బుల్లితెర మెరుపులు | Television thunderstorm | Sakshi
Sakshi News home page

బుల్లితెర మెరుపులు

Published Tue, Jan 20 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

బుల్లితెర మెరుపులు

బుల్లితెర మెరుపులు

ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కలిపి ఇన్ఫోటైన్‌మెంట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి టీవీ కార్యక్రమాలు. పావుగంటకో ఫైట్.. అరగంటకో పాట లేకపోయినా... మధ్య తరగతి సమస్యలను, సర్దుబాట్లను కళ్లకు కడుతూ అతివలను బుల్లితెరకు కట్టిపడేస్తున్నాయి సీరియల్స్. ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలకుండా చేస్తున్న సీరియల్స్, కార్యక్రమాలను ఎంపిక చేసి ‘2014 టీవీ అవార్డు’లను అందించింది ‘శివాని ఆర్ట్స్ అసోసియేషన్’. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న, అవార్డులు అందుకున్న నటీనటులు సిటీప్లస్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
 ..:: శిరీష చల్లపల్లి
 
ప్రేక్షకాదరణే ముఖ్యం...
చంటిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నన్ను సీరియల్స్‌లోనూ ఆదరించారు ప్రేక్షకులు. ఈ అవార్డుకు కారణం కూడా వారే. సినిమాలు, సీరియల్స్ అన్న తేడా ఏం లేదు. ఎక్కడైనా సుహాసిని మంచి నటి, మంచి అమ్మాయి అనిపించుకోవడమే నా లక్ష్యం. అంతకు మించిన ఆస్కార్లు, నందులు ఏమీ ఉండవనుకుంటా!
 - సుహాసిని, బెస్ట్ హీరోయిన్, అష్టాచెమ్మా సీరియల్
 
మాటకారిని చేశారు...
చదివింది ఇంటర్ అయినా సంగీతంపై ఆసక్తితో కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లమో చేశాను. తీన్మార్ ధూమ్‌ధామ్ ప్రోగ్రాంలో పాటపాడటానికి వచ్చిన నన్ను మా సీఈఓ సర్ గుర్తించి, పాటలు పాడే నాకు మాటలు నేర్పి మాటకారి అమ్మాయిని చేశారు. లంబాడా అమ్మాయిని కాబట్టి ఆ శ్లాంగ్‌లో కొద్ది మార్పు చేర్పులతో ప్రోగ్రాం చేయడం చాలా ఈజీ అయ్యింది. మా కార్యక్రమానికి ‘బెస్ట్ ప్రోగ్రామ్’ అవార్డు రావడంతో నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు.
 - సత్యవతి (మాటకారి మంగ్లీ), బెస్ట్ ప్రోగ్రామ్
 
కోవై సరళ స్ఫూర్తితో...
బీటెక్ చదివిన నాకు చిన్నప్పటినుంచి మిమిక్రీ, అనుకరణ చాలా ఇష్టం. దాంతో ఫ్రెండ్స్ అందరినీ నవ్విస్తుండేదాన్ని. దూరదర్శన్‌లో ఓ గేమ్‌షోలో పాల్గొన్న నా యాక్టివ్‌నెస్ చూసి యాంకరింగ్ అవకాశం ఇచ్చారు. అలా సీరియల్స్ వైపు వచ్చాను. నాకు కోవైసరళ అంటే ఇష్టం. తనే నాకు స్ఫూర్తి.
 - రోహిణి రెడ్డి, బెస్ట్ కామెడీ హీరోయిన్, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్
 
నా అదృష్టం..
పుట్టింది ఆంధ్ర, పెరిగింది చెన్నైలో అయినా నాకు జీవితాన్నిచ్చింది
హైదరాబాద్. టీవీ ఇండస్ట్రీ నా సెకండ్ హోం. ప్రజల ఆదరాభిమానాలు పొందడం నా అదృష్టం. ఫ్యామిలీ సపోర్ట్, తోటి యాక్టర్స్ ఎంకరేజ్‌మెంట్ నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది.
 - హరిత, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కలవారి కోడలు సీరియల్
 
డాక్టర్ కావాలి...
మూడేళ్ల వయసునుంచే సీరియల్స్, మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. రగడ, కరెంటు తీగ సినిమాల్లో బాలనటిగా చేశాను. దేవత, శ్రావణి సుబ్రహ్మణ్యం, లేత మనసులు, ఇప్పుడు రాములమ్మ చేస్తున్నా. పెద్దయ్యాక మంచి యాక్టరే కాదు డాక్టర్ కావాలన్నది నా కల. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నందుకు మా డాడీ ఎంతో సంతోషిస్తారు.
 - సాయిప్రియ, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, రాములమ్మ సీరియల్
 
థ్రిల్లింగ్‌గా ఉంది..
యాంకరింగ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైనా.. ఇప్పుడు సీరియల్స్‌లో సాఫ్ట్ అండ్ కూల్ రోల్స్ చేస్తున్నాను. నిజానికి చాలా అల్లరి పిల్లని. స్క్రీన్‌మీద కామ్‌గోయింగ్ గాళ్‌గా కనిపించడం మొదట్లో కాస్త కష్టమనిపించినా, ఇప్పుడు సరదాగా సాగిపోతోంది. ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రస్తుతం ‘వేట కొడవళ్లు’ సినిమాలో కనిపించబోతున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని భావిస్తున్నా.
 - హిమజ, బెస్ట్ హీరోయిన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్
 
హ్యాపీగా ఉంది...
అమ్మ, నాన్న క్లాసికల్ డ్యాన్సర్స్ కావడంతో చిన్నతనం నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ‘మేఘమాల’ సీరియల్‌కి క్లాసికల్ డ్యాన్సర్ రోల్ ఉండటంతో మా పేరెంట్స్‌ని అప్రోచ్ అయ్యారు. అలా నేను బుల్లితెరకు వచ్చాను. అమ్మ నాతోపాటే ఉండి నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు థర్డ క్లాస్ చదువుతున్నాను. స్కూల్ నుంచి సపోర్టే కాదు.. ఎంకరేజ్‌మెంట్ కూడా ఉంది. బెస్ట్ డ్యాన్సర్ అవార్డు తీసుకోవడం హ్యాపీగా అనిపిస్తోంది.
 - శ్రీనర్తన, బెస్ట్ డ్యాన్సర్, మేఘమాల సీరియల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement