న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు
Comments
Please login to add a commentAdd a comment