Homeopathic medicine
-
మూడేళ్లయినా పిల్లలు లేరు
మాకు పెళ్లయి మూడేళ్లైంది. పిల్లలు లేరు. డాక్టర్ని సంప్రదిస్తే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ కావచ్చు అన్నారు. హోమియో వైద్యం ద్వారా సంతానాన్ని పొందవచ్చా? – వి. ఆర్. ఆర్, వెదురులంక సంతానలేమిలో రకాలు: మొదటిది ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ. అసలు గర్భం దాల్చని పరిస్థితులు. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే మొదటిసారి గర్భం దాల్చి బిడ్డను కన్న తర్వాత కొందరిలో రెండవసారి గర్భధారణ జరగదు. ఇక మూడవది సంతానలేమి అంటే స్టెరిలిటీ. సంతానం కలగడానికి ఏ మాత్రం అర్హత లేని పరిస్థితులు. స్త్రీ గర్భధారణ హార్మోన్ల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. అండ కణాభివృద్ధికి తోడ్పడేది హార్మోన్లే. ఈ హార్మోన్ల మధ్య అసమతుల్యం ఏర్పడి ఉత్పత్తిలో లోపం జరిగితే సంతాన సాఫల్యతను దెబ్బతీస్తుంది. కారణాలు: అండ వాహికలు, అండాశయంలో లోపాలు, దీర్ఘకాలిక వ్యాధులు, అండాశయం సరిగ్గా వృద్ధి చెందకపోవడం వల్ల సంతానం కలగకపోవచ్చు. అండాశయసమస్యలు: చిన్న చిన్న ఫాలికల్ సిస్ట్ (తిత్తులు) ఏర్పడి అండాశయం వెడల్పు కావడం. అండాశయం సరిగ్గా వృద్ధి చెందకపోవడం. అండవాహిక లోపాలు: అండ వాహికల కండరాల కదలికకు ఆటంకం కలగడం, అండవాహికలు పూడిపోవడం, పగుళ్లు రావడం వలన గర్భధారణ కష్టమవుతుంది. ఈ సమస్య రావడానికి గనేరియా లాంటి వ్యాధులు, ఐయుడి, అబార్షన్ తర్వాత ఇన్ఫెక్షన్ రావడం, అపెండిక్స్ పగిలిపోవడం కారణం కావచ్చు. ఎక్టోపిక్ గర్భధారణ: ఫెలోపియన్ కదలిక సరిగ్గా లేనప్పుడు, వీర్యకణంలో సంయోగం చెంది అండం ముందుకు సాగలేక అక్కడే ఉండిపోయి పిండం కింద అభివృద్ధి చెందడం. ఇలా అభివృద్ధి చెందడం వలన వాహికలు పగిలిపోయే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్: గర్భాశయం లోపల ఉండే పొరలు రక్తస్రావంతో కలిసి బహిర్గతమవుతాయి. ఒకవేళ ఈ పొరలు పొట్ట అడుగుభాగంలో చేరిపోతే ఈ స్థితిని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ స్థితి అండవాహికలను స్థానభ్రంశం చేసి అండకణ ప్రయాణానికి అవరోధం కలిగించి సంతానలేమికి కారణమవుతుంది. గర్భాశయంలో ఇన్ఫెక్షన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, పిట్యూటరీ గ్రంథుల సమస్యలు, సుఖరోగాలు, డయాబెటిస్, మానసిక సమస్యలు ఉన్నప్పుడు గర్భధారణ కష్టం హోమియో వైద్యంలో మనిషి తత్వాన్ని బట్టి శారీరక, మానసిక లక్షణాలను బట్టి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో పరిస్థితిని చక్కబరచవచ్చు. పల్సటిల్లా, సెపియా, నేట్రంమూర్, థైరాయిడినమ్, పాస్ఫరస్, సైఆసియా, లైపో సోడియం, కాత్కయా ప్లోర్ వంటి మందులతో గర్భధారణ సమస్యలను నయం చేయడం సాధ్యమే. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ సెబోరిక్ డర్మటైటిస్ అంటే..? హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 45 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? హోమియోలో పూర్తిగా నయమవుతుందా? – దయాకర్‌రావు, నల్గొండ సెబోరిక్ డర్మటైటిస్ అనేది తరచూ తిరగ బెడుతూ బాధపెడుతుండే వ్యాధి. చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. చాలా ఎక్కువ మందిని వేధించే సమస్య ఇది. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు: ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది ∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు: ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పిల్లాడు ఎవరితో కలవడం లేదు! మా అబ్బాయికి ఆరేళ్లు. బాబు కొద్ది గంటల పాటు స్తబ్దుగా ఉంటున్నారు. అకారణంగా ఏడుస్తున్నాడు. ఇతరులతో కలవడం లేదు. డాక్టర్ని సంప్రదిస్తే ఆటిజం అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – కె.ఎస్. రావు, ఎల్లెందు ఆటిజం అనేది భిన్న విభాగాలకు సంబంధించిన ఎదుగుదల సమ్య. దీనినే పల్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. దీని వలన పిల్లల ఎదుగుదల అస్తవ్యస్థమవుతుంది. దీనితో బాధపడే అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాలు గుర్తిస్తే అధిగమించడం సులభం. కారణాలు: ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. కానీ కొన్నిసార్లు మెదడు పెరుగుదల, పనితీరులో వచ్చే అసాధారణ లోపాల వలన ఆటిజం రావచ్చు. తల్లి గర్భంలో ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు లేదా వాతావరణంలో వచ్చే మార్చుల వల్ల కూడా ఇది రావచ్చు. లక్షణాలు: ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇతరులతో కలవలేకపోవడం ∙తోటి పిల్లలతో ఆడుకోవడానికి అంతగా ఇష్టపడకపోవడం ∙ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుండడం ∙కాళ్లు, చేతులను అదే పనిగా ఆడిస్తుండడం ∙ఒకే రకమైన వస్తువులతో ఆడుకోవడం, అలాంటి వాటినే సేకరించడం ∙భావ వ్యక్తీకరణ లోపం ∙తమ పనులను తాము చేసుకోకపోవడం, మాటలు రాకపోవడం నిర్ధారించడం ఎలా? మరీ చిన్న వయసు పిల్లల్లో: ∙తల్లి దగ్గరకు తీసుకుంటున్నా స్పందించకపోవడం ∙గంటల తరబడి స్తబ్దుగా ఉండడం ∙తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచినప్పుడు ఉత్సాహంగా స్పందించకపోవడం ∙పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వకపోవడం ∙నిరంతరం అకారణంగా ఏడవడం కాస్త పెద్ద పిల్లల్లో: ∙కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం ∙ప్రశ్న అడిగిన వెంటనే స్పందించకుండా తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను పదే పదే అడుగుతూ ఉండడం ∙మిగతా పిల్లలతో కలవకపోవడం మనుషులకంటే ఎక్కువగా వస్తువులు, బొమ్మల పట్ల ఆసక్తి చూపడం ∙భావోద్వేగాలు చూపించకపోవడం అంటే నొప్పికీ, బాధకీ స్పందించకపోవడం ∙కాళ్లు, చేతులు అసహజంగా కదిలించడం అసందర్భ మాటలు ∙ఉండాల్సిన దానికంటే ఎక్కువ చురుకు ∙మానసిక ఎదుగుదల లోపించడం కనిపిస్తాయి. నివారణ: పోషకాహారం పెట్టాలి. పిల్లలను ఒంటరిగా వదలకుండా వారితో ఎక్కువ సేపు గడపాలి. హోమియోలో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
హోమియోపై మరిన్ని పరిశోధనలు
అంటువ్యాధుల నివారణ కోసం భారత్, ఆస్ట్రేలియా సంస్థల ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ కోసం హోమియో వైద్యంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఎన్ఐఐఎం) ఆస్ట్రేలియా సంస్థలు ఆదివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. రామంతాపూర్ హోమియో కాలేజీలో జరిగిన సదస్సులో ఐఐహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎ.రావు, ఆస్ట్రేలియా ఎన్ఐఐఎం తరఫున డాక్టర్ ఐజాక్ గోల్డెన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. హోమియో మందులను అంటువ్యాధుల నివారణలో మరింత మెరుగ్గా ఉపయోగించడానికి, మందుల ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐహెచ్‌పీ అంటువ్యాధుల నివారణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండు దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధిని సమూలంగా నిర్మూలించడంలో హోమియో వైద్యులు విజయం సాధించారన్నారు. -
ఎయిడ్స్‌కు హోమియోపతి చికిత్స
చెన్నై : హోమియోపతి చికిత్సతో హెచ్ఐవీ వైరస్‌ను సైతం నివారించవచ్చని పరిశోధనల్లో రుజువైనట్లు గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, పీఆర్వో డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 90 శాతం పరిశోధనల్లోనూ, పది శాతం చికిత్స ద్వారా నిర్ధారించుకున్నామని వారు చెప్పారు. మంగళవారం చెన్నైలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జేఎస్పీఎస్ ప్రభ్వు హోమియోపతి వైద్య కళాశాల (హైదరాబాద్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(హైదరాబాద్)కు చెందిన వైద్యులు జరిపిన పరిశోధనల ద్వారా కనుగొన్న క్రొటాలస్ సారిడస్ అనే మందు ద్వారా ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్ బీ వైరస్‌లను సమూలంగా నివారించవచ్చని రుజువైందని తెలిపారు. ముంబ యికి చెందిన డాక్టర్ రాజేష్ షా సైతం రెండేళ్ల పరిశోధనలతో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందు కనుగొన్నారని చెప్పారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో ఈ ఎయిడ్స్ నివారణ గురించి ప్రచురితమైందన్నారు. ముంబయిలో అంతర్జాతీయ సదస్సు హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక విధానాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో ముంబయిలో ‘వరల్డ్ హోమియోపతి సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మిట్‌లో వివిధ దేశాలకు చెందిన 9 మంది స్పీకర్లు ప్రసంగిస్తారని, అలాగే 25 మంది శాస్త్రవేత్తలు హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక చికిత్స విధానాలను వివరిస్తారని చెప్పారు. సైడ్‌ఎఫెక్ట్స్‌లేని, అతి చౌకైన, వ్యాధిని సమూలంగా నివారించగల మందులు హోమియోపతిలో ఉన్నాయని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ, అధికార శక్తులు అల్లోపతి మందుల తయారీ కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తూ ఈ మందులు వెలుగులోకి రానీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోమియోపతి మందుల పట్ల ప్రజల్లోనే మార్పు రావాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. -
రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
-
రక్త పింజర విషంతో ఎయిడ్స్‌కు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధులను సమర్థంగా నివారించేందుకు ఓ కొత్త, సమర్థమైన హోమియో ఔషధం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు, ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్-బి కారక వైరస్ల వ్యాప్తిని నిరోధించే ఈ ఔషధం తయారీపై వీరి పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. రక్తపింజర(క్రొటాలస్ హెరిడస్) విషం ఆర్టీ అనే ఎంజైమ్‌ను నిరోధించగలదని వీరు ఇదివరకే శాస్త్రీయంగా నిరూపించారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రథమ ఎస్. మెయింకర్, రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్‌లు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. క్రోటాలస్ హెరిడస్ విషానికి ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ కణాల విభజనను అడ్డుకునే శక్తి ఉన్నట్లు వీరు తెలిపారు. ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మార్చి, దానిని అభివృద్ధి చేసి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్- బి వంటి వైరస్ల బారి నుంచి రోగులను కాపాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పరిశోధనలు, సాధించిన ఫలితాల పూర్తి వివరాలను ఈ నెల 11న ముంబైలో జరగనున్న ప్రపంచ హోమియోపతి సదస్సులో వెల్లడించనున్నట్లు తెలిపారు. హోమియోపతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నా, హోమియో మందుల శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల వీటిపై సందేహాలను పటాపంచలు చేయాలన్న ఆలోచనతోనే ప్రపంచ హోమియో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు. -
హోమియో వైద్యంతో ‘హెపటైటిస్-బి’కి చెక్
లైంగిక వ్యాధులు అంటే ఒక భయం, ఎన్నో రకాలసమస్యలు, అవగాహన లోపం, తెలియని ఆతృత. ఏదో ఒక మందుతో దాన్ని తగ్గించుకోవాలనే ఆరాటం. వీటన్నిటి మధ్య నలిగిపోయేవారు ఎందరో ! సరైన చికిత్స లేక ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సత్వరమైన పరిష్కారంతో, నమ్మకమైన చికిత్సతో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మధు వారణాశి. లైంగిక వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి హెపటైటిస్ బి. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా హెపటైటిస్ బి బారిన పడినట్లుగా తెలుస్తోంది. వైరల్ సంబంధిత వ్యాధులలో హెపటైటిస్ బి ఒక మహమ్మారిగా మారే సూచికలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు కోట్ల మంది హెపటైటిస్ బి తో బాధపడుతున్నారని అంచనా. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా భారతీయులు హెపటైటిస్ బి మూలంగా మరణిస్తున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో వైరస్ ఉంటుంది. అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల ఇది సంక్రమిస్తుంది. తల్లులనుంచి పిల్లలకు, శిశువు నుండి శిశువుకు సంక్రమిస్తుంది. అవగాహన లోపంతో ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. హెపటైటిస్ బి అంటే? మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన భా గం. ఎన్నో కార్యక్రమాలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే ఎన్నో బాధలు, ఎన్నో విపత్తులు ఎదురవుతాయి. కొన్ని రకాలైవైరస్ కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధి వస్తుంది. వీటిలో ప్రమాదకరమైనవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సివీటిని హెపటోట్రోఫిక్ వైరసస్ అని అంటారు. హెపటైటిస్ బి మొదట మామూలు లక్షణాలతో వచ్చి, అది దీర్ఘకాలికంగా మారి, కాలేయాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తుంది. లివర్ కేన్సర్,సిర్రోసిస్,వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి మూలకారణం అవుతుంది. హెపటైటిస్ బి వల్ల కాలేయంలోని కణజాలం క్రమక్రమంగా పాడవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం వల్ల కాలేయం నిర్వహించే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కాలేయంలో వాపు వచ్చి పలు రకాలసమస్యలకు తోడ్పడుతుంది. కారణాలు ఏమిటి? స్టెరిలైజ్ చేయని సిరంజీలు, లైంగిక సంపర్కం ద్వారా. పటైటిస్ బి ఉన్న వ్యక్తి నుండి నేత్రాలు, త్రపిండాలు, రక్తం తీసుకోవడం వల్ల. పటైటిస్ బి సోకిన వారి రక్తం, గాయాల ద్వారా, ఏ కారణం చేతనైనా వీరి రక్తం వేరేవాళ్లకు తాకడం ద్వారా. చ్చబొట్టు, ఒకే బ్లేడ్, ఒకే సిరంజి ఎక్కువ మంది వాడినపుడు, కలుషితమైన ఆహారం.బ్యాక్టీరియా, అమీబాలవంటి పరాన్నజీవులవల్ల హెపటైటిస్ బి వ్యాప్తిస్తుంది. ఎయిడ్స్కన్నా ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించవచ్చును. లక్షణాలు సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు నిశ్శబ్దంగా ఉంటాయి.