fatima medical colleage
-
అయోమయం..!
సాక్షి కడప : ఎన్నో ఆశలతో విద్యా సంవత్సరం ప్రారంభించిన ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చదివించేందుకు సిద్ధమైనా.. సంబంధిత యాజమాన్యం ఎం సీఐ అనుమతి వ్యవహారం చెప్పకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి.అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం వారిని పట్టించుకోకపోవడంతో త్రిశంకుస్వర్గంలో నలిగిపోతున్నారు. ‘ఫాతిమా’యాజమాన్యం చేతిలో చిక్కుకుపోయిన విద్యార్థులకు న్యాయం కరువైంది. ఎవరి వద్దకు వెళితే వారికి న్యాయం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి కళాశాలలో చేరిన తర్వాత కొద్దిరోజులకే ఎంసీఐ అనుమతి లేదని తెలియడంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన వారు.. మరో రెండేళ్లు చదువును కోల్పోయారు. అప్పటినుంచి సుమారు 90 మంది విద్యార్థులు ఆం దోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎంసీఐ, కేంద్రం చర్చిస్తున్నామని చెబు తున్నారే తప్ప ఇప్పటివరకు వారికి మాత్రం మెడికల్ కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పించలేదు. వైద్య విద్యార్థులు మాత్రం తిరిగని చోటులేదు..చేయని ప్రయత్నమూ లేదు.వారి కలల సౌధమైన ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మెడికల్ సీట్లు పొందినా..దురదృష్టం కొద్ది చదువుకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత ఏడాదైనా సీటు అవకాశం లభించకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇంకెన్నాళ్లు? 2015–16కు సంబంధించి కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో సీట్లు పొందినా...చదువు ఆగిపోయింది. కారణం ఎంసీఐ అనుమతి లేకపోవడమే. ఒకవైపు తల్లిదండ్రులు,మరోవైపు విద్యార్థులు రెండేళ్లుగా నిత్యం నేతలు, అధికారులు, సీఎం,మంత్రులను కలుస్తూ వస్తున్నా ఇప్పటికీ కూడా వారి వ్యవహారం కొలిక్కి రాకపోవడం గమనార్హం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబందించి కూడా ఎంబీబీఎస్ సీట్లకు రెండోవిడత కౌన్సెలింగ్ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మెదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. నీట్ ఎంట్రెన్స్ టెస్టలో కూడా కొంతమంది అర్హత సాధించారు.వారిలో కూడా ఎ,బి, కేటగిరీలలో అర్హత సాధించిన వారు తక్కువ కావడంతో..ఇక అంతా మిగతా క్యాటగిరీలో సీటు ఇవ్వాల్సి ఉంది.అయితే సీఎం బాబు ఈ విద్యా సంవత్సరంలో అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినా.. ఇప్పటికీ రూపుదాల్చ లేదు. కనీసం వారికి ఇప్పిస్తామన్న ఫీజులు విషయంలోనూ క్లారిటీ లేదు. కనీసం ఫాతిమాలో కట్టిన ఫీజులైనా తిరిగి ఇప్పించగలిగితే ప్రయోజన కరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్దులు చదువుకోసం బంగ్లాదేశ్ వెళ్లగా..మరికొంతమందికి నీట్ నేపథ్యంలో సీట్లు రానున్నాయి. నీట్‌తో దాదాపు 65 మందికి పైగా నష్టపోయిన విద్యార్థులు ప్రస్తుతం క్వాలిఫై అయినా అందరికీ సీట్లు రావడం గగనమే. సర్దుబాటు చేస్తామన్న సీఎంతోపాటు ఇతర నేతలు ఇంకా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. పైగా ఈసారి ఉన్న సమయం కాస్త అయిపోతే మళ్లీ విద్యా సంవత్సరం వృథా కాక తప్పదు. ఫాతిమా మెడికల్ కళాశాలలో 2015–16 సంవత్సరానికి సంబంధించి సీటు లభించిన విద్యార్థులు నేటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. సుమారు 90 మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తుకు సరైన దారి దొరుకుతుందో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డాని గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యం తప్పు వల్ల అడ్మిషన్లు కోల్పోయి రోడ్డున పడ్డ 100 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని జేపీ నడ్డాను వైవీ సుబ్బారెడ్డి మరోసారి కోరారు. అడ్మిషన్లు కోల్పోయిన 100 మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేసేందు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి 100 సూపర్ న్యూమరీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విధమైన ఆర్డినెన్స్ ద్వారా గతంలో కేరళ, పాండిచ్చేరిలో విద్యార్థులకు సీట్లు సర్దుబాటు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వీలైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఒప్పించి ఫాతిమా కళాశాలకు 100 సీట్లు అదనంగా కేటాయించేలా సిఫార్సు చేయాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రమంత్రి ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
బాబుకు అనుభవం ఉందని మౌనంగా ఉన్నా
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు తప్పు ఉందని.. అయినప్పటికీ ఆయన సీఎం కుర్చీలో ఉంటే ఆయనకు ఉన్న అనుభవంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్న భావనతోనే ఆ అంశంపై తాను మౌనంగా ఉంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్ శుక్రవారం విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్ధులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, విద్యుత్ ఒప్పంద కార్మికులు, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చెబితే ప్రభుత్వం అన్నీ చేస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు. సమస్యలను అర్ధం చేసుకుంటారు కాబట్టే చంద్రబాబుకు సపోర్ట్ చేశానన్నారు. అందరూ తాను ఏదో ఒక సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నానని, తరువాత కనిపించటం లేదంటు న్నారని, ఇకపై సినిమాలు వదిలి వస్తున్నానన్నారు. -
కేంద్రమంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి
-
ఫాతిమా విద్యార్థులపై సీఎం అసహనం..
