జీవితాంతం ఆడే ఆట టెన్నిస్
విజయవాడ స్పోర్ట్స్ : జీవితాంతం ఆడగల ఆట టెన్నిస్ అని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోధవేజీ – ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ అసోసియేషన్ (ఐయిస్టా) టోర్నీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెన్నిస్ ఆడడం ద్వారా చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. రాజధానిలో టెన్నిస్‌కు మంచి ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. మండలానికి ఓ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శారీరక అక్షరాస్యత, యోగా వంటివి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టోర్నీ స్పాన్సర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో ఈ టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 8 టోర్నీలు నిర్వహించామని, విజయవాడలోనే 20 టెన్నిస్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. టెన్నిస్‌కు అమరావతి టూరిజం కేంద్రంగా తయారు కావాలన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు, ఐయిస్టా ప్రధాన కార్యదర్శి డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి బుద్దా రాజు, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.పట్టాభిరామయ్య, రామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు సింగిల్స్ మెయిన్ డ్రా మొదటి రౌండ్ ఫలితాలు
– 65+ సింగిల్స్ విభాగంలో డాక్టర్ రామ్మోహన్ 6–2, 6–3 తేడాతో బీఏ ప్రసాద్‌పై, సీబీఎస్ వరప్రసాదరావు 6–3, 3–6, 10–7 తేడాతో ఎంజే సామ్యూల్‌పై, పీకే బాబా 6–4, 6–4 తేడాతో వై.భాస్కరరావుపై, ఏఎస్‌ఎన్ రాజు 6–2, 6–2 తేడాతో ఆర్‌టీఆర్ నాయుడుపై, ధావల్ పటేల్ 3–6, 4–2, 10–7 తేడాతో కులకర్ణిపై, పీకే పట్నాయక్ 6–1, 6–0 తేడాతో గౌతం బుద్ధాపై, వైవీ రామకృష్ణ 6–3, 6–3తో ఎస్.నరసింహారావుపై, సీబీ రామచంద్ర 7–6, 6–2 తేడాతో ఎంవీ సత్యమోహన్‌పై గెలుపొందారు.
– 55+ కేటగిరీలో ఏవీ వర్థన్ 6–0, 6–0 తేడాతో యూఆర్‌ఎస్ జగదీష్‌పై, మెహర్ ప్రసాద్ 6–3, 6–0 తేడాతో జోయల్ కుమార్‌పై, మేఘనాథ్ 6–1, 6–1 తేడాతో కోటయ్యపై, రమేష్‌బాబు 7–5, 1–6, 11–9 తేడాతో ఎస్‌ఏఎన్ రాజుపై, ఆర్‌వీ రామరాజు 6–1, 6–1 తేడాతో బలరామయ్యపై, ఎం.సురేష్ 6–0, 6–3 తేడాతో జి.నాగరాజుపై విజయం సాధించారు.
– 45+ కేటగిరీలో డి.నీలకంఠ 6–2, 6–1 తేడాతో ఎ.వెంకటేశ్వర్లు, కేవీ కృష్ణారెడ్డి 6–2, 6–2 తేడాతో ఎంఎస్ గోపాలకృష్ణపై, జి.కన్నన్ 6–0, 6–0 తేడాతో బి.కుమార్‌పై, ఎల్.సత్యగోపాల్ 6–4, 6–2 తేడాతో సాంబశివరావుపై గెలుపొందారు.