హెపటైటిస్ బి వైరస్ ఎన్నో సంవత్సరాలు శరీరంలో ఉంటుంది. శరీరం వెలుపల సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం రోజులు మాత్రమే సజీవంగా ఉండగలదు. కొంత మందిలో ఈ వైరస్ ప్రవేశించిన కొద్ది రోజులకే కామెర్లు వస్తాయి. దీనిని అక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చును. ఈ దశలో దానంతటదే తగ్గుతుంది. కొంత మందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలో ఉంటూ బలం పెంచుకుంటూపోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్ బి కారణంగా కాలేయం వ్యాధిగ్రస్తమై భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు లక్షణాలు కనబడతాయి. ఎలా నివారించాలి? విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. అపరిచితులతో శృంగార జీవితంలో సురక్షితమైన పద్ధతులు అవలంబించాలి. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడాలి. ఒకరు వాడిన షేవింగ్ రేజర్లు, బ్లేడ్లను వాడరాదు. రక్తం తీసుకోవలసి వస్తే, హెపటైటిస్ బి పరీక్ష చేసి రక్తం ఎక్కించుకోవాలి. వ్యాధి నిర్ధారణ: హెచ్బిఎస్ ఎజి అనే రక్తపరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిపి, లివర్ బయాప్సి, వైరల్ లోడ్ ద్వారా రోగ తీవ్రతను గుర్తించవచ్చు. హోమియో చికిత్ససహజసూత్రాలపైన ఆధారపడిన హోమియో వైద్యం వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలసత్తా కలిగినది హోమియోపతి రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యునో మాడ్యులేటర్స్గా పనిచేస్తుంది. అందువల్ల మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. హెపటైటిస్ బి లాంటి కేసులలో ఆధునిక హోమియో చికిత్సతో రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని నివారించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధులను నయం చేయవచ్చు. డా.మధు వారణాశి, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యులు, ఫ్లాట్ నం.188, వివేకానందనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్, ఫోన్: 8897331110, 8886509509 -
సొరియాసిస్- హోమియో వైద్యం
దీర్ఘకాలం పాటు బాధించే చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగానూ, మనసికంగానూ ఎంతో నలిగిపోతున్నారు. అయితే ఈ వ్యాధితీవ్రత రావడానికి గల కారణాలు, రోగి శారీరక మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి సత్వర పరిష్కారం కోసం హోమియో చికిత్స అందించి సొరియాసిస్‌ను సమూలంగా తొలగించవచ్చు. ఎందుకు వస్తుంది: సొరియాసిస్ దీర్ఘకాలిక చర్మవ్యాధి. ఇది ఏ వయసులో వారికైన వచ్చే ఆవకాశం ఉంది. శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి వికటించడం వల్ల వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షణ పొందడానికి శరీరంలో తెల్ల రక్త కణాలనే ప్రత్యేక కణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. దీన్నే వ్యాధి నిరోధక శక్తి అంటాము. సొరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. చర్మ కణజాలాన్ని అపసవ్య పదార్థంగా అన్వయించుకొని దాడి చేసి, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాల వల్ల జరగవచ్చు. లక్షణాలు: సొరియాసిస్‌లో చర్మంపైన దురదతో కూడిన వెండి రంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. సొరియాసిస్ మచ్చలు మొదట్లో ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచే కొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. వాటిని తొలగిస్తే రక్తపు చారికలు కనిపిస్తాయి. వాతావరణం చల్లగా ఉండి, తేమ తగ్గిపోయినప్పుడు దురద ఎక్కువగా ఉంటుంది. దీంతో శీతాకాలంలో ఈ సమస్య జఠిలంగా మారుతుంది. కొంత మందిలో అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వ్యాపిస్తాయి. రకాలు: 1. ప్లేక్ సొరియాసిస్ (తల, మోకాలు, మోచేతుల భాగంలో వస్తుంది) 2. గట్టేట్ సొరియాసిస్ (గట్టా అనగా బిందువు) 3. పస్టులార్ సొరియాసిస్ (చీముతో కూడినది) 4. ఎరిత్రోడర్మతో సొరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపుదనం ఉండడం) వ్యాధి సోకిన చోట, జాయింట్లలో విపరీతమైన నొప్పి, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమై సొరియాసిస్‌తో బాధపడేవారిలో ఇది కనిపిస్తుంది. చికిత్సవిధానం-హోమియో దృక్పథం ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతంపై హోమియోపతి వైద్య విధానం ఆధారపడి ఉంది. సొరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా నివారించవచ్చు. -
అంకితభావంతో పనిచేయాలి
ఆయుర్వేద వైద్యులకు మోదీ సూచన న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించేందుకు వైద్యులు అంకితభావంతో పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వైద్యులు అంకితభావంతో పనిచేసేవరకూ ఆయుర్వేదం అభివృద్ధి చెందదన్నారు. ఆదివారమిక్కడ 6వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘మీకు మీరు అంకితభావంతో పనిచేయకపోతే.. రోగులకు భరోసా ఎలా ఇస్తారు? నా మాటలు చేదుగా అనిపించవచ్చు. కానీ చేదు మాత్ర మంచి చేస్తుంది’ అని చమత్కరించారు. అల్లోపతీ విధానం వ్యాధిని నయం చేస్తుందని, కానీ ఆయుర్వేదాన్ని పాటిస్తే భవిష్యత్తులోనూ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. మన పూర్వీకులకు ఆరోగ్యం జీవనంలో ఒక భాగం. కానీ మనం ఒక వైద్యుడి తర్వాత మరో వైద్యుడిని సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని ఔట్ సోర్సింగ్ చేసుకుంటున్నామన్నారు. అందుకే ఆయుర్వేదాన్ని వృత్తిలా కా కుండా మానవాళికి సేవగా గుర్తించాలన్నారు. -
‘హోమియో’ వైపు చూడరూ..!
సూదుల బాధ ఉండదు. కత్తెర, బ్లేడులతో పని ఉండదు. రోజుల తరబడి ఒంటికి ఇంజెక్షన్లు చేయించుకోవాలనే సమస్య ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం లేదు. అందుకే వైద్యులు హోమియో వైద్యం వైపు చూడమని సలహా ఇస్తున్నారు. ఈ ప్రాచీన వైద్య విధానంతో వ్యాధులను ఇట్టే నయం చేయవచ్చని వారు చెబుతున్నారు. అన్ని రకాల వ్యాధులు, జబ్బులకు హోమియోలో మందులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం రూరల్: హోమియో వైద్యాన్ని జిల్లా వాసులు వినియోగించుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఈ తరహా వైద్యంలో ధీర్ఘకాలిక వ్యాధులతో పా టు తరుణ వ్యాధులు, గాయాలు, తేలు, పాము కాటులకు సైతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే హోమియో వైద్యంపై ప్రజలకు కొన్ని అ పోహలు ఉన్నాయి. ‘కఠిన పత్యాలు ఉంటాయి. అన్ని జబ్బులకు ఒకే మందు. ఇతర మందులు పనిచేయవు, గర్భిణులు వాడకూడదు. స్టిరాయిడ్స్ కలిపి ఉంటాయి. కేవలం పిల్స్ (గుళికలు) రూపంలో ఉంటాయి. వైద్య పరీక్షలు చే యరు. రోగం వేగంగా నయం కాదు’ అనే అపోహలు జనంలో ఉండడంతో దీనికి అంతగా ఆదరణ రాలేదు. కానీ ఇటీవల ఈ వైద్యంపై మంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన లభిస్తోంది. అలాగే హోమియో వైద్యం ద్వారా ప్రజలకు వ్యాధులు కూడా నయం కావడంతో ఈ వైద్యానికి డిమాండ్ పెరుగుతోంది. హోమియో వైద్యంలో అత్యవసరమైన వాటికి చికిత్సలు ఉన్నాయని, హో మియో మందులు వాడటం ద్వారా శరీరంలో వ్యాధి కారక మూలలను పూర్తిగా న యం చేసే అవకాశం ఉందని రాకోడు హోమియో వైద్యాధికారి, ఏపీ రాష్ట్ర హోమియోపతిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంబంగి శ్రీనివాస్ అన్నారు. దీంతో భవిష్యత్‌లో ధీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశం ఉండదన్నారు. తరుణ వ్యాధులకు చికిత్స ధీర్ఘకాలిక వ్యాధులతో పాటు తరుణ వ్యాధులకు మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులు, గాయాలు, తలనొప్పి వంటి వాటికి హోమియోలో వేగంగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి నివారణ ఔషధాలు అందుబాటులో... ప్రస్తుతం సమాజంలో కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో అనేక వాటికి హోమియోలో మెరుగైన నివారణ ఔషధాలు అం దుబాటులో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడువాపు, చికున్‌గున్యా, డెం గ్యూ, స్వైన్‌ఫ్లూ, చికెన్పాక్, కండ్ల కలక, మీజిల్స్ వంటి వ్యా ధుల నివారణకు, అవి రాకుండా నివారించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సుఖప్రసవానికి, గర్భిణుల్లో వచ్చే వ్యాధులకు, చిన్నపిల్లల్లో కలిగే వ్యాధులతో పాటు తేలు, పాము కాటులకు చికిత్స అందించే ఔషధాలు ఉన్నాయి. ఆపరేషన్ అవసరం లేకుండా... అనేక వ్యాధులకు అల్లోపతిలో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే హోమియో వైద్యంలో ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం మందులతోనే వాటిని నయం చేయొచ్చు. సైనసైటిస్, టాన్సిలైటీస్, మూత్రపిండాల్లో రాళ్లు, సియాటికా, ఆనెలు (కళ్లొత్తులు), ఫైల్స్ (మూలవ్యాధి), ఫిషర్ వ్యాధులకు హోమియోలో చికిత్స అందుబాటులో ఉంది. అన్ని వయస్సుల వారికి... చిన్న పిల్లల నుంచి మలి వయస్సు ఉన్న వారిలో జబ్బులను నయం చేసే ఉత్తమ వైద్యం హోమియోలో అందుతుంది. హోమియో వైద్యంలో అన్ని వ్యాధులను నయం చేసే ఉత్తమ వైద్య విధానం అందుబాటులో ఉంది. కొన్నేళ్ల వరకు హోమియో వైద్యంపై ప్రజలకు అంతగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఇటీవల పరిస్థితుల్లో మార్పులు వచ్చా యి. అయితే కొన్ని ధీర్ఘకాలిక వ్యాధులకు వెంటనే సాంత్వన చేకూరకపోయినా భవిష్యత్‌లో వ్యాధులు తలెత్తే అవకాశం లేదు. కఠిన పత్యాలు అవసరంలేదు.రోగి వ్యాధు లను బట్టి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. -
ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్
శతాయు ఆయుర్వేద సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మృత్యుంజయ సాక్షి, బెంగళూరు : ఆయుర్వేద వైద్య విధానాలకు ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందని శతాయు ఆయుర్వేద సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మృత్యుంజయ వెల్లడించారు. శతాయు ఆయుర్వేద సంస్థ నగరంలోని ఉత్తరహళ్లిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్‌ను నటి శ్వేతా శ్రీవాస్తవ, ఎమ్మెల్యే ఎం.కృష్ణప్పలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మృత్యుంజయ మాట్లాడారు. ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతి వస్తువులతోనే అందించే ఆయుర్వేద వైద్య విధానానికి భారతదేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో పాటు ఊబకాయం వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులను కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేయగల సామర్థ్యం ఆయుర్వేదానికి ఉందన్నారు. ఇక చర్మ సౌందర్యం విషయంలో ఆయుర్వేద ఉత్పత్తుల కొనుగోలుకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, అందుకే తమ సంస్థ తరఫున ‘వైట్ హర్బల్స్’ పేరిట సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 100 వెల్నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం నటి శ్వేతా శ్రీవాస్తవ మాట్లాడుతూ... రసాయనాలు కలిసిన ఉత్పత్తుల కారణంగా చర్మానికి హానికలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకే తాను ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.