‘హోమియో’ వైపు చూడరూ..!
సూదుల బాధ ఉండదు. కత్తెర, బ్లేడులతో పని ఉండదు. రోజుల తరబడి ఒంటికి ఇంజెక్షన్లు చేయించుకోవాలనే సమస్య ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం లేదు. అందుకే వైద్యులు హోమియో వైద్యం వైపు చూడమని సలహా ఇస్తున్నారు. ఈ ప్రాచీన వైద్య విధానంతో వ్యాధులను ఇట్టే నయం చేయవచ్చని వారు చెబుతున్నారు. అన్ని రకాల వ్యాధులు, జబ్బులకు హోమియోలో మందులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
విజయనగరం రూరల్: హోమియో వైద్యాన్ని జిల్లా వాసులు వినియోగించుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఈ తరహా వైద్యంలో ధీర్ఘకాలిక వ్యాధులతో పా టు తరుణ వ్యాధులు, గాయాలు, తేలు, పాము కాటులకు సైతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే హోమియో వైద్యంపై ప్రజలకు కొన్ని అ పోహలు ఉన్నాయి. ‘కఠిన పత్యాలు ఉంటాయి. అన్ని జబ్బులకు ఒకే మందు. ఇతర మందులు పనిచేయవు, గర్భిణులు వాడకూడదు. స్టిరాయిడ్స్ కలిపి ఉంటాయి. కేవలం పిల్స్ (గుళికలు) రూపంలో ఉంటాయి. వైద్య పరీక్షలు చే యరు. రోగం వేగంగా నయం కాదు’ అనే అపోహలు జనంలో ఉండడంతో దీనికి అంతగా ఆదరణ రాలేదు. కానీ ఇటీవల ఈ వైద్యంపై మంచి ప్రచారం నిర్వహిస్తున్నారు.
దీనికి ప్రజల నుంచి కూడా స్పందన లభిస్తోంది. అలాగే హోమియో వైద్యం ద్వారా ప్రజలకు వ్యాధులు కూడా నయం కావడంతో ఈ వైద్యానికి డిమాండ్ పెరుగుతోంది. హోమియో వైద్యంలో అత్యవసరమైన వాటికి చికిత్సలు ఉన్నాయని, హో మియో మందులు వాడటం ద్వారా శరీరంలో వ్యాధి కారక మూలలను పూర్తిగా న యం చేసే అవకాశం ఉందని రాకోడు హోమియో వైద్యాధికారి, ఏపీ రాష్ట్ర హోమియోపతిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంబంగి శ్రీనివాస్ అన్నారు. దీంతో భవిష్యత్‌లో ధీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశం ఉండదన్నారు.
తరుణ వ్యాధులకు చికిత్స
ధీర్ఘకాలిక వ్యాధులతో పాటు తరుణ వ్యాధులకు మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులు, గాయాలు, తలనొప్పి వంటి వాటికి హోమియోలో వేగంగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి.
వ్యాధి నివారణ ఔషధాలు అందుబాటులో...
ప్రస్తుతం సమాజంలో కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో అనేక వాటికి హోమియోలో మెరుగైన నివారణ ఔషధాలు అం దుబాటులో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడువాపు, చికున్‌గున్యా, డెం గ్యూ, స్వైన్‌ఫ్లూ, చికెన్‌పాక్, కండ్ల కలక, మీజిల్స్ వంటి వ్యా ధుల నివారణకు, అవి రాకుండా నివారించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సుఖప్రసవానికి, గర్భిణుల్లో వచ్చే వ్యాధులకు, చిన్నపిల్లల్లో కలిగే వ్యాధులతో పాటు తేలు, పాము కాటులకు చికిత్స అందించే ఔషధాలు ఉన్నాయి.
ఆపరేషన్ అవసరం లేకుండా...
అనేక వ్యాధులకు అల్లోపతిలో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే హోమియో వైద్యంలో ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం మందులతోనే వాటిని నయం చేయొచ్చు. సైనసైటిస్, టాన్సిలైటీస్, మూత్రపిండాల్లో రాళ్లు, సియాటికా, ఆనెలు (కళ్లొత్తులు), ఫైల్స్ (మూలవ్యాధి), ఫిషర్ వ్యాధులకు హోమియోలో చికిత్స అందుబాటులో ఉంది.
అన్ని వయస్సుల వారికి...
చిన్న పిల్లల నుంచి మలి వయస్సు ఉన్న వారిలో జబ్బులను నయం చేసే ఉత్తమ వైద్యం హోమియోలో అందుతుంది. హోమియో వైద్యంలో అన్ని వ్యాధులను నయం చేసే ఉత్తమ వైద్య విధానం అందుబాటులో ఉంది. కొన్నేళ్ల వరకు హోమియో వైద్యంపై ప్రజలకు అంతగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఇటీవల పరిస్థితుల్లో మార్పులు వచ్చా యి. అయితే కొన్ని ధీర్ఘకాలిక వ్యాధులకు వెంటనే సాంత్వన చేకూరకపోయినా భవిష్యత్‌లో వ్యాధులు తలెత్తే అవకాశం లేదు. కఠిన పత్యాలు అవసరంలేదు.రోగి వ్యాధు లను బట్టి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.