సాక్షి, అమరావతి: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద తనను కలిసిన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అల్లరి చేస్తారా? అని వారిపై మండిపడ్డారు. తాము ఈ విషయమై ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే కనపడడం లేదా? టవర్ ఎక్కి చనిపోతామని బెదిరిస్తారా అంటూ సీఎం చంద్రబాబు నిలదీశారు. చంద్రబాబు తీరుతో ఆ విద్యార్థులు మనస్తాపం చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు అమరావతి వచ్చారు. మొదట ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావుతో అసెంబ్లీ లాబీలో సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. ఈ వ్యవహారంలో తమ చేతుల్లో ఏమీ లేదని, ఫాతిమా కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని, ఫాతిమా విద్యార్థులు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఫాతిమా కాలేజీ విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ ఏమేరకు ఎల్లుండి (బుధవారం) మంత్రి కామినేనితో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సోమవారం కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను కలిశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించొద్దని, ఇతర కాలేజీల్లో విద్యార్థులను రీలొకేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 28 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తాననే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. పోలీసులు నచ్చజెప్పడంతో, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడంతో విద్యార్థులు సెల్‌టవర్ దిగారు. -
వైద్య సీట్లలో జాతీయ పూల్‌కు వెళ్తున్నాం
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చన్నారు. మన రాష్ట్రం నుంచి 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేశామని చెప్పారు. ఫాతిమా విద్యార్థుల సమస్యపై 3న రివిజన్ పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు. -
మాకు ఆత్మహత్యలే శరణ్యం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఫాతిమా కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగించిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వ మాయమాటలు నమ్మి మోసపోయామంటూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో మంగళవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, విద్యార్థి సంఘాలు వైఎస్సార్ ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫాతిమా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందునే తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్.అర్షాద్, అజ్మతుల్లా, రహీంబాషా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తమ వద్ద రూ.లక్షల రూపాయలు వసూలు చేసి, అనుమతుల్లేకుండా అడ్మిషన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంసీఐతో సంప్రదింపులు జరిపి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరారు. ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తాం.. దీక్షలో వైఎస్సార్సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
సుప్రీం తీర్పు: విలపించిన 'ఫాతిమా' విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఫాతిమా కాలేజ్ లోనే సీట్లు సర్దుబాటు చేయాలన్నఏపీ ప్రతిపాదనలను ఎంసీఐ తిరస్కరించింది. దీనిపై ఎంసీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు కేసును డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. వంద సీట్ల సర్దుబాటుతో వచ్చే ఏడాది మెరిట్ విద్యార్థులకు నష్టం కలుగుతుందని న్యాయం స్థానం వెల్లడించింది. ఈ పిటిషన్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో 'ఫాతిమా' విద్యార్థులు బోరున విలపించారు. వందసీట్లను తగ్గించుకుంటామని ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతోనే కేసును కొట్టేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లు రీలొకేట్ చేయకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, మంత్రి కామినేని అసమర్థత వల్లే తమకు న్యాయం జరగలేదన్నారు. ఇకనైనా విద్యార్థుల సమస్యలపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా ఆత్మహత్యలు చేసుకుంటామని తెలిపారు. కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం తప్పిదానికి తమ భవిష్యత్తును ఫణంగా పెట్టడం బాధాకరమని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
మెడికల్ కాలేజి వద్ద ఉద్రిక్తత
కడప : నగర పాలక సంస్థకు బకాయి పడిన మొత్తాన్ని వసూలు చేసేందుకు మెడికల్ కాలేజికి వచ్చిన అధికారులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలివీ.. వైఎస్సార్ జిల్లా కడప జిల్లా కేంద్రం సమీపంలోని ఫాతిమా వైద్య కళాశాల నగర పాలక సంస్థకు రూ.1.50 కోట్ల మేర బకాయి పడింది. ఎన్నిసార్లు నోటీసులు అందజేసినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవటంతో విసుగు చెందిన అధికారులు కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వద్దకు వెళ్లారు. కళాశాల ఆస్తుల్ని సీజ్ చేసేందుకు యత్నించగా సిబ్బంది, విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.