వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన | minister kamineni indistrict tour | Sakshi

వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన

Jul 29 2016 10:24 PM | Updated on Sep 4 2017 6:57 AM

వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన

వైఎస్సార్ జిల్లాలో మంత్రి కామినేని పర్యటన

రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు.

కడప : రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. మొదట కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కడప రిమ్స్‌కు చేరుకున్నారు. రిమ్స్‌ కళాశాల డైరెక్టర్‌ చాంబర్‌లో అధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. రిమ్స్‌లో సమస్యలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రం మంజూరు చేశారు గానీ ఇంత వరకు ఏర్పాటు చేయలేదని ఆయన దృష్టికి అధికారులు తీసుకెళితే...ప్రైవేటు భాగస్వామ్యంతో త్వరలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కాన్పుల విభాగంలో ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా మదర్‌ చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంఈ బాబ్జి, రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శశిదర్, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అక్కడే భోజనం చేసి ఐపీ విభాగంలోని ఎంఐసీయూ పక్కనున్న గదిలో రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement