నగర పాలక సంస్థకు బకాయి పడిన మొత్తాన్ని వసూలు చేసేందుకు మెడికల్ కాలేజికి వచ్చిన అధికారులను విద్యార్థులు అడ్డుకున్నారు.
కడప : నగర పాలక సంస్థకు బకాయి పడిన మొత్తాన్ని వసూలు చేసేందుకు మెడికల్ కాలేజికి వచ్చిన అధికారులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలివీ.. వైఎస్సార్ జిల్లా కడప జిల్లా కేంద్రం సమీపంలోని ఫాతిమా వైద్య కళాశాల నగర పాలక సంస్థకు రూ.1.50 కోట్ల మేర బకాయి పడింది. ఎన్నిసార్లు నోటీసులు అందజేసినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవటంతో విసుగు చెందిన అధికారులు కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వద్దకు వెళ్లారు. కళాశాల ఆస్తుల్ని సీజ్ చేసేందుకు యత్నించగా సిబ్బంది, విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.