Dr. RAJAIAH
-
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సింగాపూర్ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్‌కు 22700 పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ తొలి క్యాబినెట్లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు. రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఐలో గెలుపొంది టిఆర్ఎస్లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్ఎస్లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఐ కు రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్లో చేరి వరంగల్ నుంచి లోక్ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్‌లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్ నియోజకవర్గం జనరల్‌గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోవడం ఓ విషాదం. హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్.టి.ఆర్. క్యాబినెట్‌లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. డాక్టర్ రాజయ్య కూడా కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు. స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జూడాలపై చర్యలు తీసుకుంటా
-
జూడాలపై చర్యలు తీసుకుంటా
ఉపముఖ్యమంత్రి రాజయ్య సాక్షి, సంగారెడ్డి: కోర్టు మొట్టికాయవేసినా మొండిగా వ్యవహరిస్తున్న జూనియర్ డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖను వికేంద్రీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్యకళాశాల వార్షిక వేడుకలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. జూడాలు వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందజేయబోమని చెప్పటం దారుణమన్నారు. వైద్యులైన నా పిల్లలను గ్రామీణ ప్రాంతాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూడాల ఐదు డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
అదిరిందయ్యా...రాజయ్య!
పంచకట్టుతో ఆకట్టుకున్న డిప్యూటీ సీఎం సాక్షి, సంగారెడ్డి: నిత్యం ప్యాంటు, షర్టుతో కనిపించే డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య జిల్లా పర్యటనలో కొత్త లుక్‌తో అదరగొట్టారు. సోమవారం సంగారెడ్డి పర్యటనకు వచ్చిన ఆయన తెల్ల పంచె, జుబ్బా ధరించి వచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ అతిథిగృహానికి వచ్చిన ఆయనను చూసిన టీఆర్ఎస్ నేతలు పోల్చుకోలేకపోయారు. ‘సార్.. పంచెకట్టులో అదిరిపోయారు అంటూ’ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలువురు నేతలు డిప్యూటీ సీఎం రాజయ్యకు కితాబు ఇవ్వటంతో ఆయన నవ్వి ఊరుకున్నారు. పంచెకట్టుపై విలేకరులు రాజయ్యను ప్రశ్నించగా ‘డిప్యూటీ సీఎం హోదాలో ప్యాంటు, షర్టు వేసుకుంటే చిన్నవాడిగా కనిపిస్తున్నా.. కొంచెం పెద్దరికం కనిపించేందుకు పంచెకట్టుకున్నా.. బావుందా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. -
చిన్ననీటి పారుదలకు రూ.100 కోట్లు
వరంగల్ : చిన్న నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య చెప్పారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా రెండున్నర లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సర్కార్ తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేస్తోందని, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకుసాగుతోందన్నారు. ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేందుకు ‘మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో అన్ని వర్గాలను భాగస్వామ్యములను చేస్తున్నట్లు పేర్కొన్నా రు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతరంగా అఖిలపక్షం ఇందులో పాల్గొనాలని సూచిం చారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిం దని, దళితులకు రూ.50వేల కోట్లు, బీసీలకు రూ.25వేల కోట్లు, మైనార్టీలకు రూ.10వేల కోట్లు, గిరిజనలకు రూ.15వేల కోట్లు కేటాయించినట్లు తెలి పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడు తూ ‘మన ఊరు-మన ప్రణాళిక’ అమలుకు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ మహత్తరమైన ‘మన ప్రణాళిక’లో ప్రజలంతా భాగస్వాములై రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ సమాజంలో 85 శాతంగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు అండగా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ సహోదర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు, పార్టీ నాయకులు మరుపల్ల రవి, లలితాయాదవ్, సంపత్, రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.