Urban health centers
-
అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆగిన రక్త పరీక్షలు
కడప సెవెన్‌రోడ్స్: ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యుని వద్దకు వెళతాం. అవసరమైన పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాతే ఆ వ్యాధిని పోగొట్టేందుకు తగిన మందులు ఇస్తారు. ఎక్కడైనా జరిగేది, జరగాల్సింది కూడా ఇదే. కానీ కడప అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రోగ నిర్ధారణ జరగకుండానే ఏవో మందులు ఇచ్చి రోగులను పంపేస్తున్నారు. అందుకు అక్కడి సిబ్బందిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే రక్త పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) సరఫరా లేకపోవడంతో వారు అలా చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది. ఇది వర్షాకాలం. దోమకాటు, కలుషిత నీరు తాగడం వల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో వ్యాధి బారిన పడిన ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతో ఇంతో స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేయలేని పేదలు రిమ్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అక్కాయపల్లె అర్బన్ హెల్త్ సెంటర్‌కు పలువురు రోగులు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. తనకు ఐదారు రోజులుగా జ్వరం వస్తోందని, ఇంతకుమునుపు ఇక్కడ చూపించగా పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారని ఓ రోగి వైద్యుడికి తెలిపారు. కానీ జ్వరం తగ్గలేదని, రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు వైద్యుడు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకు రావాలని చీటీ రాయించారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్ష చేయించగా 11.9 శాతం ఉన్నట్లు తెలిసింది. తనకు కావాల్సింది హిమోగ్లోబిన్ టెస్ట్ కాదని, తనను పీడిస్తున్న జ్వరం ఏదో చెప్పాలని ఆ రోగి అడిగాడు. డెంగీ, మలేరియా, టైఫాయిడో రక్త పరీక్షల ద్వారా తేల్చాలంటే అందుకు అవసరమైన రీ ఏజెంట్స్ ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదని సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఇక చేసేది లేక వైద్యుని వద్దకు వెళ్లగా పారాసిటమాల్ ఇంజెక్షన్, పారాసిటమాల్ మాత్రలు, అజిత్రోమైసిన్ యాంటిబయాటిక్ మాత్రలు వాడాలని సూచించారు. అయితే హెల్త్ సెంటర్లో అజిత్రోమైసిన్ మాత్రలు లేవు. అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటంటే ఏ జ్వరం పీడిస్తున్నదో నిర్ధారణ కాకున్నా, జ్వరం అనగానే రొటీన్‌గా ఇచ్చే మాత్రలు ఇచ్చి పంపేస్తున్నారు. ఈ పని మందుల షాపు వారైనా చేస్తారు. ఇంత మాత్రానికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు. కాదు, కూడదని అడిగితే రిమ్స్‌కు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. జ్వరాలు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరం వెళ్లకుండా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బంది, పరికరాలు ఉన్నా రీ ఏజెంట్స్ వంటివి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం విచారకరం. రీ ఏజెంట్స్ కొరత నిజమే రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) లేని మాట వాస్తవమే. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీడీఎస్) నుంచి సరఫరా కావాల్సి ఉంది. రీ ఏజెంట్స్ కొరత ఉంది గనుకే ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తేనే రక్త పరీక్షలు చేస్తున్నాం. అర్బన్ సెంటర్లలో లేకపోతే రిమ్స్ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించుకోవచ్చు. హెల్త్ సెంటర్లలో అజిత్రోమైసిన్ లేకపోతే అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ వాడినా సరిపోతుంది. – డాక్టర్ కె.నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప -
పట్టణ ప్రజారోగ్యానికి జవసత్వాలు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్‌సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది. అందుకనుగుణంగా పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 528 భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 344 కొత్తగా నిర్మించే భవనాలు కాగా, మరో 184 భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ పనుల కోసం రూ.293.60 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించగా, కొత్త భవనాలకు రూ.275.20 కోట్లు, పాత భవనాల పునరుద్ధరణ కోసం రూ.18.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పునరుద్ధరణ చేపట్టిన యూహెచ్‌సీలలో 182 భవనాల పనులు పూర్తవగా, మిగిలిన రెండు భవనాలను ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి తేనున్నారు. కొత్త భవనాలలో ఫిబ్రవరి చివరినాటికి అన్ని వసతులతో 105 కొత్త యూహెచ్‌సీ భవనాలను అందుబాటులోకి తేవాలని, మార్చి చివరినాటికి మొత్తం 344 కొత్త భవనాలను వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం పనులు చేస్తోంది. ప్రతి రెండు కి.మీ.కి ఒక భవనం రాష్ట్రంలోని అన్ని మునిసిపాటీల్లోనూ ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను నిర్మించి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అధికారులు ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టారు. కొత్తగా ఒక్కో సెంటర్ భవన నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయించగా, పాత భవనాల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. -
2 కిలోమీటర్లకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం
సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్య వ్యవస్థను గాడిలో పెడుతూనే పట్టణ పేదలకూ మెరుగైన వైద్య సేవలు, రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ ఆరోగ్య కేంద్రంత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వీటిలో ఇప్పటికే పీపీపీ పద్ధతిలో పనిచేస్తున్న 259 కేంద్రాల గడువు ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వమే వీటిని నిర్వహించనుంది. ప్రతి వార్డుకు 2 కి.మీ. దూరంలో అర్బన్ హెల్త్ కేంద్రం లేదా పావుగంటలో ఆస్పత్రికి నడిచి వచ్చేలా 110 మునిసిపాలిటీల్లో మ్యాపింగ్ చేసి కేంద్రాలను నిర్ణయించారు. త్వరలో నిర్మాణ పనులు.. ► పట్టణాల్లో 215 ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలినవి కూడా సొంతంగానే ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇప్పటికే 355 ఆస్పత్రులకు స్థలాలు గుర్తించిన నేపథ్యంలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మెరుగైన సేవలు ఇలా.. ► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టరు, నర్సు ఒక్కరు చొప్పున మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రతి కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు సేవలందించనున్నారు. ► గతంలో ఫార్మసిస్ట్ లేరు. ఇప్పుడు ఫార్మసిస్ట్‌తోపాటు ల్యాబ్‌టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంటారు. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే సేవలందించగా ఇప్పుడు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనిచేయడంతోపాటు 60 రకాల టెస్టులు చేసేలా ల్యాబ్ సదుపాయం కల్పించారు. నిధుల దుబారాకు అడ్డుకట్ట.. తెలుగుదేశం పార్టీ హయాంలో పీపీపీ పేరిట జరిగిన నిధుల దుర్వినియోగానికి ఇప్పుడు అడ్డుకట్ట పడింది. గతంలో ఒక్కో కేంద్రానికి నెలకు సగటున రూ.4.8 లక్షలు చొప్పున వ్యయం చేయగా ఇప్పుడు కేవలం రూ.2 లక్షలతో అంతకంటే మెరుగ్గా సేవలు అందనుండటం గమనార్హం. ► గతంలో నాలుగేళ్లకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు అంతే వ్యవధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేవలం రూ.255 కోట్లతోనే మెరుగ్గా సేవలు అందించేందుకు సిద్ధమైంది. -
'మరో 10 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తాం'
సాక్షి, హైదరాబాద్ : జిల్లాలో ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు, పనితీరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లతో పాటు ప్రస్తుతం 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాల లో అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు. -
ఆర్భాటం చేసి.. వదిలేశారు!
విజయనగరం ఫోర్ట్ : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ-యూపీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చే శాం.. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ గొప్ప లు చెప్పుకున్న ప్రభుత్వం.. ఆచరణలో చేసి చూపలేకపోయింది. ఇక మీదట టెలీ మెడిషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గతంలో వైద్య సేవలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి. పెద్దగా మార్పు రాలేదు. పేరు మార్చి అప్పగింత పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ- పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(ఈ-యూపీహెచ్సీ)లుగా ప్రభుత్వం ఇటీవల పేరు మార్చింది. వాటి నిర్వహణను ధనుష్ ఇన్ఫోటెక్ అనే ఏజెన్సీకి గత నెలలో అప్పగించింది. ఈ-యూపీహెచ్‌సీల్లో కొత్తగా వైద్య పరీక్షలు చేస్తారని, టెలీ మెడిషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం నిధులను కూడా రెట్టింపు చేసింది. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను స్వచ్ఛం ద సంస్థలు నిర్వహించేవి. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి నెల కు రూ.60 వేలు నుంచి రూ.80 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు నిధులను రూ. 4.12 లక్షలకు పెంచారు. అయినప్పటికీ వైద్య పరీక్షలు జరగడం లేదు. దీంతో వైద్య పరీక్షల కోసం కొనుగోలు చేసిన పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. టెలీ మెడిషన్ సేవలు కూడా అమలు కావడం లేదని తెలిసింది. ఫలితంగా పట్టణ ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ లేబ్‌రేటరీలనే ఆశ్రరుుంచాల్సి వస్తోంది. అన్నింటా ఇదే పరిస్థితి జిల్లాలో ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విజయనగరంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, సాలూరులో ఒకటి, పార్వతీపురంలో ఒకటి చొప్పున ఉన్నాయి. అన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. -
వెయ్యి మంది వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీ
- కాళ్లవాపు వ్యాధిపై కమిటీ - వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెయ్యి వైద్యులు, సిబ్బంది పోస్టులను త్వరలో భర్తీచేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిన్ యూనిట్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ డయాలసిస్ యూనిట్ ఉభయగోదావరి జిల్లా వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కడా లేవన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి ప్రభావం అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వ్యాధి కిడ్నీ, గుండెలపై ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వారి రక్తనమూనాలు ల్యాబ్‌లకు పంపామని, పూర్తిస్థాయి నివేదిక అందలేదని చెప్పారు. ఒక ప్రాంతంలో మాత్రం బెరిబెరి వ్యాధి లక్షణాలు కనిపించినట్టు రక్తపరీక్షల్లో తేలిందన్నారు.ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో దాతల సహకారంతో కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేస్తున్నానన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రికి వచ్చేది పేదలేనని, వైద్యులు, సిబ్బంది సేవాదృక్పథంతో మెలగాలని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ధవళేళ్వరంలోని హెల్త్ సెంటర్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని మంత్రిని కోరారు. ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్స్‌ను మంత్రి అందించారు. రాష్ట్రంలో 222 అర్బన్ హెల్త్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 222 అర్బన్ హెల్త్సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కామినేని తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని ఆనంద్‌నగర్‌లో అర్బన్ హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 21 అర్బన్ హెల్త్సెంటర్లు మంజూరు కాగా వాటిలో 8 రాజమహేంద్రరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ రమేష్‌కిశోర్, ఆర్ఎంవో పద్మశ్రీ, డాక్టర్ నాయక్ పాల్గొన్నారు. -
అపోలో చేతిలో ఇక అర్బన్ హెల్త్సెంటర్లు
– ఈ–యూపీహెచ్‌సీలుగా రూపాంతరం – వచ్చే నెల నుంచే నిర్వహణ బాధ్యతలు మదనపల్లె సిటీ : చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలను దక్కించుకున్న అపోలో కార్పొరేట్ సంస్థ ఆధీనంలోకి తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా వెళుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి అపోలో సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు నడవనున్నాయి. ఐటీ ఆధారిత సేవలతో ఈ–యూపీహెచ్‌సీలు (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు )గా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రి అపోలోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్జీవోలతో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో తిరుపతిలో 5, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 2, మదనపల్లెలో ఒక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో ఉంటున్న ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు 2000వ సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ కోసం ఆరోగ్యశాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్లలో అపోలో సంస్థకు దక్కింది. దీంతో ఆ సంస్థ వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, డేటా ఆపరేటర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లు అపోలో అప్పగించి తద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. అయితే కార్పొరేట్ సంస్థ మురికివాడల్లో ప్రజలకు తగిన వైద్యం అందుతుందా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
‘గ్రేట్’ మార్పు!
- నగరంలో పెరగనున్న జోన్లు - సీఎం నోట కొత్త మాట - జీహెచ్ఎంసీ పరిధిలోకి అర్బన్ హెల్త్ సెంటర్లు - రూ.42 వేల కోట్లతో సౌకర్యాలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు డివిజన్ల విభజనకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు జోన్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా తన మనసులోని మాటను బయట పెట్టారు. గ్రేటర్‌లోని ప్రజా ప్రతినిధులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ‘స్వచ్ఛ హైదరాబాద్’పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం ఐదు జోన్లు ఉన్నాయని... ఈ సంఖ్యను పెంచాలని... అవసరమైన మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. సఫాయి కర్మచారుల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే మెట్రో రైలును ఔటర్ రింగ్‌రోడ్డు వరకూ పొడిగిస్తామన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని, నగర రూపురేఖలు మారుస్తామని చెప్పారు. గ్రేటర్ ప్రజల కోసం మోడల్ మార్కెట్లు, మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల వంటివి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి రూ.42వేల కోట్లు ఖర్చు కానుందని చెప్పారు. దశల వారీగా ఈ పనులు చేస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ హెల్త్సెంటర్లను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆదేశించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని 77 నాలాలు, మురికికాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ఏం చేయాలనే అంశంపై ప్రజాప్రతినిధులతో కమిటీని నియమించాలని సీఎం సూచించారు. గ్రేటర్లో చెత్త సేకరణను జీహెచ్ఎంసీయేనిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఢిల్లీ, నాగ్‌పూర్‌లలోని పరిస్థితులను ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యే లక్ష్మణ్ వివరించారు. రెండు నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ హెల్త్సెంటర్లు ఇక జీహెచ్ఎంసీపరిధిలోకి రానున్నాయి. గ్రేటర్లో 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 1994 నుంచి 2001 వరకు ఇవి అప్పటి ఎంసీహెచ్ ఆధ్వర్యంలో పనిచేశాయి. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వెళ్లాయి. వాటిలోని 48 సెంటర్లు డీఎంఓహెచ్కు బదలాయించారు. అయినప్పటికీ ఆ భవనాలకు నీరు, విద్యుత్, టెలిఫోన్ బిల్లుల చెల్లింపుతో పాటు ఆగాపురా, బాలాగంజ్, బేగంబజార్, దారుల్షిఫా, చార్మినార్, గగన్‌మహల్, హర్రాజ్‌పెంట, కార్వాన్, న్యూబోయిగూడ, పాన్‌బజార్, పురానాపూల్, యాకుత్‌పురా, బొగ్గులకుంట తదితర కేంద్రాల్లోని వైద్యుల జీతభత్యాలను జీహెచ్ఎంసీయే చెల్లిస్తోంది. హెచ్ఓడీల పర్యవేక్షణ లేకుండా జీహెచ్ఎంసీ నుంచి జీతాలు వెళ్లడం ఆరోపణలకు తావిచ్చింది. మరోవైపు నగరంలో ఆరోగ్యం-పారిశుద్ధ్యం నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు .. ముఖ్యంగా పేదబస్తీల్లోని వారికి వైద్య సేవలందించేందుకు వాటి నిర్వహణ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండాలని గతంలో స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రస్తావించారు. తద్వారా ఆరోగ్యం-పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహనతోపాటు బస్తీల్లో వైద్య శిబిరాల నిర్వహణకూ వీలుంటుందని భావించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ అంశాలపై దృష్టి సారించారు. నిధులిచ్చేదొకరు.. పర్యవేక్షణ మరొకరి పరిధిలో ఉండటంతో ప్రజలకు సేవలందడం లేదు. అన్నిటినీ ప్రభుత్వానికి వివరించడంతో...ఆర్బన్ హెల్త్ సెంటర్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకు రావాలని సీఎం నిర్ణయించారు. ఇదీ ప్రతినిథుల మాట బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర అభివృద్ధికి సలహాలు, సూచనలిచ్చారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు... తేడాలొస్తే వ్యతిరేకిస్తాం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ ప్రణాళిక చాలా బాగుందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఇదొక మంచి కార్యక్రమమని... పార్టీలకు అతీతంగా అందరూ తమ సూచనలు చేశారని తెలిపారు. అభివృద్ధిలో ఏమైనా తేడాలొస్తే వ్యతిరేకిస్తామన్నారు. పరిష్కారానికి అవకాశం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ సమావేశం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మూసీని శుభ్రం చేయాలని సూచించినట్లు చెప్పారు. నగర సమస్యలకు సంబంధించిన బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించడం వల్ల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒక్కో సమస్యపై ఒకటి చొప్పున తొమ్మిది సబ్ కమిటీలు వేశారని... ఈ ప్లానింగ్ బాగుందని అన్నారు. వీటిఅమలుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చాయ్.. బిస్కెట్ సమావేశం ఇది చాయ్, బిస్కెట్ సమావేశంలా ఉందని... నియోజకవర్గాలకు పైసా కూడా విదల్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ (టీడీపీ) ప్రశ్నించారు. కమిటీల వల్ల ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు. టైం పాస్ సమావేశాల వల్ల ఉపయోగం లేదన్నారు. పారదర్శకత అవసరం ఒక్కో నియోజకవర్గానికి వేయి చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరినట్టు ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ (బీజేపీ) తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఇళ్ల నిర్మాణంలో పాదర్శకత ఉండాలని కోరినట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి కొత్త పైప్లైన్లు వేయాలని సూచించామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు బాగున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా మిషన్ ‘కాకతీయ’ ద్వారా చెరువులను సుందరీకరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పామన్నారు. తప్పుల మీద తప్పులు చంద్రబాబుకు మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎంపీ వేణుగోపాలాచారి ఆరోపించారు. నోటుకు ఓటు కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టేపుల్లోని వాయిస్ తనదా కాదా అన్నది చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. వార్డులతో పాటే జోన్లు? నగరంలోని జోన్లను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో... అందుకు అనుగుణంగా సర్కిళ్లు కూడా పెరిగే వీలుంది. ప్రస్తుతం గ్రేటర్లో 18 సర్కిళ్లు ఉన్నాయి. వాటిని 30కి పెంచాలని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. జోన్లలోని సర్కిళ్ల సంఖ్యలోనూ ప్రస్తుతం వ్యత్యాసాలు ఉన్నాయి. జోన్లను పెంచితే ఈ దిశగా కూడా మార్పులు తప్పవు. కమిటీ సిఫార్సుల మేరకు పలు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రెండు దశల్లో 2,607 పోస్టుల భర్తీకి గతంలో ఉమ్మడి రాష్టంలోనే నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనంత సిబ్బందిని నియమిస్తామని తాజాగా సీఎం కూడా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో సీఎం నోట జోన్ల పెంపు మాట చర్చనీయాంశంగా మారింది. వార్డులతో పాటే వీటిని పెంచుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సరఫరాకు ప్రణాళిక గ్రేటర్ పరిధిలో చెత్తను తరలించడానికి 2500 ఆటోలు, వేయి రిక్షాలు కొనాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్‌తో సహా పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా పెంచాలని నిర్ణయించామన్నారు. నగరానికి 723 ఎంఎల్డీ నీళ్లు అవసరమని...దీనికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో హైదరాబాద్‌ను దేశంలో నెం-1సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హెచ్ఎండీఏలో ప్రక్షాళన జరుగుతోందన్నారు. టీ న్యూస్‌కు ఆంధ్రా పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు. -
కుక్క కరిస్తే.. దేవుడే దిక్కు!
అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏడు నెలలుగా ఏఆర్వీ లేదు నగరంలో శునకాల స్వైర విహారం రోజుకు 20 నుంచి 30 మందిపై దాడి.. ఏ ఏరియాలో కుక్క కరిచినా ప్రభుత్వాస్పత్రికే పరుగు ఏఆర్వీ అందుబాటులో ఉంది కుక్కకాటుకు గురైనవారికి వేసే ఏఆర్వీ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉంది. అయితే అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో నగరపాలక సంస్థలోనే స్టోరేజీ చేస్తున్నాం. ఏదైనా సెంటర్‌కు అవసరమైనప్పుడు సిబ్బంది వచ్చి తీసుకెళ్లవచ్చు. - డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్, కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ లబ్బీపేట : నగర జనాభా 10.22 లక్షలు. వారికి ప్రాథమిక వైద్యం చేసేందుకు 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలుగా ఈ ఆస్పత్రుల్లో కుక్క కరిచిన వారికి వేసేం దుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) అందుబాటులేదు. దీంతో నగరంలోని ఏ ప్రాంతం వారు కుక్కకాటుకు గురైనా గుణదలలోని ప్రభుత్వాస్పత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.రోజూ సగటున 20 నుంచి 30 మంది, నెలకు 700 మందికి పైగా కుక్కకాటుకు గురైనవారు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఇమ్యూనో గ్లోబలిన్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, బయట కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా లభించకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏఆర్వీ అందుబాటులోకి తీసుకురాకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. గుంపులు గుంపులుగా కుక్కలు.. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడిచేస్తున్నాయి. గట్టువెన ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు శ్యామ్‌పై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. సోమవారం కూడా భవానీపురంలో నివసించే ఓ మహిళ, చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కుక్క కాటుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఏఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అన్నీ తెలిసినా... వైద్య శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలతోపాటు కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏడు నెలలుగా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ఏఆర్వీ అందుబాటులో లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి నగరపాలక సంస్థల అధికారులు చూస్తూనే ఉన్నారు. వాటిని నియంత్రించేందుకు జీవకారుణ్య సంస్థలు అడ్డుగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే, కుక్క కరిస్తే బాధితులకు వేసేందుకు ఏఆర్వీ కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కుక్కకాటుకు గురైన వారు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళితే తమ వద్ద మందు లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యాధరపురం, భవానీపురం, కబేళా, కండ్రిక, సింగ్‌నగర్ వంటి దూరప్రాంతాల నుంచి సైతం వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. కుక్కకాటుకు గురైన వారు ఆరుసార్లు వాక్సిన్ వేయించుకోవాల్సి ఉండటంతో దూరప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ల కొరత.. కుక్కకాటుకు గురైన వారి పరిస్థితిని బట్టి ఏఆర్వీతోపాటు ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ కూడా చేస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నా, పిచ్చి కుక్క కరిచినా, మెడ, తలపై భాగాల్లో గాయాలైనా ఈ ఇంజక్షన్ చేస్తారు. ఇంతటి విలువైన ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ ప్రభుత్వాస్పత్రిలో 20 రోజులుగా అందుబాటులో లేదు. ఈ ఇంజక్షన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కూడా లేకపోవడం వల్లే ఆదివారం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన బాలుడు శ్యామ్‌ను గుంటూరు రెఫర్ చేశామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాస్పత్రిలో ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్లతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏఆర్వీలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్
నిజామాబాద్ అర్బన్ : పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా వీటిని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలోకి చేర్చుతున్నారు. దీంతో వీటి నిర్వహణ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోకి వెళ్లనుంది. 2000 సంవత్సరంలో ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. జిల్లాలో పది అర్బన్ హెల్త్ సెంటర్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏడు, కామారెడ్డిలో ఒకటి, బోధన్ లో రెండు చొప్పున యూహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్ వాచ్‌మన్, ఇద్దరు ఎఎన్ఎంలు వైద్యసేవ లు అందిస్తున్నారు. వీరికి అవసరమైన మందులను ప్రభుత్వ మే సరఫరా చేస్తోంది. ఒక్కో కేంద్రం నిర్వహణకు ప్రతి నెల రూ. 66,700 వేలు కేటాయిస్తుంది. సిబ్బంది వేతనాలను ఎన్జీఓలు సమకూరుస్తారు. కానీ, వీటి నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో మున్సిపల్ పరిధికి తీసుకురావాలని భావిస్తున్నారు. పెలైట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక పట్టణ ఆరోగ్య కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పరిధిలోకి చేర్చేందుకు దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో తెలంగాణ నుంచి నిజామాబాద్ జిల్లా కూడా ఉంది. గత నెల రో జుల నుంచే పట్టణ ఆరోగ్య కేంద్రాలు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో పట్టణవాసులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా వీటిని తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నారు. ఇప్పటి వరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేం ద్రాన్ని మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. ఇక నుంచి కనీస ముగ్గురు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా ముగ్గురు ఎఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియషన్లు, హెల్త్ సూపర్వైజర్లతోపాటు, జిల్లాకు నోడల్ అధికారిని నియమించనున్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలను సమ కూర్చనున్నారు. ఇప్పటికే జి ల్లా వైద్యాధికారులు, మున్సిపాలిటీ అధికారులతో హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోకే పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ మున్సిపల్ పరిధిలోకి వెళ్లనుంది. ఇదివరకే వీటి నిర్వహణ తీరు వివరాలను మున్సిపల్ అధికారులకు అందజేశాం,ఉన్నతాధికారు ల నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు రాగానే పట్టణ ఆరోగ్య కేంద్రాలను వారికి స్వాధీనం చేస్తాం. -గోవింద్ వాఘ్మారే, జిల్లా వైద్యాధికారి -
అర్బన్ హెల్త్‌సెంటర్లకు హంగులు
సాక్షి, కరీంనగర్ : పట్టణ ఆరోగ్యకేంద్రాలకు మహర్దశ పట్టనుంది. ఏళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల చేతిలో కొనసాగుతూ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్న ఈ కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) కిందకు చేర్చి మెరుగైన వైద్యం అందించనున్నారు. నిర్వహణను ఆయా మున్సిపాలిటీలకే అప్పగించనున్నారు.పట్టణ ప్రజలకు వైద్యసేవలందించేందుకు 2000లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేం ద్రాలు లక్ష్యం చేరలేదు. గోదావరిఖనిలో ఆరు, కరీంనగర్, జగిత్యాలలో మూడు, సిరిసిల్లలో రెండు, కోరుట్ల, మెట్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున జిల్లాలో మొత్తం 16 అర్బన్ హెల్త్సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఓ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్‌వాచ్‌మన్, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించుకోవాలని సూచించింది. అవసరమయ్యే మందులు ప్రభుత్వమే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తుంది. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం ప్రతినెల రూ.66,700 కేటాయిస్తుంది. ఎన్జీవోలు ఒక్కొక్కరికి ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం సమయానికి కూడా తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్లు సాధించిన ప్రగతిని తెలుసుకుంటూ లక్ష్యాలు సాధించని నిర్వాహకుల నుంచి కేంద్రాలు స్వాధీనం చేసుకుని నిర్వహణను సమీప కేంద్రాలు, వైద్యారోగ్యశాఖకు అప్పగిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో మెట్పల్లి, గోదావరిఖని లోని అల్లూరు, జగిత్యాలలో ఓ కేంద్రాన్ని రద్దు చేసి.. వాటి నిర్వహణను వైద్యశాఖకు అప్పగించింది. మరోపక్క.. స్వీపర్లు, వాచ్మెన్లు, అవసరం మేరకు వైద్య సిబ్బందిని నియమించక ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సంఘటనలు పలు కేంద్రాల్లో చోటు చేసుకున్నాయి. ఇవి అధికారుల దృష్టికి రావడంతో నిధులు ఆపేశారు. మెరుగైన వైద్యం పట్టణాలు, నగరాల్లోనూ మెరుగైన సేవల కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అర్బన్హెల్త్సెంటర్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థల నుంచి తప్పించి ఎన్యూహెచ్ం కిందను తీసుకువచ్చి మున్సిపాలటీలకే అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించనున్నారు. ఇప్పటివరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రం కేటాయించనున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉండగా ఇకపై కనీసం ముగ్గురు వైద్యులుండేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా ముగ్గురు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్‌వైజర్‌తోపాటు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. అద్దె భవనాల్లో కొనసాగుతోన్న కోరుట్ల, మెట్పల్లి, ఫైవింక్లయిన్కాలనీ, కట్టరాంపూర్ కేంద్రాలకు సొంత భవనాలు రానున్నాయి. ఇప్పటి కే రాష్ట్ర వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కావాల్సిన వసతులపై అధికారులు కసరత్తు పూర్తి చేసి తాజాగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.