్బా ధరించి వచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ అతిథిగృహానికి వచ్చిన ఆయనను చూసిన టీఆర్‌ఎస్ నేతలు పోల్చుకోలేకపోయారు.
‘సార్.. పంచెకట్టులో అదిరిపోయారు అంటూ’ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలువురు నేతలు డిప్యూటీ సీఎం రాజయ్యకు కితాబు ఇవ్వటంతో ఆయన నవ్వి ఊరుకున్నారు. పంచెకట్టుపై విలేకరులు రాజయ్యను ప్రశ్నించగా ‘డిప్యూటీ సీఎం హోదాలో ప్యాంటు, షర్టు వేసుకుంటే చిన్నవాడిగా కనిపిస్తున్నా.. కొంచెం పెద్దరికం కనిపించేందుకు పంచెకట్టుకున్నా.. బావుందా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.