the City plus
-
పాపం లక్ష్మీ మీనన్!
మార్ఫింగ్ మాయాజాలం సినీతారలను వదలడం లేదు. ఆకతాయిల చేష్టలకు హీరోయిన్లు సిగ్గుతో చచ్చిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు శాండల్‌వుడ్ గుమ్మలు రాయ్‌లక్ష్మీ, కావ్యామాధవన్, హన్సికాహసన్ తుంటరోళ్ల పనులకు ఇబ్బందులు పడ్డారు. చివరకు వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవి తమవి కావని స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా లక్ష్మీ మీనన్ కూడా ఆ బాధితురాళ్ల జాబితాలో చేరిపోయింది. మార్ఫింగ్ చేసిన లక్ష్మీ మీనన్ బాతింగ్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ కెమెరాతో తీసిన ఈ వీడియోలో ఓ మహిళకు లక్ష్మి ముఖాన్ని అతికించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్లోడ్ చేశారని సమాచారం! -
రైజింగ్ యూత్
స్టాస్... అంటే గ్రీకులో రైజ్ అగైన్ అని అర్థం. పేరుకు తగినట్టుగానే పునరుజ్జీవం చెందిందా యువత. ఫేస్బుక్ అంతా ఫేక్‌బుక్ అయిపోతోందని వాపోతున్న సమయంలో దానినే వేదికగా చేసుకుని సేవకు అంకితమయ్యారు. ముగ్గురు స్నేహితుల్లో వికసించిన ఆలోచన మూడు వేల మందికి విస్తరించింది. స్టాస్ ఫౌండేషన్‌గా రూపుదిద్దుకొని పదిహేడు జిల్లాల్లో సేవలందిస్తోంది. - దార్ల వెంకటేశ్వరరావు, రాంగోపాల్‌పేట్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీక్, కడప జిల్లాకు చెందిన మానస, మెదక్‌కు చెందిన నవీన్‌లు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయాన్ని ఉబుసుపోని కబుర్లకు పరిమితం చేయలేదు. సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఆలోచనతో ఫేస్బుక్లో స్టాస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎప్పటికప్పుడు తమ సేవా కార్యక్రమాలను ఫేస్బుక్ ద్వారానే వివరిస్తూ వేల మందిని సభ్యులుగా చేశారు. అలా ముగ్గురుతో ప్రారంభమైన ఆ ఫౌండేషన్ ఇప్పుడు 300 మంది చురుకైన వలంటీర్లు, 3వేల మంది సభ్యులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 17 జిల్లాలకు విస్తరించింది. అనాథలు, వృద్ధులకు కొత్త జీవితం ‘సుభిక్ష’ పేరుతో నిరుపేదలు, అనాథలు, రోడ్డు పక్కన ఉండే వారికి ఆహారం, దుస్తులు, దుప్పట్లు సమకూరుస్తున్నారు. పంక్షన్హాళ్లలో మిగిలిపోయిన అన్నం వృథా చేయకుండా, నిర్వాహకులను ఒప్పించి తెచ్చి పేదలకు పంచుతున్నారు. పాత దుస్తులు సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. రోడ్డుపై ఉన్న అనాథలను ఆశ్రమాల్లో చేర్పిస్తుంటారు. నిరాదరణకు గురైన వృద్ధులకు, వికలాంగులకు తామున్నామనే భరోసా కల్పించే కార్యక్రమమే ‘ఆసరా’. తమ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనో, కాలేజీల్లోనో కాకుండా.. వృద్ధాశ్రమాల్లో జరుపుకొంటూ నిరాదరణకు గురైన వృద్ధులకు మేమున్నామనే భరోసా కలిగిస్తున్నారు. వారితో కొంత సమయం గడిపి బాధను దూరం చేస్తున్నారు. చదువుల వెలుగులు ‘వెలుగు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించి ఆదుకోవడం చేస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి, ప్రమాదాల్లో రక్తం అందక చనిపోవడాన్ని తగ్గించేందుకు ‘ఆయుష్’తో రక్తదానాలు చేసి ఆయువు పోస్తున్నారు. అలాగే అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు. అనాథాశ్రమాల్లో తాము ఒంటరిమనే ఆత్మన్యూనతతో కాలం వెళ్లదీసే చిన్నారులను ‘విహార్’ పేరుతో విహారయాత్రలకు తీసుకుని వెళ్లి మానసిక ఆనందాన్ని పంచుతున్నారు. వారితో కలిసి ఆడిపాడి మానసిక ధైర్యాన్ని అందిస్తున్నారు. ‘ఉపాధి’ పేరుతో నిరుద్యోగులకు, వికలాంగులకు, బాలికలకు శిక్షణ అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం చేస్తుంది స్టాస్. పర్యావరణ ‘ప్రాణధాత్రి’ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ‘ప్రాణధాత్రి’ పేరుతో విస్తృతంగా మొక్కల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. రసాయన ఎరువుల వల్ల మనిషికి , భూమికి ఎదురయ్యే సమస్యల్ని ఇటు విద్యార్థులకు, అటు రైతులకు వివరిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ‘జాబిల్లి’ పేరుతో ఒక చిన్నారితో అనాథాశ్రమాన్ని మొదలు పెట్టింది స్టాస్. రోజుకు ఒక్కొక్కరు ఒక రూపాయి కూడబెట్టి అవసరమైతే ఇంకా వెచ్చించి, దాతల సహకారాన్ని తీసుకుంటూ ఈ బృహత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఏదైనా మంచి పని ఒక్కరే చేయాలని లేదు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కొంత సమాజహితానికి పాటుపడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’ అంటున్నారు స్టాస్ ప్రధాన కార్యదర్శి మానస. ‘సమాజ సేవ చేయాలనే తపన ఉండి, నెలకు రెండు రోజులు సమయం కేటాయించగలిగిన ప్రతి ఒక్కరు తమ ఫౌండేషన్‌లో చేరవచ్చు’ అని చెప్పారు స్టాస్ వ్యవస్థాపకుడు కార్తీక్. -
కెమెరా ఉంటే కిర్రాకే!
రశ్మి... తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు. అందం, అభినయమే కాదు... చెరగని చిరునవ్వు, నాన్‌స్టాప్ మాటలు ఆమెకు స్పెషల్ ఎస్సెట్స్. అందుకే ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో సెటిలై... యావత్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఆ వసపిట్ట పాస్ట్ ఎక్స్పీరియెన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఆమె మాటల్లో... ..:: శిరీష చల్లపల్లి నాన్నది ఉత్తరప్రదేశ్.. అమ్మది ఒడిశా. నేను హైదరాబాదీనీ. పుట్టింది ఒడిశాలో అయినా నేను పెరిగింది వైజాగ్‌లో. చదువంతా అక్కడే. స్కూల్‌డేస్ నుంచే నాకు ధైర్యం ఎక్కువ. స్టేజ్ ఫియర్ అస్సలు ఉండేది కాదు. వెయ్యి మందిలో అయినా అవలీలగా మాట్లాడగలిగేదాన్ని. ఇంకా ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ వాలిపోయేదాన్ని. డాన్సు చేయడం బాగా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్డేస్లో హంగామా అంతా నాదే. పిలిపించుకుని మరీ నాతో డాన్స్ చేయించుకునేవారు. ఓన్లీ డాటర్ని కావడంతో అమ్మా, నాన్న కూడా నాకు అడ్డు చెప్పేవారు కాదు. అలా గారాబంగా పెరిగాను. ప్రజలకు దగ్గరగా... హైదరాబాద్‌కు వచ్చి పది సంవత్సరాలవుతోంది. 2006లో మొదటిసారి ‘ప్లీజ్ సారీ థ్యాంక్స్’ అనే తెలుగు సినిమాలో నటించాను. నాగార్జున గారు నిర్మించిన ‘యువ’ సీరియల్లో కూడా చేశాను. అలా సినిమాలు, సీరియల్స్, ప్రోగ్సామ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. గతంలో ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. స్కోప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాను. ఫిట్నెస్ సీక్రెట్... ఇక నా హాబీస్ విషయానికొస్తే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నా ఫిట్నెస్కి కారణం కూడా అదే. నాకు జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్లో ‘కూచిపూడి సముద్రం తాళి’ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ బాగా తింటాను. వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ కాదుగానీ... అప్పుడప్పుడు ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ‘వ్యూహం’తో... నేను