ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్య | Sandhya suicide by Professor abuse sayes Minister kamineni | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్య

Published Wed, Nov 2 2016 2:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Sandhya suicide by Professor abuse sayes Minister kamineni

మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి

 సాక్షి, అమరావతి/గుంటూరు: గుంటూరు వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే పీజీ వైద్య విద్యార్థిని డా.సంధ్యారాణి మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నివేదిక ఆధారంగా ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన మంగళవారం వెలగపూడిలో సచివాలయంలో డిస్పెన్సరీని ప్రారంభించారు.  

 తన కుమార్తెకు సీటు రాలేదన్న అక్కసుతోనే?
 తన కుమార్తెకు కాకుండా సంధ్యారాణికి సీటు రావడం పట్ల ప్రొఫెసర్ లక్ష్మి అక్కసుతో తమ బిడ్డను ఇబ్బందులకు గురి చేసిందని తాము భావిస్తున్నట్లు సంధ్యారాణి తండ్రి సత్తయ్య చెప్పారు. బాగా చదివి మెరిట్‌లో సీటు సాధించడమే తన బిడ్డ పాలిట శాపంగా మారిందని ఆయన గుండెలు బాదుకున్నారు.  

 నిందితురాలిని కాపాడేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే యత్నాలు  
 ప్రొఫెసర్ లక్ష్మిని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు సమాచారం. పోలీస్ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న సదరు సీనియర్ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ లక్ష్మి భర్త విజయసారథి, మరికొందరు వైద్యులతో కలసి పల్నాడు ప్రాంతంలో అతి పెద్ద ప్రైవేట్ ఆస్పత్రి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయకుండా ఆ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement