- ఎట్టకేలకు నేడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏజెన్సీ పర్యటన
- ఇన్నాళ్లూ మన్యాన్ని వ్యాధులు వణికించినా పట్టని సర్కారు
- గిరిజనం పిట్టల్లా రాలిపోయినా స్పందించని వైనం
- పీహెచ్‌సీల్లో డాక్టర్, సిబ్బంది పోస్టుల ఖాళీ
- రంపచోడవరం ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపు ఎప్పుడో!
ఏడాది తర్వాత తీరిగ్గా
Published Wed, Jan 11 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
రంపచోడవరం :
విలీన మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో గిరిజనుల మృత్యువాత, రాజవొమ్మంగి మండలంలో చిన్నారుల మరణాలు మన్యాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి. మన్యంలో గిరిజనులు అనేక రకాల అనారోగ్యాలతో మృత్యువాత పడినప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాక రాష్ట్ర ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఏజెన్సీ సందర్శించడానికి వస్తున్నారు. ఇక్కడ గిరిజనులు రోగాలతో ఇబ్బందులు పడినప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని మంత్రి సంవత్సరం తరువాత ఏజెన్సీ పర్యటనకు రావడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఏజెన్సీ ఆసుపత్రులలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కనీస స్థాయిలో కూడా మందుల సరఫరా లేదు.
వంద పడకల స్థాయి కాగితాలకే పరిమితం
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచినట్టు ప్రకటించి సుమారు తొమ్మిది నెలలు గడచినా అందుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ఈ ఆసుపత్రిలో సివిల్ సర్జ¯ŒS స్పెషలిస్టు (సీఎస్‌ఎస్), డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS (డీఎస్‌సీ), సివిల్ అసిస్టెంట్ సర్జ¯ŒS (సీఏఎస్) పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. ఏడుగురు ప్రత్యేక వైద్య నిపుణులు పనిచేయాల్సి ఉండగా మత్తు డాక్టర్, ఆప్తామాలజిస్ట్, గైనిక్ వైద్యులు లేరు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి కూడా మందుల సరఫరా సక్రమంగా లేదు. పూర్తిస్థాయిలో ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో అత్యవసర కేసులు రాజమండ్రి, కాకినాడలకు రిఫర్ చేయడం మినహా ఇక్కడ ఏం జరగడం లేదు. ఏజెన్సీకి ప్రధాన ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే పీహెచ్‌సీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 24 గంటల ఆసుపత్రుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. రాత్రి సమయంలో ఏ అత్యవసర వైద్యం కోసం వెళ్లినా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో కిలోమీటర్లు ప్రయాణించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
పీహెచ్‌సీల్లో పోస్టుల ఖాళీ
ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సిన అధికారి పోస్టు సైతం ఇ¯ŒSచార్జి పాలనలో సాగుతోంది. సివిల్ సర్జ¯ŒS స్పెషలిస్టు, డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపీహెచ్‌ఓ పోస్టులు 33 ఖాళీ ఉన్నాయి. వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో పరిస్థితి తెలుసుకుని ఆనారోగ్య పరిస్థితులు ఉంటే రోగులను పీహెచ్‌సీలకు పంపించే ఏర్పాటు చేస్తారు. ఫార్మాసిస్ట్ పోస్టులు 19కి తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు.
అంబులె¯Œ్సలు అవసరం
ఏజెన్సీలో వైద్యసేవలు మెరుగుపరచాలి. గిరిజన మహిళలకు గైనిక్ సేవలు సక్రమంగా అందడం లేదు. పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు గ్రామాల్లో సేవలు అందించేందుకు అంబులె¯Œ్సలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
Advertisement