సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చన్నారు. మన రాష్ట్రం నుంచి 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేశామని చెప్పారు. ఫాతిమా విద్యార్థుల సమస్యపై 3న రివిజన్ పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment