లైంగిక వ్యాధులు అంటే ఒక భయం, ఎన్నో రకాలసమస్యలు, అవగాహన లోపం, తెలియని ఆతృత. ఏదో ఒక మందుతో దాన్ని తగ్గించుకోవాలనే ఆరాటం. వీటన్నిటి మధ్య నలిగిపోయేవారు ఎందరో ! సరైన చికిత్స లేక ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సత్వరమైన పరిష్కారంతో, నమ్మకమైన చికిత్సతో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మధు వారణాశి. లైంగిక వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి హెపటైటిస్ బి.
ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా హెపటైటిస్ బి బారిన పడినట్లుగా తెలుస్తోంది. వైరల్ సంబంధిత వ్యాధులలో హెపటైటిస్ బి ఒక మహమ్మారిగా మారే సూచికలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు కోట్ల మంది హెపటైటిస్ బి తో బాధపడుతున్నారని అంచనా. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా భారతీయులు హెపటైటిస్ బి మూలంగా మరణిస్తున్నారు.
రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో వైరస్ ఉంటుంది. అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల ఇది సంక్రమిస్తుంది. తల్లులనుంచి పిల్లలకు, శిశువు నుండి శిశువుకు సంక్రమిస్తుంది. అవగాహన లోపంతో ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
హెపటైటిస్ బి అంటే?
మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన భా గం. ఎన్నో కార్యక్రమాలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే ఎన్నో బాధలు, ఎన్నో విపత్తులు ఎదురవుతాయి. కొన్ని రకాలైవైరస్ కారణంగా కాలేయానికి ఇన్‌ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధి వస్తుంది. వీటిలో ప్రమాదకరమైనవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సివీటిని హెపటోట్రోఫిక్ వైరసస్ అని అంటారు.
హెపటైటిస్ బి మొదట మామూలు లక్షణాలతో వచ్చి, అది దీర్ఘకాలికంగా మారి, కాలేయాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తుంది. లివర్ కేన్సర్,సిర్రోసిస్,వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి మూలకారణం అవుతుంది. హెపటైటిస్ బి వల్ల కాలేయంలోని కణజాలం క్రమక్రమంగా పాడవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం వల్ల కాలేయం నిర్వహించే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కాలేయంలో వాపు వచ్చి పలు రకాలసమస్యలకు తోడ్పడుతుంది.
కారణాలు ఏమిటి?
స్టెరిలైజ్ చేయని సిరంజీలు, లైంగిక సంపర్కం ద్వారా. పటైటిస్ బి ఉన్న వ్యక్తి నుండి నేత్రాలు, త్రపిండాలు, రక్తం తీసుకోవడం వల్ల. పటైటిస్ బి సోకిన వారి రక్తం, గాయాల ద్వారా, ఏ కారణం చేతనైనా వీరి రక్తం వేరేవాళ్లకు తాకడం ద్వారా. చ్చబొట్టు, ఒకే బ్లేడ్, ఒకే సిరంజి ఎక్కువ మంది వాడినపుడు, కలుషితమైన ఆహారం.బ్యాక్టీరియా, అమీబాలవంటి పరాన్నజీవులవల్ల హెపటైటిస్ బి వ్యాప్తిస్తుంది. ఎయిడ్స్‌కన్నా ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించవచ్చును.
లక్షణాలు
సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు నిశ్శబ్దంగా ఉంటాయి.హెపటైటిస్ బి వైరస్ ఎన్నో సంవత్సరాలు శరీరంలో ఉంటుంది. శరీరం వెలుపల సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం రోజులు మాత్రమే సజీవంగా ఉండగలదు. కొంత మందిలో ఈ వైరస్ ప్రవేశించిన కొద్ది రోజులకే కామెర్లు వస్తాయి. దీనిని అక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చును. ఈ దశలో దానంతటదే తగ్గుతుంది. కొంత మందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలో ఉంటూ బలం పెంచుకుంటూపోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్ బి కారణంగా కాలేయం వ్యాధిగ్రస్తమై భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు లక్షణాలు కనబడతాయి.
ఎలా నివారించాలి?
విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. అపరిచితులతో శృంగార జీవితంలో సురక్షితమైన పద్ధతులు అవలంబించాలి. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడాలి. ఒకరు వాడిన షేవింగ్ రేజర్లు, బ్లేడ్లను వాడరాదు. రక్తం తీసుకోవలసి వస్తే, హెపటైటిస్ బి పరీక్ష చేసి రక్తం ఎక్కించుకోవాలి.
వ్యాధి నిర్ధారణ:
హెచ్‌బిఎస్ ఎజి అనే రక్తపరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిపి, లివర్ బయాప్సి, వైరల్ లోడ్ ద్వారా రోగ తీవ్రతను గుర్తించవచ్చు.
హోమియో చికిత్ససహజసూత్రాలపైన ఆధారపడిన హోమియో వైద్యం వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలసత్తా కలిగినది హోమియోపతి రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యునో మాడ్యులేటర్స్‌గా పనిచేస్తుంది. అందువల్ల మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. హెపటైటిస్ బి లాంటి కేసులలో ఆధునిక హోమియో చికిత్సతో రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని నివారించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధులను నయం చేయవచ్చు.
డా.మధు వారణాశి, ఎం.డి.
ప్రముఖ హోమియో వైద్యులు, ఫ్లాట్ నం.188,
వివేకానందనగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్,
ఫోన్: 8897331110, 8886509509
హోమియో వైద్యంతో ‘హెపటైటిస్-బి’కి చెక్
Published Wed, Jan 21 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement