ఆర్భాటం చేసి.. వదిలేశారు!
Published Wed, Nov 30 2016 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
విజయనగరం ఫోర్ట్ : పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ-యూపీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చే శాం.. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ గొప్ప లు చెప్పుకున్న ప్రభుత్వం.. ఆచరణలో చేసి చూపలేకపోయింది. ఇక మీదట టెలీ మెడిషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గతంలో వైద్య సేవలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడూ అలానే ఉన్నాయి. పెద్దగా మార్పు రాలేదు.
పేరు మార్చి అప్పగింత
పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ- పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(ఈ-యూపీహెచ్‌సీ)లుగా ప్రభుత్వం ఇటీవల పేరు మార్చింది. వాటి నిర్వహణను ధనుష్ ఇన్ఫోటెక్ అనే ఏజెన్సీకి గత నెలలో అప్పగించింది. ఈ-యూపీహెచ్‌సీల్లో కొత్తగా వైద్య పరీక్షలు చేస్తారని, టెలీ మెడిషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందుకోసం నిధులను కూడా రెట్టింపు చేసింది. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను స్వచ్ఛం ద సంస్థలు నిర్వహించేవి. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి నెల కు రూ.60 వేలు నుంచి రూ.80 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు నిధులను రూ. 4.12 లక్షలకు పెంచారు. అయినప్పటికీ వైద్య పరీక్షలు జరగడం లేదు. దీంతో వైద్య పరీక్షల కోసం కొనుగోలు చేసిన పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. టెలీ మెడిషన్ సేవలు కూడా అమలు కావడం లేదని తెలిసింది. ఫలితంగా పట్టణ ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ లేబ్‌రేటరీలనే ఆశ్రరుుంచాల్సి వస్తోంది.
అన్నింటా ఇదే పరిస్థితి
జిల్లాలో ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విజయనగరంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, సాలూరులో ఒకటి, పార్వతీపురంలో ఒకటి చొప్పున ఉన్నాయి. అన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది.
Advertisement