మంత్రి కామినేని, ఆరోగ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య
సాక్షి, గుంటూరు: ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయసారథితో ఆయన పదవికి రాజీనామా చేయిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. గుంటూరులో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆరోగ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీజీహెచ్ గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే పీజీ విద్యార్థిని సంధ్యారాణి మృతిచెం దినట్లు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. లక్ష్మి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు. హెల్త్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయకుండా ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. అరెస్టు చేసిన అనంతరం లక్ష్మి, ఆమె భర్త విజయసారథిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రొఫెసర్ల వేధింపులపై వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అరెస్టు చేసి తీరుతాం: ఐజీ సంజయ్
సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసి తీరుతామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
విజయసారథితో రాజీనామా చేయిస్తాం..!
Published Sun, Nov 6 2016 2:14 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement