
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అంతటా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు సముద్రంలోకి మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంపై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని ఆనుకొని ఉన్న తీవ్ర అల్పపీడనం.. వచ్చే 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని..తీరం వెంట గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment