- కాళ్లవాపు వ్యాధిపై కమిటీ
- వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెయ్యి వైద్యులు, సిబ్బంది పోస్టులను త్వరలో భర్తీచేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిన్ యూనిట్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ డయాలసిస్ యూనిట్ ఉభయగోదావరి జిల్లా వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కడా లేవన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి ప్రభావం అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వ్యాధి కిడ్నీ, గుండెలపై ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వారి రక్తనమూనాలు ల్యాబ్‌లకు పంపామని, పూర్తిస్థాయి నివేదిక అందలేదని చెప్పారు.
ఒక ప్రాంతంలో మాత్రం బెరిబెరి వ్యాధి లక్షణాలు కనిపించినట్టు రక్తపరీక్షల్లో తేలిందన్నారు.ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో దాతల సహకారంతో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేస్తున్నానన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రికి వచ్చేది పేదలేనని, వైద్యులు, సిబ్బంది సేవాదృక్పథంతో మెలగాలని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ధవళేళ్వరంలోని హెల్త్ సెంటర్‌లో సౌకర్యాలను మెరుగుపర్చాలని మంత్రిని కోరారు. ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్స్‌ను మంత్రి అందించారు.
రాష్ట్రంలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లు
రాష్ట్రవ్యాప్తంగా 222 అర్బన్ హెల్త్‌సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కామినేని తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని ఆనంద్‌నగర్‌లో అర్బన్ హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 21 అర్బన్ హెల్త్‌సెంటర్లు మంజూరు కాగా వాటిలో 8 రాజమహేంద్రరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ రమేష్‌కిశోర్, ఆర్‌ఎంవో పద్మశ్రీ, డాక్టర్ నాయక్ పాల్గొన్నారు.
వెయ్యి మంది వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ
Published Mon, Oct 3 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
Advertisement
Advertisement