TV shows
-
పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లు, షోలపై నిషేధం విధించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. తమపై విషం చిమ్ముతున్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించింది. #WATCH | "There are some anchors who conduct provocative debates. We'll make a list of them and INDIA alliance partners will stop going to their shows.": AAP Rajya Sabha MP Raghav Chadha after meeting of INDIA alliance coordination committee.#AamAadmiParty #RaghavChadha… pic.twitter.com/GlGz2wEqXK — Free Press Journal (@fpjindia) September 13, 2023 నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయి ఎన్నికల ప్రచారం, సీట్ల షేరింగ్‌పై చర్చించారు. అక్టోబర్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. పైగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఛానళ్లను, షోలను, యాంకర్లను ఇకపై నిషేధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. BIG BREAKING: The INDIA alliance has prepared the list of TV anchors who propagate hatred. Next week the list will be published by all the opposition parties. -Aman Chopra -Amish Devgan -Arnab Goswami -Sushant Sinha -Chitra Tripathi -Deepak Chaurasia -Rubika Liyaquat These… — Amock (@Politics_2022_) September 13, 2023 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో కొన్ని మీడియా ఛానళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు వ్యతిరేకమైన అంశాలనే ప్రచారం చేసినట్లు తెలిపింది. జోడో యాత్రపై సోషల్ మీడియాలో విశేష స్పందన లభించినప్పటికీ ప్రధాన మీడియా పక్కకు పెట్టినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు. 'కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లు భారత్ జోడో యాత్రను నిషేధించారు. లక్షల మంది పాల్గొన్నప్పటికీ తగినంత ప్రచారం కల్పించలేదు. పైగా వ్యతిరేకమైన వార్తలనే ప్రచారం చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. 2019 మేలోనూ కొన్ని మీడియా ఛానళ్లపై కాంగ్రెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లకు కాంగ్రెస్ తమ ప్రతినిధులను పంపకూడదని సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అప్పట్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన -
వీల్ ఛైర్లో యాంకరింగ్.. అదీ తెలుగు షోలోనే!
కామెడీ చూడటానికి హాయిగా ఉంటుంది. కానీ చేసేవాళ్లని అడిగితే అదెంత కష్టమో చెబుతారు. ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ ఉన్నంతమంది లేడీస్ లేరు. టీవీ షోల వల్ల ఇప్పుడిప్పుడే పలువురు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమ్ తెచ్చుకుంది రోహిణి. ఉత్తరాంధ్రకు చెందిన ఈమె... తొలుత సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసింది. 'జబర్దస్త్'లో చేసి ఓ రేంజు క్రేజ్ సంపాదించింది. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) షోలు, సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రోహిణి.. సరిగ్గొ కొన్నాళ్ల ముందు ఆస్పత్రిలో చేరింది. కాలికి పెద్దకట్టుతో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. 2016లో విజయవాడ నుంచి కారులో వస్తుండగా రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమె కాలిలో రాడ్ పెట్టారు. ఇప్పుడు అది తీయించుకుందామని వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంది. షోలు చేయడం మొదలుపెట్టేసింది. రోహిణి కాలి నుంచి రాడ్ నుంచి కొన్ని నెలలు అయినా కాలేదు. అప్పుడే తెలుగులోని ఓ ఛానెల్లో ప్రసారమైన షోలో కనించింది. వీల్ ఛైర్లోనే స్టేజీపైకి వచ్చి రవితో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. తాజాగా ఆదివారం ఈ షో టెలికాస్ట్ అయింది. అయితే ఈ షోని చాలా నెలల క్రితమే ఒప్పుకొందని, వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆరోగ్యం కుదటపడనప్పటికీ షో చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!) -
సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
టీవీ షోలు అనేది ప్రస్తుతం ట్రెండ్. సినిమాల కంటే వీటి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లే ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి జెన్నీఫర్ మిస్త్రీ ఓ నెలన్నర ముందు షో నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించారని పోలీస్ కేసు పెట్టింది. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. ఇప్పుడు షోలో ఎదురైన మరిన్ని చేదు అనుభవాల్ని బయటపెట్టింది. బట్టల నుంచి దుర్వాసన 'ప్రొడక్షన్ టీమ్ మా బట్టలు కూడా ఉతికేవాళ్లు కాదు. 20 రోజుల పాటు వాటినే వేసుకునేవాళ్లం. దీంతో వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చేది. చేసేదేం లేక కొన్నిసార్లు మేమే ఉతక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సెట్లోని కొందరు కాస్ట్యూమ్స్‌ని మాత్రం వాష్ చేసేవాళ్లు. తాగేనీరు కోసం అడుక్కునే పరిస్థితి. ఎందుకంటే సెట్లో కొన్న వాటర్ బాటిల్స్ మాత్రమే ఉండేవి. ఒకవేళ మేం అవి కావాలని అడిగితే మమ్మల్ని తిట్టేవారు. బిస్కెట్ ప్యాకెట్ కూడా సెట్లో మహాప్రసాదంలా అనిపించేది. రాత్రి షిఫ్ట్‌లో అయితే అది కూడా ఇచ్చేవారు కాదు' (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?) వ్యాన్‌లో బొద్దింకలు 'అలానే షో జరిగినన్నీ రోజులు నా సొంత జ్యూవెలర్లీ ధరించేదాన్ని. నా షూస్ చిరుగులు పడినా అవే కొన్నాళ్లపాటు యూజ్ చేశారు. మాకు కనీసం కాస్ట్యూమ్స్ అయినా ఇచ్చేవారు. చైల్డ్ ఆర్టిస్టులకు అయితే అవి కూడా ఇవ్వరు. కొవిడ్ టైంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు మాత్రం శానిటైజేషన్ చేశారు అంతే. మేముండే క్యార్ వాన్స్‌లో విపరీతంగా బొద్దింకలు ఉండేవి' అని చెప్పిన జెన్నీఫర్ మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పటికి ముగుస్తుందో? తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి జెన్నీఫర్ మిస్త్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే గతంలో నిర్మాతలపై కేసు పెట్టిన ఈమె.. ఆయన తన చెంప గిల్లాడని, అసభ్యంగా మాట్లాడుతూ మద్యం తాగాలని బలవంతం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈమెకు సకాలంలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం, వేధింపులకు గురిచేయడంతో ఈ మార్చిలో ఈమె షో నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి షో యాజమాన్యం తీరుపై ఈమె ఆరోపణలు చేస్తూనే ఉంది. మరి ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో? -
మరోసారి వివాదంలో 'బిగ్ బాస్'.. మొదలవడానికి ముందే!
తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే చాలామంది 'బిగ్ బాస్' గుర్తొస్తుంది. ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ ప్రారంభం కాబోతుంది. దాదాపు నాలుగు సీజన్ల నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ మధ్య టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు షో మొదలవడానికి ముందే ఆయనకు కోర్టు నోటీసులు పంపించింది. (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) ఏం జరిగింది? బిగ్ బాస్ షో ప్రారంభ సీజన్లు సక్సెస్ అయ్యాయి గానీ తర్వాత తర్వాత మాత్రం షోలో కంటెంట్ తక్కువై, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే సీపీఐ నాయకుడు నారాయణ చాలాసార్లు కౌంటర్స్ వేశారు. ఈ షో చూడటం వల్ల పిల్లలు, యువత చెడిపోతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్స్ మధ్య అశ్లీలత, అసభ్యత సీన్స్ ఎక్కువయ్యాయని పిటీషన్ కూడా వేశారు. ఈ క్రమంలోనే షోని నిలిపేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాగ్‌కు నోటీసులు గతంలో దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఏపీ హైకోర్ట్.. నాగార్జునతోపాటు సదరు ఛానెల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. అలానే ఈ కేసు తదుపతి విచారణని 4 వారాలకు వాయిదా వేసింది. గతంలోనూ షోపై విమర్శలు రావడంతో ఇలాంటి పిటిషన్స్ దాఖలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా షో నడిచింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఆమె అరిస్తే డబ్బులొస్తాయ్...
చెవులు చిల్లులు పడేలా కీచుమని అరిస్తే చిరాకనిపిస్తుంది. కానీ యాష్లే పెల్డన్ అస్సలు చిరాకు పడదు. సరికదా గంటల తరబడి అరుస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎంత అరిస్తే అంత డబ్బులొస్తాయ్. అరిస్తే డబ్బులెందుకొస్తాయనే కదా మీ సందేహం. హాలీవుడ్ సినిమా, టీవీ ప్రొడక్షన్ సంస్థలిస్తాయి. స్క్రీమ్ ఆర్టిస్ట్ అయిన పెల్డన్ అలా మొత్తుకునేది సినిమాలు, టీవీ షోల కోసం. హీరోహీరోయిన్లకు డబ్బింగ్ చెప్పినట్టుగా, వాళ్లకు బదులు స్టంట్స్ చేసినట్టుగా... హీరోయిన్లకు బదులుగా ఆమె అరుస్తుంది. మీరు చూసిన చాలా హాలీవుడ్ సినిమాల్లో ఆ అరుపులను అత్యంత సూక్ష్మగ్రాహకాలైన మైక్రోఫోన్స్‌తో రికార్డు చేస్తారు. అరుపులకు నటీనటులు డబ్బింగ్ చెప్పడం వల్ల వాళ్ల గొంతు పాడయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ స్థాయిలో వాళ్ల గొంతు ఉండకపోవచ్చు. అలాంటప్పుడే పెల్డన్లాంటివాళ్ల గొంతును వాడుకుంటారు సినిమా వాళ్లు. అరుపుల్లో పెల్డన్ నైపుణ్యాన్ని చిన్నవయసులోనే కనిపెట్టారు తల్లిదండ్రులు. ఏడేళ్ల వయసులోనే కోపగొండి బాలికగా అవకాశం దక్కించుకుంది. బాల్యంలోనే వేధింపులకు గురైన బాలిక నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో... ఆ బాలిక పాత్ర గట్టిగా కీచుమని అరుస్తూ ఉంటుంది. అదే ఆమెకు కెరీర్‌ను నిలబెట్టింది. అదేమంత గొప్పపని... గట్టిగా అరిచేస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ భయంవేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశంతో, సంతోషం ఎక్కువైనప్పుడు, ఏదైనా సాధించినప్పుడు.. ఇలా రకరకాల అరుపులుంటాయి. ప్రత్యేకించి నొప్పితో, బాధ కలిగినప్పుడు... వచ్చే అరుపులు చాలా కష్టమైనవి. ఒక్కోసారి వరుసగా కొన్నిగంటలపాటు అరవాల్సి వస్తుం ది. అవన్నీ అవలీలగా చేసేస్తుంది పెల్డన్. అదెలా అంటే... ‘చిన్న కీటకాన్ని చూసినా నేను గట్టిగా మొత్తుకుంటా. నాకది సహజంగా వచ్చింది’ అని చెబుతుంది. 20 ఏళ్లొచ్చేసరికి చాలా సినిమాలు, టీవీ సిరీసులకు తన అరుపులను ఇచ్చేసిన పెల్డన్ ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. -
పేదరికం వెంటాడుతున్నా.. డ్యాన్స్‌లో దుమ్ములేపుతున్న మహబూబ్‌నగర్ కుర్రాడు
సాక్షి, మహబూబ్‌నగర్: డాన్సంటే అతనికి పంచ ప్రాణాలు. ఏ రోజైనా తనను ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు గండేడ్ మండలం బైస్పల్లికి చెందిన యువకుడు భరత్. బైస్పల్లికి చెందిన గత్ప చిన్నయ్య, రుక్కమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు భరత్. ఈ కుటుంబానికి అర ఎకరా పొలమే ఆధారం కావడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. భరత్ మాత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నృత్యంలో మరింత రాటుదేలాడు. 40కి పైగా టీవీ షోలు.. భరత్‌కు చిన్నతనం నుంచే డాన్సు అంటే అమితాసక్తి. ఇంటర్ చదివే సమయంలో కోస్గికి చెందిన శ్రీనివాస్ మాస్టర్ చేరదీసి రెండేళ్లు శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఆ మాస్టారే.. జీ తెలుగు టీవీ చానల్లో బిన్ని మాస్టర్ కొరిగ్రాఫర్ ఉండే ఆటో జూనియర్ ప్రోగ్రాంలో మొదటి సారి అవకాశం ఇప్పించాడు. ఇప్పటి వరకు మా టీవీ, జీ తెలుగు, జెమిని, ఈటీవీలలో 40కి పైగా డ్యాన్స్ షోల్లో పాల్గొన్నాడు. 2021లో ఢీ షోలో అవకాశం వచ్చింది. అలాగే, పలు రాష్త్రస్థాయి డాన్సు పోటీల్లో అవార్డులు, ప్రశంస పత్రాలు వచ్చాయి. వెంటాడుతున్న పేదరికం.. తండ్రి చిన్నయ్య రంగారెడ్డిలోని ఓ రైస్‌మిల్లులో కూలీ పనిచేసి అక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండడంతో కొడుకు ఎదుగుదలకు ఆర్థిక సహాయం అందించలేకపోతున్నా డు. అయితే, భరత్‌కు టీవీల్లో జరిగే షోల్లో అంతంతమాత్రంగానే డబ్బులు ఇవ్వడం, ఒక్కోసారి అసలు ఇవ్వకపోవడంతో స్నేహితుల వద్ద అప్పు చేసి తనకు కావాల్సినవి సమకూర్చుకుంటున్నాడు. అయితే, ఏప్రిల్ 17న హైద్రాబాద్‌లో జరిగిన ఆలిండియా రూరల్ కాంపిటేషన్స్‌లో సెమీఫైనల్‌కు భరత్ సెలెక్టు అయ్యాడు. ఈనెల 27 భూపాల్‌లో జరిగే పోటీలకు వెళ్లాల్సి ఉంది. డబ్బు లేక ఇంకా టికెట్లు కూడా బుక్ చేసుకోలేదు. దాతలు సహకరిస్తే ప్రతిభ చాటుతా.. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుతానన్న పట్టుదలే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇప్పటి వరకు స్నేహితుల సహకారంతోనే వెళుతున్నా. ఏదైనా ప్రయివేటు ఉద్యోగం చేద్దామనుకుంటే టీవీ షోలు 15 రోజులు కంటిన్యూగా ఉండడం, మిగతా 15 రోజులకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం భూపాల్ వెళ్లడానికి కూడా డబ్బులు లేక టికెట్లు బుక్ చేసుకోలేదు. దాతలు సహకారిస్తే ప్రతిభ చాటి పుట్టిన ఊరు, జిల్లా, ప్రాంతానికి మంచి పేరు తెస్తా. – భరత్, డ్యాన్సర్, బైస్పల్లి గండేడ్ మండలం -
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. వెంకీ సార్ అలా అనడం హ్యాపీ వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను. 99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను. తనని చూస్తే నాకు గర్వం విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే. అతను నా లక్కీ చార్మ్ నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు. మైండ్‌సెట్ మారింది! òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. -
షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల తర్వాత టీవీ షూటింగ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం.. సెట్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకోవాలని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. షూటింగ్‌లు ప్రారంభం కావడంతో యాంకర్లు తమ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో చాలా రోజుల తర్వాత సెట్లలో సందడి వాతావరణం నెలకొంది. తమ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ను పలువురు యాంకర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రముఖ యాంకర్ సుమ.. ‘చాల రోజుల తర్వాత సెట్లోకి వచ్చాను. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. బాధ్యతగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అలాగే తను మేకప్ వేసుకుంటున్న ఓ చిన్నపాటి వీడియోను కూడా సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరోవైపు నటి, యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ సెట్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. వీ ఆర్ బ్యాక్ అని తెలిపారు. అలాగే యాంకర్లు రవి, భానుశ్రీలు కూడా షూటింగ్ సెట్లో చేసిన సందడిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram Never thought that satti and ramesh will have to dress up like this . A post shared by Suma Kanakala (@kanakalasuma) on Jun 18, 2020 at 6:44am PDT -
కొన్ని నిబంధనలను సడలించాలి
టీవీ, ఫిల్మ్ షూటింగ్‌లకు కొన్ని షరతులతో కూడిన నియమ, నిబంధనలతో ముంబై ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ షరతుల్లో ‘65ఏళ్లకు పై బడినవారిని షూటింగ్స్‌కు అనుమతించవద్దు’, ‘షూటింగ్ లొకేషన్లో తప్పనిసరిగా ఒక డాక్టర్, ఓ నర్స్, ఓ అంబులెన్స్ ఉండాలి’ అనే నిబంధనలను పునఃపరిశీలించాలని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ కూడా ఈ రెండు నిబంధనలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇవి కాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనల్లో మరికొన్నింటిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘స్టూడియోలో లేదా లొకేషన్‌కి దగ్గర్లోని హాస్పటల్స్, అపార్ట్‌మెంట్స్‌లో చిత్రబృందం బస చేసేలా నిర్మాతలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సూచన సాధ్యమైంది కాదు. ఇప్పటికే హోటల్స్, అపార్ట్‌మెంట్స్‌ను కోవిడ్ 19 బాధితుల కోసం వినియోగిస్తున్నారు. కేవలం చిత్రబృందం కోసమే ఓ అపార్ట్‌మెంట్‌ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవడం కుదరకపోవచ్చు. అలాగే సినిమాల్లోని కుటుంబ సన్నివేశాల కోసం నిజమైన కుటుంబాన్నే ఎంపిక చేసుకుని షూటింగ్ చేయాలన్న సూచన అర్థరహితమైనది. ఎందుకంటే ఒకే కుటుంబంలో అందరూ యాక్టర్స్ ఉండరు. షూటింగ్ లొకేషన్స్‌లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయని పరిశీలించడానికి ఓ ఇన్స్పెక్టర్ ఉండాలని కొన్ని వర్కర్స్ అసోసియేషన్స్ వారు కోరుతున్నారు (ప్రభుత్వం సూచించకపోయినా). కానీ ఇది సరైంది కాదు. షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయో ఓ వీడియో రూపంలో చిత్రీకరించి ప్రభుత్వ ప్రతినిధులకు నిర్మాతలు అందజేసే ఏర్పాటు జరుగుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొంది. -
పాకిస్తాన్లో భారత సినిమాలు బంద్
కరాచీ: పాకిస్తాన్ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై నిషేధాన్ని అక్కడి సుప్రీంకోర్టు శనివారం పునరుద్ధరించింది. ఎలాంటి అభ్యంతరం లేని కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్ సకీజ్ నిసార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘దైయమెర్–భాషా ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్ అడ్డుకుంటోంది. కనీసం ఆ దేశపు సినిమాలు, టీవీ కార్యక్రమాలను కూడా మనం అడ్డుకోలేమా?’ అని ప్రశ్నించారు. దీంతో జడ్జి పాక్ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించారు. -
అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లాలి!