డిఫికల్ట్ పర్సన్‌ని. ఎదుటివారి ప్రవర్తనను బట్టే నా బిహేవియర్ ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనూ క్లోజ్ అవ్వను. అలా అని ఫ్రెండ్స్ లేరని కాదు. ఉన్నారు... కానీ అంత క్లోజ్ కాదు. అందుకే అందరూ నన్ను హైపర్ యాక్టివ్ అంటారు. అంత ఈజీగా అలసిపోను. అదే నా ప్లస్ పాయింట్. ప్రస్తుతం ‘వ్యూహం’ సినిమాలో చేస్తున్నాను. అది త్వరలో రిలీజ్ కాబోతోంది. నా ప్రోగ్రామ్స్‌ని ఆదరిస్తున్నట్టే సినిమాలో నా పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నా. -
హోమియో వైద్యంతో ‘హెపటైటిస్-బి’కి చెక్
లైంగిక వ్యాధులు అంటే ఒక భయం, ఎన్నో రకాలసమస్యలు, అవగాహన లోపం, తెలియని ఆతృత. ఏదో ఒక మందుతో దాన్ని తగ్గించుకోవాలనే ఆరాటం. వీటన్నిటి మధ్య నలిగిపోయేవారు ఎందరో ! సరైన చికిత్స లేక ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సత్వరమైన పరిష్కారంతో, నమ్మకమైన చికిత్సతో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మధు వారణాశి. లైంగిక వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి హెపటైటిస్ బి. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా హెపటైటిస్ బి బారిన పడినట్లుగా తెలుస్తోంది. వైరల్ సంబంధిత వ్యాధులలో హెపటైటిస్ బి ఒక మహమ్మారిగా మారే సూచికలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు కోట్ల మంది హెపటైటిస్ బి తో బాధపడుతున్నారని అంచనా. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా భారతీయులు హెపటైటిస్ బి మూలంగా మరణిస్తున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో వైరస్ ఉంటుంది. అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల ఇది సంక్రమిస్తుంది. తల్లులనుంచి పిల్లలకు, శిశువు నుండి శిశువుకు సంక్రమిస్తుంది. అవగాహన లోపంతో ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. హెపటైటిస్ బి అంటే? మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన భా గం. ఎన్నో కార్యక్రమాలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే ఎన్నో బాధలు, ఎన్నో విపత్తులు ఎదురవుతాయి. కొన్ని రకాలైవైరస్ కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధి వస్తుంది. వీటిలో ప్రమాదకరమైనవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సివీటిని హెపటోట్రోఫిక్ వైరసస్ అని అంటారు. హెపటైటిస్ బి మొదట మామూలు లక్షణాలతో వచ్చి, అది దీర్ఘకాలికంగా మారి, కాలేయాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తుంది. లివర్ కేన్సర్,సిర్రోసిస్,వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి మూలకారణం అవుతుంది. హెపటైటిస్ బి వల్ల కాలేయంలోని కణజాలం క్రమక్రమంగా పాడవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం వల్ల కాలేయం నిర్వహించే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కాలేయంలో వాపు వచ్చి పలు రకాలసమస్యలకు తోడ్పడుతుంది. కారణాలు ఏమిటి? స్టెరిలైజ్ చేయని సిరంజీలు, లైంగిక సంపర్కం ద్వారా. పటైటిస్ బి ఉన్న వ్యక్తి నుండి నేత్రాలు, త్రపిండాలు, రక్తం తీసుకోవడం వల్ల. పటైటిస్ బి సోకిన వారి రక్తం, గాయాల ద్వారా, ఏ కారణం చేతనైనా వీరి రక్తం వేరేవాళ్లకు తాకడం ద్వారా. చ్చబొట్టు, ఒకే బ్లేడ్, ఒకే సిరంజి ఎక్కువ మంది వాడినపుడు, కలుషితమైన ఆహారం.బ్యాక్టీరియా, అమీబాలవంటి పరాన్నజీవులవల్ల హెపటైటిస్ బి వ్యాప్తిస్తుంది. ఎయిడ్స్కన్నా ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించవచ్చును. లక్షణాలు సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు నిశ్శబ్దంగా ఉంటాయి.హెపటైటిస్ బి వైరస్ ఎన్నో సంవత్సరాలు శరీరంలో ఉంటుంది. శరీరం వెలుపల సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం రోజులు మాత్రమే సజీవంగా ఉండగలదు. కొంత మందిలో ఈ వైరస్ ప్రవేశించిన కొద్ది రోజులకే కామెర్లు వస్తాయి. దీనిని అక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చును. ఈ దశలో దానంతటదే తగ్గుతుంది. కొంత మందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలో ఉంటూ బలం పెంచుకుంటూపోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్ బి కారణంగా కాలేయం వ్యాధిగ్రస్తమై భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు లక్షణాలు కనబడతాయి. ఎలా నివారించాలి? విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. అపరిచితులతో శృంగార జీవితంలో సురక్షితమైన పద్ధతులు అవలంబించాలి. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడాలి. ఒకరు వాడిన షేవింగ్ రేజర్లు, బ్లేడ్లను వాడరాదు. రక్తం తీసుకోవలసి వస్తే, హెపటైటిస్ బి పరీక్ష చేసి రక్తం ఎక్కించుకోవాలి. వ్యాధి నిర్ధారణ: హెచ్బిఎస్ ఎజి అనే రక్తపరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిపి, లివర్ బయాప్సి, వైరల్ లోడ్ ద్వారా రోగ తీవ్రతను గుర్తించవచ్చు. హోమియో చికిత్ససహజసూత్రాలపైన ఆధారపడిన హోమియో వైద్యం వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలసత్తా కలిగినది హోమియోపతి రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యునో మాడ్యులేటర్స్గా పనిచేస్తుంది. అందువల్ల మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. హెపటైటిస్ బి లాంటి కేసులలో ఆధునిక హోమియో చికిత్సతో రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని నివారించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధులను నయం చేయవచ్చు. డా.మధు వారణాశి, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యులు, ఫ్లాట్ నం.188, వివేకానందనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్, ఫోన్: 8897331110, 8886509509 -
బుల్లితెర మెరుపులు
ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కలిపి ఇన్ఫోటైన్మెంట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి టీవీ కార్యక్రమాలు. పావుగంటకో ఫైట్.. అరగంటకో పాట లేకపోయినా... మధ్య తరగతి సమస్యలను, సర్దుబాట్లను కళ్లకు కడుతూ అతివలను బుల్లితెరకు కట్టిపడేస్తున్నాయి సీరియల్స్. ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలకుండా చేస్తున్న సీరియల్స్, కార్యక్రమాలను ఎంపిక చేసి ‘2014 టీవీ అవార్డు’లను అందించింది ‘శివాని ఆర్ట్స్ అసోసియేషన్’. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న, అవార్డులు అందుకున్న నటీనటులు సిటీప్లస్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ..:: శిరీష చల్లపల్లి ప్రేక్షకాదరణే ముఖ్యం... చంటిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నన్ను సీరియల్స్‌లోనూ ఆదరించారు ప్రేక్షకులు. ఈ అవార్డుకు కారణం కూడా వారే. సినిమాలు, సీరియల్స్ అన్న తేడా ఏం లేదు. ఎక్కడైనా సుహాసిని మంచి నటి, మంచి అమ్మాయి అనిపించుకోవడమే నా లక్ష్యం. అంతకు మించిన ఆస్కార్లు, నందులు ఏమీ ఉండవనుకుంటా! - సుహాసిని, బెస్ట్ హీరోయిన్, అష్టాచెమ్మా సీరియల్ మాటకారిని చేశారు... చదివింది ఇంటర్ అయినా సంగీతంపై ఆసక్తితో కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లమో చేశాను. తీన్మార్ ధూమ్‌ధామ్ ప్రోగ్రాంలో పాటపాడటానికి వచ్చిన నన్ను మా సీఈఓ సర్ గుర్తించి, పాటలు పాడే నాకు మాటలు నేర్పి మాటకారి అమ్మాయిని చేశారు. లంబాడా అమ్మాయిని కాబట్టి ఆ శ్లాంగ్‌లో కొద్ది మార్పు చేర్పులతో ప్రోగ్రాం చేయడం చాలా ఈజీ అయ్యింది. మా కార్యక్రమానికి ‘బెస్ట్ ప్రోగ్రామ్’ అవార్డు రావడంతో నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు. - సత్యవతి (మాటకారి మంగ్లీ), బెస్ట్ ప్రోగ్రామ్ కోవై సరళ స్ఫూర్తితో... బీటెక్ చదివిన నాకు చిన్నప్పటినుంచి మిమిక్రీ, అనుకరణ చాలా ఇష్టం. దాంతో ఫ్రెండ్స్ అందరినీ నవ్విస్తుండేదాన్ని. దూరదర్శన్‌లో ఓ గేమ్‌షోలో పాల్గొన్న నా యాక్టివ్నెస్ చూసి యాంకరింగ్ అవకాశం ఇచ్చారు. అలా సీరియల్స్ వైపు వచ్చాను. నాకు కోవైసరళ అంటే ఇష్టం. తనే నాకు స్ఫూర్తి. - రోహిణి రెడ్డి, బెస్ట్ కామెడీ హీరోయిన్, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ నా అదృష్టం.. పుట్టింది ఆంధ్ర, పెరిగింది చెన్నైలో అయినా నాకు జీవితాన్నిచ్చింది హైదరాబాద్. టీవీ ఇండస్ట్రీ నా సెకండ్ హోం. ప్రజల ఆదరాభిమానాలు పొందడం నా అదృష్టం. ఫ్యామిలీ సపోర్ట్, తోటి యాక్టర్స్ ఎంకరేజ్మెంట్ నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. - హరిత, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కలవారి కోడలు సీరియల్ డాక్టర్ కావాలి... మూడేళ్ల వయసునుంచే సీరియల్స్, మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. రగడ, కరెంటు తీగ సినిమాల్లో బాలనటిగా చేశాను. దేవత, శ్రావణి సుబ్రహ్మణ్యం, లేత మనసులు, ఇప్పుడు రాములమ్మ చేస్తున్నా. పెద్దయ్యాక మంచి యాక్టరే కాదు డాక్టర్ కావాలన్నది నా కల. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నందుకు మా డాడీ ఎంతో సంతోషిస్తారు. - సాయిప్రియ, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, రాములమ్మ సీరియల్ థ్రిల్లింగ్‌గా ఉంది.. యాంకరింగ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైనా.. ఇప్పుడు సీరియల్స్‌లో సాఫ్ట్ అండ్ కూల్ రోల్స్ చేస్తున్నాను. నిజానికి చాలా అల్లరి పిల్లని. స్క్రీన్‌మీద కామ్‌గోయింగ్ గాళ్‌గా కనిపించడం మొదట్లో కాస్త కష్టమనిపించినా, ఇప్పుడు సరదాగా సాగిపోతోంది. ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రస్తుతం ‘వేట కొడవళ్లు’ సినిమాలో కనిపించబోతున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని భావిస్తున్నా. - హిమజ, బెస్ట్ హీరోయిన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ హ్యాపీగా ఉంది... అమ్మ, నాన్న క్లాసికల్ డ్యాన్సర్స్ కావడంతో చిన్నతనం నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ‘మేఘమాల’ సీరియల్‌కి క్లాసికల్ డ్యాన్సర్ రోల్ ఉండటంతో మా పేరెంట్స్‌ని అప్రోచ్ అయ్యారు. అలా నేను బుల్లితెరకు వచ్చాను. అమ్మ నాతోపాటే ఉండి నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు థర్డ క్లాస్ చదువుతున్నాను. స్కూల్ నుంచి సపోర్టే కాదు.. ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. బెస్ట్ డ్యాన్సర్ అవార్డు తీసుకోవడం హ్యాపీగా అనిపిస్తోంది. - శ్రీనర్తన, బెస్ట్ డ్యాన్సర్, మేఘమాల సీరియల్ -
చిత్ర వైవిధ్యం
ఆ ప్రదర్శనలో ఉన్న చిత్రాలను గమనిస్తే, గ్రూప్ షో మాదిరిగా అనిపిస్తుంది. ఒక్కో చిత్రానిదీ ఒక్కో శైలి. స్టిల్‌లైఫ్, పోర్టరైట్స్, ఫిగరేటివ్స్, సెమీ ఫిగరేటివ్స్, డిస్టార్షన్స్.. అన్నీ విభిన్నమే. చిత్రంగా.. వాటన్నింటిపైనా ఒకే సంతకం.. ఇది గ్రూప్ షో కాదు, సోలో షో. నగర కళాకారుడు హరి ‘అఫిసియోనాడోస్’ పేరిట బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో ఏర్పాటు చేసిన వైవిధ్య భరిత చిత్ర ప్రదర్శన కళాభిమానులకు కనువిందు చేస్తోంది. బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి సహాయార్థం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవంలోభారతీ సిమెంట్స్ సీవోవో అనూప్‌కుమార్ సక్సేనా, నటి జయసుధ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్.పి.సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఎండీ వి.బి.గాడ్గిల్, పింకీరెడ్డి హాజరయ్యారు. -
సామాజిక చిత్రం
అదో పల్లెటూరు. అంతా గోలగోలగా ఉంది. ఏంటని చూస్తే... అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి. రెండు పుంజులు హోరాహోరీగా పోటీపడుతున్న దృశ్యం మదిలో ముద్రితమైంది. అదే కాన్వాస్‌పై ఓ చక్కని చిత్రంగా మారింది. ఇలాంటివెన్నో జీవన చిత్రాలు ప్రముఖ చిత్రకారుడు దేబబ్రతా బిశ్వాస్ కుంచెతో రంగులద్దుకున్నాయి. జూబ్లీహిల్స్ బియాండ్ కాఫీలో తన అపురూప పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేసిన సందర్భంగా బిస్వాస్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది... ఆర్ట్ అంటే ప్రాణం. మధ్య తరగతి కుటుంబం. అమ్మానాన్నలతో వాళ్ల సొంత గ్రామాలకు వెళుతుండేవాడిని. అలా పల్లెటూరు జీవనాన్ని దగ్గరి నుంచి చూశా. పంట పొలాలు, కల్మషం లేని మనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణం... ఆ గ్రామాలంటే నాకెంతో ఇష్టం. మాది జంషెడ్పూర్. ఇంటర్ వరకు అక్కడే చదివా. పాఠశాల స్థాయి నుంచే జంతువులు, ప్రకృతి బొమ్ములు వేస్తుండే వాడిని. నా ప్రతిభ గుర్తించి పేరెంట్స్ ప్రోత్సహించారు. ఎక్కడ పెయింటింగ్ పోటీలు జరిగినా తీసుకెళ్లేవారు. వారి ప్రశంసలే నా కుంచెకు మరింత పదును పెట్టాయి. లెక్కలేనన్ని బహుమతులు తెచ్చి పెట్టాయి. ఇదే జోష్‌తో జంషెడ్పూర్ ఠాగూర్ సొసైటీలో ఆర్ట్స్‌లో డిప్లమో చేశా. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజిక్ బోర్డు నుంచి బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ చేశా. పీజీ పూర్తయ్యేసరికి నేను ఎంచుకున్న కళలో లోతు చూశా. ఈ సమయంలోనే కళాకారులకు అరుదుగా లభించే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్కు ఎంపికయ్యా. నా చిత్రాలతో వ్యక్తిగత ప్రదర్శనలు చెయ్యడం సొంతూరు (1997)లోనే మొదలైంది. ఇప్పటివరకు పదులకు పైగా వివిధ నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించా. నా ఆర్ట్‌కు సబ్జెక్ట్ మాత్రం నా పరిసరాల్లో జరిగే అంశాలే. ప్రకృతి, జీవన గమనం వంటివి ప్రతి బొమ్మలో ప్రతిబింబిస్తాయి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, ఉపయోగపడేదే నిజమైన కళ. మాయమవుతున్న పచ్చని పైర్లు, విచ్ఛిన్నమవుతున్న సంస్కృతి, పోటెత్తుతున్న కాలుష్యం... ఇలా సామాజిక, ప్రకృతి చిత్రాలే నావి. అక్రాలిక్, ఆయిల్, వాటర్ కలర్సతో బొమ్మలు వేస్తా. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఈ సిటీకి వచ్చిన నన్ను... మంచి ఆర్టిస్టుగా ఆదరించింది. భవిష్యత్‌లోనూ ఈ మహానగరంతో బంధం కొనసాగిస్తా. ...::: వీఎస్ -
ఆర్బీఐ ప్రచురించే పత్రిక ఏది?
ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడు దొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్నిఆర్బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజాసంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం. ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజా సంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం. మాదిరి ప్రశ్నలు 1. {దవ్య విధానాన్ని రూపొందించి, నిర్వహించేది? 1) కేంద్ర మంత్రి మండలి 2) ఆర్బీఐ 3) ఆర్థిక సంఘం 4) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2. ఆర్బీఐకి గవర్నర్‌గా పని చేసిన మొదటి భారతీయుడు? 1) బిమల్ జలాన్ 2) రంగరాజన్ 3) సి.డి. దేశ్‌ముఖ్ 4) ఎస్.ఎం. నరసింహం 3. రెపో రేటు అంటే? 1) రీ పర్చేజ్ ఆపరేషన్ రేట్ 2) రీ పేమెంట్ ఆప్షన్ రేట్ 3) రివర్స పర్చేజింగ్ ఆర్డర్ రేట్ 4) రివర్స పేమెంట్ ఓరియంటేడ్ రేట్ 4. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) న్యూఢిల్లీ 2) కోల్‌కతా 3) హైదరాబాద్ 4) ముంబయి 5. ‘హాట్‌మనీ’ అంటే? 1) అధిక పెట్టుబడులను ఆకర్షించే దేశాల్లోకి ద్రవ్య సరఫరా పెరగడం 2) బలహీన ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరాను తగ్గించడం 3) అధిక వడ్డీరేట్లు ఉన్న దేశాల్లోకి పెట్టుబడులు తరలిపోవడం 4) తక్కువ వడ్డీరేట్లు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోవడం 6. కంప్యూటరీకరించిన శాఖలు అధికంగా ఉన్న బ్యాంక్ ఏది? 1) ఎస్బీఐ 2) ఎస్బీహెచ్ 3) పీఎన్బీ 4) సీబీఐ 7. ఆర్బీఐ ప్రచురించే పత్రిక ఏది? 1) మనీ మ్యాగజైన్ 2) న్యూస్‌లెటర్ 3) మానిటరీ పాలసీ 4) బ్యాంకింగ్ బులెటిన్ 8. ఎస్బీఐని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1) 1955 2) 1949 3) 1951 4) 1956 9. బ్యాంక్రేటు ఎక్కువగా ఉంటే పరపతి విధానంలో ఎలాంటి మార్పు వస్తుంది? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) ఎలాంటి ప్రభావం ఉండదు 10. ఆర్బీఐ తీసుకునే పరిమాణాత్మక నియంత్రణ చర్యల్లో శక్తివంతమైంది? 1) ఎస్ఎల్ఆర్ పెంచడం 2) సీఆర్ఆర్ పెంచడం 3) బ్యాంక్ రేటు పెంచడం 4) బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను విస్తృతం చేయడం సమాధానాలు 1) 2; 2) 3; 3) 1; 4) 4; 5) 3; 6) 1; 7) 2; 8) 1; 9) 2; 10) 4.