‘అమ్మ పెట్టకపోతే పిన్ని ఇంటికి వెళ్లమని’ సామెత. తల్లి వంట గదిలో పొయ్యి వెలిగించకపోతే పినతల్లి ఇంటికైనా వెళ్లి కడుపు నింపుకోవాలి కదా. ఇక్కడ తల్లి పెద్ద తెర అయితే పినతల్లి బుల్లి తెర. ఒకప్పుడు టీవీలో పని చేయడం తక్కువగా చూడబడేది. టీవీని ద్వితీయశ్రేణి మీడియాగా భావించబడేది. ఇవాళ టీవీ దాదాపు సినిమాకు పార్లల్ మీడియాగా ఉంది. కోట్లాది ఇళ్లలో టీవీని ఆన్ చేయకుండా రోజు గడవదు. పాపులర్ సీరియల్స్, గేమ్ షోస్, టాక్ షోస్, డాన్స్ షోస్... ఇవన్నీ లాభదాయకమైన షోస్‌గా కాసులు కురిపిస్తున్నాయి కూడా. ఇంకా చెప్పాలంటే గతంలో సినిమా రంగంలో అవకాశాలు తగ్గినవారు టీవీ రంగంలో ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ రాణించాలని చూస్తున్నారు. పై సామెతను తిరగేస్తే అమ్మ దగ్గర రెండు ముద్దలు పిన్ని దగ్గర రెండు ముద్దలు సొమ్ము చేసుకుందామని చూస్తున్నారు.బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్... వీరందరూ టీవీ షోలు చేసినవారే. కుంగిపోయి ఉన్న తన కెరీర్‌ను అమితాబ్ బచ్చన్ టీవీలోని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ద్వారానే పునరుద్ధరించుకున్నాడు. ఆమిర్ చేసిన ‘సత్యమేవ జయతే’ షో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో ద్వారా కొనసాగుతూనే ఉన్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జగపతిబాబు, జయప్రద షోలు చేశారు. ఎప్పుడూ మాట్లాడని దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తన పేరు మీద తయారైన షోలలో పాల్గొన్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్‌బాబు(మనో), సునీత... తదితరులు సంగీతానికి సంబంధించిన షోలు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నా బుల్లి తెర మీద షోను సక్సెస్ చేసుకున్న మరో నటుడు ఆలీ. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరం కూడా కొంతమంది సినిమా పర్సనాల్టీలను టీవీకి పరిచయం చేసింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా చేసింది. వారి వివరాలు.... నా..నీ టీవీలో చూసేయండి వరుస విజయాలతో కెరీర్లో దూసుకెళ్తున్న హీరో నాని ఈ ఏడాది టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. సూపర్ హిట్ షో ‘బిగ్ బాస్’ ద్వారా ఇంటింటా బొమ్మ కట్టారు. నిజానికి బిగ్‌బాస్ సీజన్ వన్ హోస్ట్‌గా ఎన్.టి.ఆర్ మార్కులు కొట్టేశారు. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ షూటింగ్ బిజీతో బిగ్‌బాస్ సెకండ్ సీజన్‌కు వ్యాఖ్యాతగా చేయడం కుదరకపోవడంతో ఆయన ప్లేస్‌లోకి నాని వచ్చారు. తనదైన స్టైల్లో ఆయన షోని మోశారు. మొదట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపించినా ఎపిసోడ్స్ ముందుకు వెళ్లే కొద్దీ అందర్నీ ‘నా నీ’ టీవీలకు కట్టిపడేశారు నాని. అయితే థర్డ్ సీజన్‌కు యాంకర్‌గా కొనసాగబోనని సెకండ్ సీజన్ ఫైనల్ రోజే అనౌన్స్ చేశాడాయన. ప్రస్తుతానికైతే ఖాళీ లేదు... భవిష్యత్తులో ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలు ఎప్పుడు తన దారిలో వచ్చినా టీవీలో మెరవడానికి రెడీ అన్నాడాయన. నవ్వుతారు దశాబ్దాలుగా వెండి తెర మీద నవ్వులు పూయిస్తున్నారు బ్రహ్మానందం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే హాస్య గ్రం«థులకు పని పెరుగుతుంది. ఇప్పుడు తొలిసారి బుల్లితెర మీద కూడా కామెడీ షో ద్వారానే ఎంట్రీ ఇచ్చారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘ది గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్’ పేరుతో స్టాండప్ కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారాయన. ఏదైనా టాపిక్ ఎంచుకొని దాంతో హాస్యం పుట్టించగలగడమే స్టాండప్ కామెడీ. మిమిక్రీ కళకు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. హాస్యానికి సంబంధించిన షో కాబట్టి వెంటనే చేయాలనిపించింది అని ఈ షో గురించి పేర్కొన్నారు బ్రహ్మానందం. వినోదంతో పాటు విరాళమూ నటుడిగా, నిర్మాతగా, తమిళ నటుల సంఘానికి ప్రెసిడెంట్‌గా పూర్తి బిజీగా ఉన్నప్పటికీ టెలివిజన్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అన్నారు విశాల్. అయితే విశాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నది కేవలం టాక్ షో మాత్రమే కాదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే చారిటీ షో కూడా . ‘నామ్ ఒరువర్’ అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం తెలుగులో మంచు లక్ష్మి చేస్తోన్న ‘మేము సైతం’ స్టైల్లోనే సాగుతోంది. సెలిబ్రిటీలతో కొంచెం సేపు చిట్‌చాట్ చేయించి కష్టాల్లో ఉన్న వాళ్ల కోసం చారిటీగా ఏదైనా కార్యక్రమం చేసి ఫండ్స్ సేకరిస్తారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా కొంచెం సామాజిక స్పృహ ఉన్న షోతో ఎంట్రీ బావుంటుందని ఈ షో ద్వారా ఎంట్రీ ఇస్తున్నానని విశాల్ పేర్కొన్నారు. స్వప్న సుందరి కోసం... ‘స్వప్న సుందరి’ అనే రియాలిటీ షో ద్వారా హోస్ట్‌గా మారారు తమిళ నటుడు ప్రసన్న. ఈయన నటి స్నేహ భర్త. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో విలన్‌గా నటించారు. అమెరికన్ హిట్ షో ‘నెక్ట్స్ టాప్ మోడల్’ కాన్సెప్ట్‌తో ఈ స్వప్న సుందరి షోను రూపొందించారు. తమిళనాడు నెక్ట్స్ ‘సూపర్ మోడల్’ ఎవరు? అనేది ఈ షో కాన్సెప్ట్. కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచిన విజేతను స్వప్న సుందరిగా ప్రకటిస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెలలోనే స్టార్ట్ అయింది. ప్రశ్నించడం ఆపేద్దాం విశాల్ బాటలోనే వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా సామాజిక కోణం ఉన్న షో ద్వారానే టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఉన్నై అరిందాల్’ అనే షో ద్వారా సొసైటీలో ఉన్న సమస్యలను డిస్కస్ చేయదలిచారు. అలాగే ప్రేక్షకులు తమని తాము ప్రశ్నించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతోందని పేర్కొన్నారామె. ఎవరెవరు ఏమేం చేశారు? అని ప్రశ్నించడం ఆపేద్దాం. మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. జయ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. సినిమాల పరంగానూ ఈ ఏడాది వరలక్ష్మీ డైరీ ప్రతి పేజ్ మంచి సక్సెస్‌ను రాసిపెట్టుకుంది. ఆల్రెడీ నాలుగు రిలీజ్లు ఉన్న ఈ తార ఇప్పుడు ఇంకో రెండు రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మా ఇంటి అల్లుడు ఆర్య.. తమిళంలో రొమాంటిక్ హీరో. అదే కాన్సెప్ట్‌తో ‘ఎంగ వీట్టు మాప్పిళ్లై’ (మా ఇంటి అల్లుడు) అనే షో రూపొందించారు. ఆర్య పెళ్లి కొడుకుగా అతని పరిణయం కోసం కొందరు కంటెస్టంట్స్ పాల్గొని, ఫైనల్ రౌండ్ వరకూ నిలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడు అన్నది ఈ షో కాన్సెప్ట్. ప్రస్తుతం తెలుగులో వస్తున్న ‘ప్రదీప్ పెళ్లి చూపులు’ తరహాలోనే ఈ కార్యక్రమం ఉంది. కానీ విశేషమేంటంటే షో ఆఖర్లో షో ఫైనలిస్ట్‌ని పెళ్లి చేసుకోబోవడం లేదని ఆర్య షాక్ కూడా ఇచ్చారు. సింగర్‌గా, నటిగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఇప్పటికే బాక్స్‌లకు టిక్ పెట్టారు శ్రుతీహాసన్. ఇప్పుడు టెలివిజన్ హోస్ట్ అన్న బాక్స్‌కు కూడా టిక్ పెట్టడానికి రెడీ అయ్యారు. తండ్రి కమల్‌హాసన్ బాటలోనే టీవీ ఆడియన్స్‌ను అలరించడానికి సన్నద్ధమయ్యారు ఈ నటి. సన్ టీవీలో ప్రసారం కాబోయే ‘హలో సాగో’ అనే షోకు హోస్ట్‌గా కనిపిస్తారు. ఈ విషయాన్ని ఇటీవలే తెలిపారు శ్రుతీ. కొత్త సినిమాలేవీ సైన్ చేయని శ్రుతీ ప్రస్తుతం మ్యూజిక్ కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఈ షో ఎలా ఉంటుందో అన్న డీటైల్స్ మాత్రం తెలియాల్సి ఉంది. హీరోయిన్లు సైతం చిన్న తెర మీద పెద్ద హీరోలతో పాటు పెద్ద హీరోయిన్లు కూడా తమ ప్రతిభ చాటుతున్నారు. జయసుధ, మంచు లక్ష్మీ, జీవిత, సుమలత, రోజా, ఆమని, రంభ, స్నేహ వంటి తారలు చిన్ని తెరకు ప్రాధాన్యం ఇచ్చి కొత్త అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇంటింటి తగాదాలు తీర్చే పనిలో జీవిత, సుమలత, రోజా చూపించిన సహనం, ఓర్పు, అనుభవం ప్రేక్షకులకు నచ్చింది. ఇక సామాజిక బాధ్యతతో ‘మేము సైతం’ కార్యక్రమం చేసి బాధితులను ఆదుకున్నారు మంచు లక్ష్మీ. కొన్ని షోలకు హోస్టులుగా సదా, ప్రియమణి, ఖుష్బూ పని చేశారు. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
జాగ్రత్త! టీవీలు చంపేస్తున్నాయి
దూకుడు చూడ్డానికి బాగానే ఉంటుంది! దూకేప్పుడు చేతిలో రిమోట్ ఉండదుగా! పేరెంట్స్ చేతుల్లో పిల్లల రిమోట్ ఉండదు! పేరెంట్స్ నేర్పే సంస్కారమే వాళ్లను అదుపులో ఉంచుతుంది! మంచి–చెడుల మధ్య విచక్షణ నేర్పుతుంది!! టీవీలు చంపేస్తున్నాయి!! ‘‘ఎలా కాలింది పాపకు’’ పక్క బెడ్లో ఉన్న ఎనిమిదేళ్ల బాబు తల్లి ప్రశ్న. ఆ ప్రశ్న వినగానే రెండు చేతుల్లో మొహం దాచుకొని ఘొల్లుమంది పాప తల్లి. ‘‘అయ్యో.. సారీ అండీ ఇబ్బంది పెడితే’’ నొచ్చుకుంది పక్క బెడ్లోని బాబు తల్లి. ‘‘పర్లేదమ్మా...’’ అని ఆవిడకు సమాధానమిచ్చి.. ‘‘అనుపమా.. ఏంటిది.. ఊరుకో... పొద్దస్తమానం నువ్వలా ఏడుస్తుంటే పిల్ల బెంబేలెత్తి పోతుంది..’’ అంటూ కూతురిని మందలించింది పెద్దావిడ. పక్క బెడ్ బాబు తల్లి కూడా.. ‘‘అవునండీ.. మీ అమ్మగారు చెప్పింది కరెక్టే.. మనమే భయపడితే.. మనల్ని చూసి పిల్లలు మరింత భయపడ్తారు. ఊరుకోండి.. అనవసరంగా నేనే కదిలించి... మిమ్మల్ని ఏడిపించినట్టయింది’’ అంటూ నొచ్చుకుంది. ‘‘అయ్యో మీరలా ఫీలవకండి... నేను మరిచిపోతే కదా.. నేనే సారీ అండీ’’ అంటూ చీర చెంగుతో కళ్లు తుడుచుకుంటూ తమాయించుకుంది అనుపమ. ‘‘మీ బాబుకు...’’ అంటూ ఆగిపోయింది అనుపమ. ఆ మాటకు నిద్రపోతున్న బాబు పక్కన కూర్చొని వాడి తల మీద చేయి వేసి నిమురుతూ చెప్పింది వాళ్లమ్మ మృదుల.. ‘‘మా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు’’ అని. ‘‘అయ్యయ్యో... అంటే వాడే దూకాడా? లేక ఎవరన్నా..’’ అని అనుపమ వాక్యం పూర్తిచేసేలోపే ‘‘వాడే దూకాడు’’ చెప్పింది మృదుల. ‘‘అదేంటమ్మా.. మీరెవరూ లేరా? అలాఎలా దూకాడు?’’ విస్మయంగా అనుపమ తల్లి. ‘‘నేనూ, మావారు ఇద్దరం జాబ్ హోల్డర్స్మే. పొద్దున వెళితే రాత్రికి రావడమే ఇంటికి. ఇంట్లో అత్తగారుంటారు వాడి ఆలనాపాలనా చూసుకుంటూ. పోగో చానల్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి వాడికి. ఏం తినిపించాలన్నా ఆ చానల్స్ పెట్టాల్సిందే. ఆ చానల్, ఆ సీరియల్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వాడి మీద. మెయిన్‌గా స్పైడర్ మ్యాన్ అంటే. అలాంటి డ్రెస్ కూడా కొనిపించుకున్నాడు. ఆ డ్రెస్ వేసుకొని ఇంట్లో మంచం మీద నుంచి, దీవాన్ మీద నుంచి దూకి స్పైడర్‌మ్యాన్‌ను ఇమిటేట్ చేస్తుంటే సంబరపడిపోయేవాళ్లం. అది వాడిని ఇంకోరకంగా డ్రైవ్ చేస్తుందని ఏ రోజూ అనుకోలేదు. మాకసలు ఆ థాటే రాలేదు. పసిగట్టలేదు కూడా. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సాయంకాలం స్కూల్ నుంచి రాగానే స్పైడర్‌మ్యాన్ పెట్టుకొని స్నాక్స్ తిని ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లాడట ఆడుకోవడానికి. మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలంతా కలిసి వీడిని రెచ్చగొట్టారో... వీడే తన అడ్వంచర్ చూపించాలనుకున్నాడో.. వాడి ఫ్రెండ్ వాళ్లింట్లో బాల్కనీలోంచి కిందికి దూకాడు’’ అని చెప్తుంటే మృదుల కళ్లు నిండాయి నీళ్లతో. అనుపమ లేచి ఆమె పక్కకు వెళ్లి మృదుల భుజమ్మీద చేయివేసింది అనునయంగా. ‘‘హూ... ’’ అని బాధగా నిట్టూరుస్తూ ఈ కాలం పిల్లలే అంత తల్లీ’’ అంటూ తన మనవరాలి గాయం గురించి చెప్పడం మొదలుపెట్టింది అనుపమ తల్లి సుజాత. ‘‘దీని ప్రమాదానికీ నేనే సాక్షినయ్యే పాపం చుట్టుకుంది తల్లీ’’ అంది మనవరాలిని చూపిస్తూ. అనుపమ మళ్లీ తన కూతురు దగ్గరకొచ్చి కూర్చుంది బెడ్ మీద. ‘‘మీకులాగే ఇదిగో నా కూతురూ, అల్లుడూ కూడా ఉద్యోగస్తులే. ఇదీ అంతే.. టీవీలేందే ముద్ద తినదు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని.. ఇంట్లో ఎవరూ ఉండకపోయే సరికి పొద్దుపోక టీవీ సీరియల్స్ చూస్తుంటానమ్మా.. అలా టీవీ చూడ్డం నా మనవరాలికి నా వల్లే అలవాటైంది.నేనెన్ని సీరియల్స్ చూస్తానో అదీ అన్ని చూస్తుంది. ఆ యాక్టర్స్‌లా యాక్షన్ చేస్తుంటే మురిసి ముక్కలయ్యేదాన్ని. ఇదిగో వీళ్లు ఇంటికి రాగానే ఆనందంగా చెప్పేదాన్ని దాని చేష్టలన్నిటినీ. ఇలాగే మొన్న వారం కిందట... టీవీలో వస్తున్న సీరియల్ కొంత చూసి సంధ్యవేళ అయిందని హాల్లోనే ఉన్న దేవుడి మండపంలో దీపం వెలిగించి వంటింట్లోకి వెళ్లాను రాత్రికి వంటకు కూరలు తరుక్కుందామని. ఇంకేముంది టీవీలో చూపించినట్టు.. సోఫా మీది కవర్ తీసి దీపం దగ్గర అంటించి కిందపడేసి దాంట్లో డాన్స్ చేయసాగింది నా మనవరాలు. ఆ మంటల బాధకు తాళలేక కేకలేస్తుంటే అప్పుడు వచ్చి చూస్తే ఏముంది? మంటల్లో పిల్ల.. గుండె గుభేలుమంది. వెంటనే దుప్పట్లో చుట్టేసి మంటలార్పేసా.. ఇంకా నయం.. పాదాలు మాత్రమే కాలాయి.. లేకపోతే పిల్ల ఏమైపోయేదో...’’ అంటూ ఏడ్వసాగింది సుజాత. ‘‘అమ్మా.. ఊరుకో... చంటిది లేస్తుంది’’ తల్లిని హెచ్చరించింది అనుపమ. ‘‘ఏమన్నారు డాక్టర్లు?’’ అడిగింది మృదుల. ‘‘గాయం తగ్గాక ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు’’ చెప్పింది అనుపమ తలవంచుకొని.‘‘మావాడిదీ తృటిలో తప్పిన పెద్ద యాక్సిడెంటేనండీ... కాళ్లు ఫ్రాక్చరై గండం గట్టెక్కింది. లేక ఏ నడుమో.. స్పైనో దెబ్బతింటే జీవితాంతం వీల్ చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చేది అన్నారు డాక్టర్లు ’’ తన వేదనా పంచుకుంది మృదుల. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు.. తమ గుండెను దిటవు చేసుకోవడం కోసం! కర్ణాటక, ముంబైలలో... మొన్న నవంబర్ నెలలో కర్ణాటకలో ఓ ఏడేళ్ల పాప ‘‘నందిని’’ అనే సీరియల్ చూస్తూ అందులోని పాత్ర మంటల్లో దూకడం చూసి ఈ పాప కూడా కాగితాలను పేర్చి మంట పెట్టి అందులో దూకి చనిపోయింది. అలాగే రెండేళ్ల కిందట ముంబైలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. స్పైడర్ మ్యాన్‌ను చూస్తూ ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు తనను తాను స్పైడర్‌మ్యాన్‌లా ఊహించుకుంటూ రెండంతస్థుల మేడ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది కూడా! అదంతా డ్రామా అని చెప్పండి ప్రస్తుత రోజుల్లో టీవీ మన కుటంబాల్లో భాగమైపోయింది. దాన్ని చూడకుండా పిల్లలను కట్టడిచేయడం దుస్సాధ్యం. దాని బదులు టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ అన్నీ కల్పనలే అని వివరించడం మేలు. ఏ టీవీ ప్రోగ్రామ్ అయినా, సీరియల్ అయినా టీవీల టీఆర్పీలు పెంచడానికే అన్న సత్యాన్ని పిల్లలకు తెలియజేయాలి. ప్రేక్షకాదరణ పెంచుకోవడం కోసం నిజ జీవితంలో సాధ్యంకాని స్టంట్స్, డ్రామా, చిటికెలో పరిష్కారాలు, అడ్డదారుల్లో విజయాలు పొందడం.. వంటివన్నీ చూపిస్తారని.. అవి రియల్ లైఫ్‌లో చేయలేమని గట్టిగా చెప్పాలి. వీలైనంతవరకు టీవీ పెట్టే సమయం, కట్టేసే సమయం అందరికీ ఒకేలా ఉండేలా చూడండి. అంటే పేరెంట్స్ ఆబ్సెన్స్లో పిల్లలు టీవీ చూసే ప్రాక్టీస్‌ను తగ్గించడమన్నమాట. అలాగే అర్థరాత్రి వరకు టీవీ చూసే అలవాటును ఇంట్లో అందరూ మానుకోవాలి. వారంరోజులు, వారాంతాల్లో కూడా. ఒకవేళ పెద్దవాళ్లు ఇంట్లో లేనప్పుడు పిల్లలు కాలక్షేపం కోసం టీవీ చూడాల్సివస్తే పిల్లలు చూడకూడని చానల్స్‌ను లాక్‌చేసి పెట్టడం మంచిది. అంతేకాదు ఇంట్లో ఒక పిల్లాడు లేదా పాప చదువుకుంటున్నప్పుడు ఇంకో పిల్లాడు లేదా పాప టీవీ చూడ్డాన్ని ప్రోత్సహించవద్దు. టీవీకి బదులు శారీరక శ్రమ ఉండే ఆటలు, ఇతర యాక్టివిటీస్‌ను ఎంకరేజ్ చేయడమే ఎల్లవేళలా శ్రేయస్కరం. – మేకల కళ్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ల్యూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ – శరాది -
జబర్దస్త్, పటాస్ షోలకు ఝలక్!
హైదరాబాద్: పలు విమర్శలకు కారణమవుతున్న జబర్దస్, పటాస్ టీవీ షో నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. కామెడీ పేరుతో ఈ షోలలో బూతును ఎక్కువ ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను గతంలో బాలానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని దివాకర్ తెలిపారు. దీంతో స్పందించిన హెచ్ఆర్సీ ఈ రెండు టీవీ షోల దర్శకులకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసిందన్నారు. మహిళలు, చిన్నపిల్లలను కించపరిచేలా ఈ షోల్లో కొన్ని స్కిట్స్ ప్రదర్శిస్తున్నారని, రెండు కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం వల్ల సమాజంలోకి చెడు సందేశం వెళుతున్నదని ఆయన అన్నారు. -
సిద్ధూకు గ్రీన్ సిగ్నల్
చండీగఢ్: టీవీ షోలు చేసేందుకు పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు అనుమతి లభించింది. పంజాబ్ అడ్వకేట్ జనరల్ అతుల్ నందా నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మంత్రిగా కొనసాగుతూ టీవీ షోలు చేసుకోవడానికి అభ్యంతరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అతుల్ నందా నుంచి తనకు నివేదిక అందిన విషయాన్ని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధ్రువీకరించారు. అడ్వకేట్ జనరల్ పచ్చజెండా ఊపడంతో మంత్రిగా కొనసాగేందుకు సిద్ధూకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన శాఖను కూడా మార్చే అవకాశం లేదు. సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా సిద్ధూను మారుస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. డబ్బు సంపాదనకు తనకు టీవీ షోలు మినహా ప్రత్యామ్నాయం లేదని సిద్ధూ అంతకుముందు వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడకుండా తాను టీవీ షోలు చేసుకుంటే తప్పేందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ అడ్వకేట్ జనరల్ ను న్యాయసలహా కోరారు. -
మీకు ఎందుకయ్యా కడుపుమంట!
పంజాబ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా టీవీ షోలలో కొనసాగుతానని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేయడంతో ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత టీవీ షోలలో పాల్గొనడం ఏమిటని ప్రతిపక్షాల నేతలు ఆయనను విమర్శిస్తున్నారు. అయితే, ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్నవారిపై సిద్ధూ ఘాటుగా విరుచుకుపడ్డారు. ‘మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తరహాలో నేనే ఏమైనా బస్సు సర్వీసులను నడిపానా? లేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డానా? కేవలం నెలలో నాలుగు రోజులు.. అది కూడా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసుకుంటానంటే.. ఎందుకు మీకు కడుపు మండిపోతున్నది’ అని సిద్ధూ ప్రశ్నించారు. మంత్రి అయిన తర్వాత కూడా సిద్ధూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనాలా, వద్ద అనే అంశం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకుంటామని పంజాబ్ సీఎం అమరీందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, సీఎం అమరీందర్ తన బాస్ అని, ఆయన ఆదేశాలు గౌరవిస్తానని, అయినప్పటికీ తాను టీవీ షోలలో పాల్గొనడం మానబోనని సిద్ధూ పేర్కొంటున్నారు. సిద్ధూ ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. -
న్యాయ వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలుగుతుంది!
‘జబర్దస్త్’ కేసులో ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘టీవీ కార్యక్రమాలు ముఖ్యంగా హాస్య ప్రధాన కార్యక్రమాలను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తుంటారు. కొద్దిపాటి అక్షరాస్యత ఉన్న వారు, నిరక్ష్యరాస్యులు, గ్రామీణ నేపథ్యం కలిగిన వారు ఆయా హాస్య ప్రధాన కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, న్యాయ వాదులను ఉద్దేశించి పలికే డైలాగులను బట్టి న్యాయ స్థానాల్లో కార్యకలాపాలు ఇలానే జరుగుతాయని నమ్మే అవకాశం ఉంది. అటువంటి కార్యక్రమాలు సాధారణ ప్రజానీకం మనస్సుల్లో న్యాయ వ్యవస్థపై తప్పుడు అభి ప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదుల ప్రతిష్టకు, హుందాతనానికి భంగం కలుగుతుంది’ అని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. అయితే జబర్దస్త్ వంటి కార్యక్రమాలపై చట్టపరంగా ఎటువంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదని, ఇటువంటి వాటి నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగ జార్చే కార్యక్రమాలను అడ్డుకోవడం కష్టసాధ్యమని తెలిపింది. ఇదే సమయంలో అనిర్ధిష్ట బృందాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావంటూ జబర్దస్త్ టీంపై దాఖలైన కేసును కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. 2014 జూలై 10న జబర్దస్త్ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ సదరు కార్యక్రమం న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతర కళాకారులపై న్యాయవాది వై.అరుణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నాగేంద్రబాబు తదితరులపై దాఖలు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భారత టీవీ కార్యక్రమాలపై పాక్ నిషేధం
ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత టీవీ కార్యక్రమాలను నిషేధించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం (అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలు) నుంచి భారత టీవీ చానళ్ల కార్యక్రమాలు, రేడియో ప్రసారాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు ప్రకటించింది. ఎవరైనా ప్రసారం చేసినట్లు తెలిస్తే లెసైన్సులు రద్దుచేస్తామని హెచ్చరించింది. -
శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులకు సినిమాల విందు. ప్రయాణికులు తమకు నచ్చిన సినిమాలు, టీవీ షోలు, వీడియోలను ఉచితంగా, అపరిమితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన ఫ్రాప్కార్న్తో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేతులు కలిపింది. ఫ్రాప్‌కార్న్ యాప్ ద్వారా ఒక సినిమా 3 నిముషాల లోపే డౌన్లోడ్ అయ్యేలా వేగంగా పనిచేసే వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేశారు. భారత్‌లో డిమాండ్‌పై వినోద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి విమానాశ్రయంగా జీహెచ్ఐఏఎల్ నిలిచింది. -
డబ్బు కోసమే టీవీ షోలు చేస్తా
కేవలం డబ్బు కోసమే తాను టీవీ షోలు చేస్తానని తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన తమిళ హీరో మాధవన్ చెప్పాడు. 1990లలో 'సీ హాక్స్', 'బనేగీ అప్నీ బాత్' లాంటి షోలతో మాధవన్ అందరినీ ఆకట్టుకున్నాడు. డబ్బులు బాగా వస్తాయంటేనే టీవీ షోలు చేయాలన్నది తన ఆలోచన అని.. అయితే సినిమాలు చేసేటప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచించేది లేదని చెప్పాడు. వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తామో టీవీ షోలు కూడా అలాగే చేస్తానని స్పష్టం చేశాడు. గతంలో 'తోల్ మోల్ కే బోల్' 'డీల్ యా నో డీల్' లాంటి రియాల్టీ షోలకు హోస్ట్‌గా కూడా మాధవన్ వ్యవహరించాడు. కానీ వాటన్నింటి కంటే, 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', 'తను వెడ్స్ మను', 'త్రీ ఇడియట్స్' లాంటి సినిమాలతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులందరినీ ఆకర్షించాడు. తాజాగా సాలా ఖుద్దూస్ సినిమాలో కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో మాధవన్ సరసన కొత్త నటి రితికా సింగ్ నటించింది. రాజ్‌కుమార్ హిరానీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు?
సూపర్‌మ్యాన్... ఒక తరంలో పిల్లల కళ్లు మెరిపించిన పాత్ర. స్పైడర్‌మ్యాన్, బాట్మన్ వంటి పాత్రలు రూపొందకముందు కామిక్ పాత్రల ప్రపంచంలో సూపర్‌హీరో ఈ సూపర్‌మ్యాన్. 1938వ సంవత్సరం జూన్ నెలలో పుట్టింది సూపర్‌మ్యాన్ కామిక్ పాత్ర. జెర్రీ సీగెల్ అనే రచయిత, జో షష్టర్ అనే చిత్రకారుడు కలిసి రూపొందించిన పాత్ర ఇది. ఆ తర్వాత టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాల్లో ఈ పాత్ర అలరించింది. అసాధారణమైన శక్తి, అసాధారణమైన వేగం, అసాధారణమైన వేడి, డేగ లాంటి తీక్షణమైన దృష్టి... ఇలా ప్రతిదీ సాధారణంకంటే చాలారెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ పాత్ర లక్షణాలు. నిజమే... సూపర్ క్రియేషన్. -
లక్ష్మి మంచు 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు'
చెన్నై: లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై తన ప్రత్యేకతను నిలుపుకున్న నటి, నిర్మాత లక్ష్మి మంచు మళ్లీ మరో కొత్త టీవీషోతో మెరవనున్నారు. 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' అనే కార్యక్రమంతో బుల్లితెర పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నారు. బుల్లితెరపై పునఃప్రవేశానికి తాను ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు లక్ష్మి మంచు చెప్పారు. తన మునుపటి కార్యక్రమాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. అద్భుతమైన ఈ అవకాశం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ షోకు కావలసిన సెట్ పని జరుగుతోందన్నారు. ఈ నెల 25 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్లో జూన్ 1 నుంచి ఈ షో ప్రారంభమవుతుందని లక్ష్మి మంచు చెప్పారు. -
బుల్లితెర మెరుపులు
ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కలిపి ఇన్ఫోటైన్మెంట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి టీవీ కార్యక్రమాలు. పావుగంటకో ఫైట్.. అరగంటకో పాట లేకపోయినా... మధ్య తరగతి సమస్యలను, సర్దుబాట్లను కళ్లకు కడుతూ అతివలను బుల్లితెరకు కట్టిపడేస్తున్నాయి సీరియల్స్. ప్రేక్షకులను టీవీ ముందు నుంచి కదలకుండా చేస్తున్న సీరియల్స్, కార్యక్రమాలను ఎంపిక చేసి ‘2014 టీవీ అవార్డు’లను అందించింది ‘శివాని ఆర్ట్స్ అసోసియేషన్’. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న, అవార్డులు అందుకున్న నటీనటులు సిటీప్లస్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ..:: శిరీష చల్లపల్లి ప్రేక్షకాదరణే ముఖ్యం... చంటిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నన్ను సీరియల్స్‌లోనూ ఆదరించారు ప్రేక్షకులు. ఈ అవార్డుకు కారణం కూడా వారే. సినిమాలు, సీరియల్స్ అన్న తేడా ఏం లేదు. ఎక్కడైనా సుహాసిని మంచి నటి, మంచి అమ్మాయి అనిపించుకోవడమే నా లక్ష్యం. అంతకు మించిన ఆస్కార్లు, నందులు ఏమీ ఉండవనుకుంటా! - సుహాసిని, బెస్ట్ హీరోయిన్, అష్టాచెమ్మా సీరియల్ మాటకారిని చేశారు... చదివింది ఇంటర్ అయినా సంగీతంపై ఆసక్తితో కర్ణాటక మ్యూజిక్‌లో డిప్లమో చేశాను. తీన్మార్ ధూమ్‌ధామ్ ప్రోగ్రాంలో పాటపాడటానికి వచ్చిన నన్ను మా సీఈఓ సర్ గుర్తించి, పాటలు పాడే నాకు మాటలు నేర్పి మాటకారి అమ్మాయిని చేశారు. లంబాడా అమ్మాయిని కాబట్టి ఆ శ్లాంగ్‌లో కొద్ది మార్పు చేర్పులతో ప్రోగ్రాం చేయడం చాలా ఈజీ అయ్యింది. మా కార్యక్రమానికి ‘బెస్ట్ ప్రోగ్రామ్’ అవార్డు రావడంతో నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు. - సత్యవతి (మాటకారి మంగ్లీ), బెస్ట్ ప్రోగ్రామ్ కోవై సరళ స్ఫూర్తితో... బీటెక్ చదివిన నాకు చిన్నప్పటినుంచి మిమిక్రీ, అనుకరణ చాలా ఇష్టం. దాంతో ఫ్రెండ్స్ అందరినీ నవ్విస్తుండేదాన్ని. దూరదర్శన్‌లో ఓ గేమ్‌షోలో పాల్గొన్న నా యాక్టివ్నెస్ చూసి యాంకరింగ్ అవకాశం ఇచ్చారు. అలా సీరియల్స్ వైపు వచ్చాను. నాకు కోవైసరళ అంటే ఇష్టం. తనే నాకు స్ఫూర్తి. - రోహిణి రెడ్డి, బెస్ట్ కామెడీ హీరోయిన్, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ నా అదృష్టం.. పుట్టింది ఆంధ్ర, పెరిగింది చెన్నైలో అయినా నాకు జీవితాన్నిచ్చింది హైదరాబాద్. టీవీ ఇండస్ట్రీ నా సెకండ్ హోం. ప్రజల ఆదరాభిమానాలు పొందడం నా అదృష్టం. ఫ్యామిలీ సపోర్ట్, తోటి యాక్టర్స్ ఎంకరేజ్మెంట్ నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. - హరిత, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కలవారి కోడలు సీరియల్ డాక్టర్ కావాలి... మూడేళ్ల వయసునుంచే సీరియల్స్, మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాను. రగడ, కరెంటు తీగ సినిమాల్లో బాలనటిగా చేశాను. దేవత, శ్రావణి సుబ్రహ్మణ్యం, లేత మనసులు, ఇప్పుడు రాములమ్మ చేస్తున్నా. పెద్దయ్యాక మంచి యాక్టరే కాదు డాక్టర్ కావాలన్నది నా కల. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నందుకు మా డాడీ ఎంతో సంతోషిస్తారు. - సాయిప్రియ, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, రాములమ్మ సీరియల్ థ్రిల్లింగ్‌గా ఉంది.. యాంకరింగ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైనా.. ఇప్పుడు సీరియల్స్‌లో సాఫ్ట్ అండ్ కూల్ రోల్స్ చేస్తున్నాను. నిజానికి చాలా అల్లరి పిల్లని. స్క్రీన్‌మీద కామ్‌గోయింగ్ గాళ్‌గా కనిపించడం మొదట్లో కాస్త కష్టమనిపించినా, ఇప్పుడు సరదాగా సాగిపోతోంది. ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రస్తుతం ‘వేట కొడవళ్లు’ సినిమాలో కనిపించబోతున్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని భావిస్తున్నా. - హిమజ, బెస్ట్ హీరోయిన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ హ్యాపీగా ఉంది... అమ్మ, నాన్న క్లాసికల్ డ్యాన్సర్స్ కావడంతో చిన్నతనం నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ‘మేఘమాల’ సీరియల్‌కి క్లాసికల్ డ్యాన్సర్ రోల్ ఉండటంతో మా పేరెంట్స్‌ని అప్రోచ్ అయ్యారు. అలా నేను బుల్లితెరకు వచ్చాను. అమ్మ నాతోపాటే ఉండి నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు థర్డ క్లాస్ చదువుతున్నాను. స్కూల్ నుంచి సపోర్టే కాదు.. ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. బెస్ట్ డ్యాన్సర్ అవార్డు తీసుకోవడం హ్యాపీగా అనిపిస్తోంది. - శ్రీనర్తన, బెస్ట్ డ్యాన్సర్, మేఘమాల సీరియల్ -
అదో గొప్ప అనుభూతి
బుల్లితెరపై నటించడం గొప్ప అనుభూతి అని వర్ధమాన నటుడు రోహిత్‌రాయ్ పేర్కొన్నాడు. అవి తనకు కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయన్నాడు. ఈ మాధ్యమం వల్ల మంచి ఆదాయం కూడా వస్తుందని టీవీతోపాటు కొన్ని సినిమాల్లో నటించిన రోహిత్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘స్వాభిమాన్’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమంద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్... ‘ఝలక్ దిఖ్ లాజా’ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి నిర్వాహకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం ‘ఎన్కౌంటర్’ అనే క్రైమ్ సీరియల్లో ఇన్‌స్పెక ్టర్ మిలింద్ మాండ్లిక్ పాత్రను పోషిస్తున్నాడు. 2000వ సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమానికి అమితాబ్ నిర్వాహకుడిగా వ్యవహరించిన అనంతరం అనేకమంది సెలబ్రిటీలు ఆయన బాటపట్టారు. ఇటువంటి వారిలో షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్, శిల్పాశెట్టి, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, అక్షయ్కుమార్లతోపాటు అనిల్కపూర్కూడా ఉన్నారు. బాలీవుడ్లో స్టార్డం సాధించిన తర్వాత కూడా వీరంతా బుల్లితెరపైనా తమదైన శైలిలో రాణించారు. ఈ విషయమై రోహిత్ మాట్లాడుతూ ‘టీవీ షోలు నటులకు గొప్ప అనుభూతినిస్తాయి. పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. టీవీ షోల వల్ల రాబడికూడా భారీగానే వస్తుంది. కేబీసీ గత పది సంవత ్సరాలుగా నడుస్తూనే ఉంది. ఈ షోని ప్రజలు మెచ్చుకున్నారు. దీంతోపాటు బిగ్ బాస్, సరిగమపా, ఇండియన్ ఐడాల్ తదితర షోలు కూడా హిట్ అయ్యాయి. టీవీకి అపారమైన శక్తి కలిగిన మాధ్యమం’ అని అన్నాడు. -
గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం...
మొన్నటిదాకా సినిమా పాటలతో ఊపిరిసలపకుండా ఉన్నారు... స్టేజ్, టీవీ షోలలో వ్యాఖ్యాతగా రాణించారు...ఘంటసాల గానానికి చిరునామా అయ్యారు... గాయకుడిగా తన గానానికి శాశ్వతత్వాన్ని చేకూర్చే బృహత్ యజ్ఞం ప్రారంభించారు. తెలుగు గాయకుడు ఘంటసాల ప్రారంభించిన యజ్ఞాన్ని తిరిగి తెలుగు గాయకుడే పూర్తిచేశారనిపించుకున్నారు. ఆ మహత్కార్యమే సంపూర్ణ భగవద్గీతా గానం. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో, తాత్పర్యసహితంగా సంపూర్ణంగా గానం చేసి అత్యాధునిక సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. గీతాసారాన్ని లక్షలాదిమంది ప్రజలలోకి తీసుకువెళ్లాలనే ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎల్వీ గంగాధరశాస్త్రితో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ... గంగాధర శాస్త్రి పరిచయం విద్య: బి.ఎ, కర్ణాటక శాస్త్రీయ సంగీతం తల్లిదండ్రులు: శ్రీలక్ష్మి, కాశీ విశ్వనాథశర్మ భార్య: అర్చన పిల్లలు: విశ్వతేజ, కీర్తిప్రియ వృత్తి: 12 ఏళ్లు సినిమా జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి సినిమా పాట: ‘నాన్నగారు’ సినిమాలో ‘చుక్కా...చుక్కా ఒకటై’ స్వస్థలం: కృష్ణా జిల్లా, అవనిగడ్డ కృష్ణుడు... బాల్యమంతా అల్లరి పనులు చేసి చిలిపి కృష్ణుడయ్యాడు. యవ్వనంలో గోపికలను అలరిం చాడు, యుద్ధసమయంలో పాండవులు గెలవడానికి సమన్యాయం పాటించలేదా అనిపించేలా చేశాడు. పలు సందర్భాల్లో సాధారణ మానవుడిగా అనిపించిన కృష్ణుడిని దేవుడిగా కొలవడాన్ని కొందరు సంశయిస్తారు. దీన్నెలా తీసుకోవాలి? అసలు కృష్ణతత్వం ఏమిటి? పసివానిగా ఉన్నప్పటి నుంచే అందరూ కృష్ణుడిని దేవుడిగా కొలిచారు. మన్నుతిన్నాడని నోరుతెరవమంటే నోటిలో 14 భువనభాండాలను చూపించాడు. తల్లి మొదలు అందరూ ఆయనలో పరమాత్ముణ్ణే చూశారు... ఒక్క కౌరవులు తప్ప! ధర్మచింతన చేసిన వారందరూ తమ జ్ఞానదృష్టితో చూడగలిగితే మానవుడిలో మాధవుడు కనిపిస్తాడు. లేదంటే కౌరవులకు కనిపించినట్టు మానవుడే కనిపిస్తాడు. మనకి ఆ జ్ఞానదృష్టి కావాలంటే భగవద్గీతను చదవాలి... అప్పుడే ఆయన పరమాత్ముడిగా కనిపిస్తాడు... అనిపిస్తాడు. భగవద్గీత పరిచయభాగ్యం మొదట మీకెలా కలిగింది? ‘సంస్కృతం నేర్చుకుంటే నాలిక తిరుగుతుంది. ఆ తర్వాత బతుకు తిరుగుతుంది’ అంటూ చిన్నతనంలో శ్లోకాలు, స్తోత్రాలు నేర్పించింది మా అమ్మ. బతుకు తిరగడమంటే అప్పట్లో నాకర్థం కాలేదు. కానీ భగవద్గీత రికార్డింగ్‌లో శ్లోకాలు తేలిగ్గా ఉచ్చరించగలుగుతున్నప్పుడు మా అమ్మ వేసిన పునాది విలువ ఏమిటో అర్థమయ్యింది. స్కూలు రోజుల్లో కాస్త ఖాళీ దొరికితే ఆకుల వేంకటరత్నారావు మాస్టారు భగవద్గీత శ్లోకాలూ, పాలపర్తి సుబ్బారావు మాస్టారు సంస్కృతమూ నేర్పించేవారు. హైదరాబాద్ వచ్చాక సినిమా జర్నలిస్ట్‌గా పనిచేశాను. అడపాదడపా సినిమా పాటలు పాడుతూ దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూ చాలా బిజీగా ఉన్న సమయంలో ఒకసారి భారవిగారు సంపూర్ణ భగవద్గీత చేయమని సూచించారు. ‘భగవద్గీత’ సాగరంలోకి దూకాలనే నిర్ణయం తీసుకోడానికి సంవత్సరకాలం ఆలోచించాను. ఆ నిర్ణయం తీసుకున్నాక మిగతావన్నీ వదిలేసి ఆరేళ్లపాటు గీతాగాన తపస్సులో ఉండిపోయాను. ఘంటసాలగారు పాడిన ‘భగవద్గీత’ ఉండగా మళ్ళీ మీరెందుకు సాహసించారు? సంపూర్ణ భగవద్గీత చేయడమంటే వ్యయప్రయాసలతో కూడిన సాహసం. అదీగాక ఎదురుగా ఘంటసాల భగవద్గీత హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ‘భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాలగారు 108 శ్లోకాలే పాడారు. మొత్తం 700 శ్లోకాలూ పాడి ఘంటసాలగారికీ, ఈ దేశానికీ, తెలుగుజాతికీ అంకితం చేయడంకంటే గాయకుడిగా మీ జన్మకి సార్థకత ఇంకేముంటుంది...ఆలోచించండి’ అని భారవిగారు అన్నప్పుడు పొంగిపోయి ‘నేను కరెక్టు’ అని అనుకోలేదు. శ్లోకాలు రికార్డు చేశాక అభిప్రాయం కోసం ఘంటసాలగారి సతీమణి సావిత్రిగారికి, అక్కినేని నాగేశ్వరరావుగారికి వినిపించాను. ఇద్దరూ ఒకటే మాటన్నారు... ‘ఘంటసాలగారి వయస్సు ఓ పదేళ్లు తగ్గించుకుని పాడినట్టుందని..’. ‘హమ్మయ్య పాసయ్యాను’ అనుకున్నాను. ఘంటసాలగారితో హెచ్‌ఎమ్‌వి సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు చేసి 1974లో విడుదల చేసింది. ఆ స్ఫూర్తితో మొత్తం 700 శ్లోకాలను, తాత్పర్యసహితంగా, పూర్తి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, వింటున్నప్పుడు కళ్లకు దృశ్యం కనిపించేలా...అవసరమైన సౌండ్ ఎఫెక్ట్స్‌ని మేళవిస్తూ, ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా డిజిటల్ ఫార్మాట్లో రికార్డు చేశాం మీరు ఉద్యోగం చేస్తున్పప్పటి రోజులకీ, గీతా ప్రయాణంలో ఉన్న రోజులకీ వ్యత్యాసం కనిపిస్తుంటుందా? అది వ్యక్తుల కొలువులో ఉద్యోగం... ఇది పరమాత్ముని కొలువులో సద్యోగం! అది భుక్తి కోసం... ఇది ముక్తి కోసం. ‘మహత్కార్యాలు తృటిలో నెరవేరవు’ అన్నది సామెత. ‘ఇంకెంతకాలం చేస్తావు నాయనా’ అని వ్యంగ్యంగా అడిగిన వాళ్ళే థియేటర్‌కి వచ్చి విన్నాక ‘ఇంత బాగా చేయాలంటే అంత సమయం పడుతుంది మరి’ అనుకుంటూ వెళ్ళారు. దాదాపు 100 మంది పండితులు, వాద్యకళాకారులు, సాంకేతిక నిపుణులు, దాతలు... ఎందరో ఈ ప్రాజెక్టుకు సహకారం అందించారు. ఈ స్పీడు తరానికి ‘భగవద్గీత’ వినే టైమూ, ఆసక్తీ ఉందంటారా? జీవితం అంటే - పగలూ రాత్రీ తేడా లేకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం అనుకునే నేటి యువతరానికి సరైన మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత. వయసుతోపాటు వచ్చే గౌరవం కంటే జ్ఞానంతో పాటు వచ్చే గౌరవం శాశ్వతమైనది. ఆ గౌరవం మనం చేసే పనుల ద్వారా ఎలా సంపాదించుకోవాలో భగవద్గీత చెబుతుంది. మనలో దాగిన ఆత్మశక్తిని మనకి చూపించి, మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తినిస్తుంది గీత. బ్యాడ్‌లక్! ఇవ్వాళ ఒక సినిమా డివిడి 150 రూపాయలు పెట్టి కొంటున్నాం. అదే భగవద్గీత పుస్తకం మార్కెట్లో పది రూపాయలకు దొరుకుతుంది. అంటే తాత్కాలిక ఆనందం ఖరీదు.. శాశ్వతమైన జ్ఞానం చవకగా దొరుకుతోందన్నమాట. నిజమే మరి... జ్ఞానం చవగ్గా దొరక్కపోతే అందరికీ చేరదుకదా! జీవితం అంటే ఏమిటో, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పే ‘భగవద్గీత’ లాంటి మేనేజ్మెంట్ గ్రంథం యువతరానికి అవసరం లేదంటారా! ‘భగవద్గీత’ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, మీరు ఆశిస్తున్న ప్రయోజనం? 700 శ్లోకాల గీతాగానం ప్రాజెక్టు పూర్తయ్యింది. మొత్తం గీతాగానం వ్యవధి 12 గంటలు. 18 అధ్యాయాలని, 18 సీడీలుగా రూపొందించాం. ‘గీతాపారాయణం’ కూడా దీనికి అనుబంధంగా ఇటీవలే రికార్డు చేశాం. ఇక ప్రయోజనం అంటారా... ఫలితాన్ని ఆశించానంటే ‘గీత’ నాకు అర్థంకానట్టే. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతని బట్టి ఇస్తాడు. ఈ సంకల్పబలంతోనే అన్నీ వదిలేసి సంపూర్ణ గీతాగానమే ధ్యేయంగా ఆరుసంవత్సరాలపాటు, పట్టుదలతో ‘గీత’ను పూర్తిచేయగలిగాను. జీవితమంటే లక్ష్యాన్ని చేరుకోవడం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా. పరమాత్ముడు నాతో చేయించిన ‘గీతాపారాయణం’ అద్భుతమైన అనుభూతుల సమ్మిశ్రమం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించాలి... అప్పుడే భారతదేశం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ఇదే నేనాశిస్తున్న ప్రయోజనం. ఒక గాయకుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని తలపెట్టి పూర్తి చేయడం ఒక రికార్డేమో కదా! మీరంటున్నది ‘గిన్నిస్’ గురించేగా! మనం చేస్తున్నపని, చేరాలనుకుంటున్న రికార్డుకంటే చిన్నదైతే అప్పుడు రికార్డులు గొప్పవవుతాయి. నా దృష్టిలో భగవద్గీత విశిష్ట గ్రంథం - గిన్నిస్‌బుక్ విచిత్ర పుస్తకం. గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా పుస్తకంలోకి ఎక్కిస్తారా! నా జీవితంలో భగవద్గీత ఒక ప్రాజెక్టు అనుకున్నాను. ఇది పూర్తయ్యే సమయానికి నాకు తెలీకుండా భగవద్గీతే జీవితమైపోయింది. వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించి విడుదల చెయ్యడం నా తదుపరి కర్తవ్యం. వీలైనంత ప్రచారం కూడా అవసరం. ‘భగవద్గీత’ ద్వారా వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెబుతూ ఇప్పటికే ఆంధ్రరాష్ర్టంలోని చాలా కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు మోటివేషన్ లెక్చర్స్ ఇస్తున్నాను. - డా.పురాణపండ వైజయంతి ‘‘ఐదువేల సంవత్సరాల క్రితం మతాలే ఆవిర్భవించని కాలంలో, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలోని మానవులందరికీ పంచిపెట్టిన జ్ఞాన భాండాగారమే గీత’’ ‘‘కస్తూరి మృగం తన నుంచే పరిమళం వస్తోందన్న విషయం తెలీక ముక్కుపుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుందట! మనమూ అంతే. పక్కనే భగవద్గీతని వదిలేసి పొరుగు దేశాలనుంచి వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదువుతుంటాం’’ ‘‘భగవద్గీత అంటే కర్తవ్యబోధ. దాన్ని చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టి వినిపిస్తే ఉపయోగమేమిటో అర్థం కాదు. ఇది ఉత్తమ జీవన విధానమార్గాన్ని వివరించే పాఠం. వ్యక్తిత్వ వికాస గ్రంథం. అంతేగానీ మరణానికి సంకేతం కాదు’’ ‘‘భగవద్గీత లెక్కల సబ్జెక్టులాంటిది. అర్థమైతే ఈజీయే’’ శ్రీకృష్ణుడి విశ్వరూపం చూస్తూ అర్జునుడు చెప్పిన శ్లోకాలలోని భావోద్వేగం గంగాధరశాస్త్రి గాత్రంలో అద్భుతంగా పలికింది. ఆ రాగ మాధుర్యం నన్ను తన్మయుణ్ణిచేసింది. -ఎ.పి.జె అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ర్టపతి గంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంటారు. ఇప్పుడు ఆ గంగాధరుడే సంపూర్ణ గీతాగాన గంగలో మనల్ని స్నానం చేయించి ఎంతో పుణ్యాన్నిచ్చారు. ఆయన పాడిన విశ్వరూపం వింటే భగవానుడి విశ్వరూపం కళ్ళముందు సాక్షాత్కరించినట్టనిపించింది. ఇంతగొప్ప అనుభూతినిచ్చిన గానాన్ని నేనింతవరకూ వినలేదు. - ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ -
క్రేజీయింగ్... డీజేయింగ్
ఎంతో పెద్దపార్టీ. పిల్లవాళ్లు, కుర్రవాళ్ళు, ముసలివాళ్ళు... ఇలా అన్ని తరాలవాళ్ళు ఉన్న పార్టీ అది. అయినా ఉసూరుమన్నట్టు అందరూ ఏదో ‘ఉన్నాం అంటే ఉన్నాం’ అన్నట్టు కదులుతున్నారు. అప్పుడొస్తాడతను... జారిపోయేలా ఉండే లోవెయిస్ట్ జీన్స్, మోకాళ్ల వరకు ఉన్న హిప్ హాప్ టీషర్ట్ వేసుకుని, తలమీద హిప్హాట్ క్యాప్‌తో! తన టర్నబుల్ మీద చేయి పెట్టి, ఏదో యుద్ధం ముందు శంఖారావంలా అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. అంతే, వయసుతో సంబంధం లేకుండా వెన్నులో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఒంటినిండా సంగీత వైరస్ ప్రవేశిస్తుంది. ఎంతటివారికైనా మనసు నిలవనీయదు. కాలు కదలకుండా ఉండలేదు. వెంటనే వచ్చేస్తారంతా, పూనకం వచ్చినట్టు నర్తించడానికి! ఇలా మూస మనుషుల మధ్య సంగీత ప్రకంపనలు సృష్టించేవాడే ‘డిస్కో జాకీ’... షార్ట్‌గా డీజె. వచ్చినతను ఊరికే ఉండడు. అతని కనుచూపుమేరలో ఉండేవాళ్ళంతా కదులుతూనే ఉండాలి. కుదురుగా ఉంటే నచ్చదు. చీకటిగా ఉండే పబ్ అయినా, చిర్రుమని ఎండలోని గణేష్ నిమజ్జనం అయినా, వర్షాకాలపు ఒక సాయంత్రం అయినా, శ్రావణమాసపు సంగీతం అయినా ఇతను రావలసిందే. అందరూ ఓ మాదిరి మైఖేల్ జాక్సన్లుగా మారాల్సిందే. అందరూ ఇతని మిక్సర్ మధువులో మునగాల్సిందే... అలసిపోయాక కొత్త శక్తిని నింపుకోవాల్సిందే. డీజేయింగ్ అంటే... ఒక కల: చెవిలో హెడ్సెట్, చేతిలో టర్నబుల్స్ ఉంటే సరిపోదు. బుర్రలో తను ఏం ప్లే చేయబోతున్నాడో ముందే ఫాస్ట్ఫార్వర్డ్లో వేసేయాలి. అక్కడికి వచ్చిన క్రౌడ్ అభిరుచిని అర్థం చేసుకోవాలి. దాన్నిబట్టి తన మస్తిష్కంలో చిక్కుకున్న మ్యూజిక్ మ్యాచ్‌కి విముక్తి కల్పించాలి. ఏ పాట ప్లే చేయాలి? ఎలా ప్లే చేయాలి? ఎంతసేపు ప్లే చేయాలి? అన్నది ముందే కల కనేయాలి... ఆ టాలెంట్ ఉంటే చాలు... క్లబ్నైట్స్, పార్టీస్, ఫ్యాషన్ ఈవెంట్స్, టీవీ షోస్, ప్రతిచోటా మీ పాటే మోగుతుంది. డిమాండ్‌కి డిమాండ్, డబ్బుకి డబ్బు, పేరుకి పేరు... ఒక మంచి ఈవెంట్లో లోకల్ సెలబ్రిటీగా మారిపోవచ్చు. ఓ కళ:‘ఎక్కువమందికి తెలియనిది ఏమిటంటే... డీజేయింగ్ అనేది కూడా ఒక కళే’ అంటారు ప్రముఖ డీజే మైఖేల్ చిన్నప్ప. ఫోటోగ్రఫీలానే డీజేయింగ్ కూడా అందాలను క్యాప్చర్ చేసే కళ... మనం చూసే కళ్ళకి నచ్చినట్టే మన చెవులకి వినసొంపుగా ఉండే పాటలోని అందాన్ని పట్టి, ఇలా రెండు మూడు ‘అందాలని’ ఒక దాని తర్వాత ఒకదానిని నేర్పుగా ప్లే చేయడమే డీజేయింగ్. ప్లే చెయ్యాల్సిన డ్యూరేషన్ ఎంత ముఖ్యమో, పాట నుండి పాటకి ట్రాన్స్ఫార్మేషన్ కూడా అంతే ముఖ్యం... డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ మూడ్, ఎనర్జీ ఏమాత్రం చెడకుండా మిక్సింగ్ అనేది ఉండాలి. ఈవెంట్స్, పార్టీసే కాక ఈ మధ్య ఝ్చటజిఠఞ అని కొత్తగా వస్తున్నాయి. ఒక సినిమాలో పాటలన్నీ, లేకపోతే ఆ సంవత్సరానికి వచ్చిన టాప్ సాంగ్స్ అన్నీ కలిపి ఒక కొత్త ఆడియోలా చేస్తారు. జీరో అవర్ మ్యాషప్, ఆషిగీ-2 మ్యాషప్, వాలెంటైన్ మ్యాషప్... ఇలా ఎన్నోరకాల మ్యాషప్లు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ, డీజేలకి క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి. ఒక కల్ల: చిమ్మ చీకటిలో మిలమిల మెరిసే వెలుగుల జీవితం డీజేయింగ్ అంటే! పనికి టైమింగ్ అంటూ ఉండదు. అర్ధరాత్రులు కూడా పని చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు దీంతో రెస్ట్లెస్నెస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాక ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతి పైత్యం పెరగడంతో చాలావరకు క్లబ్‌లు, పబ్‌లలో మాదకద్రవ్యాల వాడకం విస్తృతంగా ఉంది. ఈ ఉచ్చు పడే అవకాశం ఎక్కువ. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా, సమస్యలకు జడవకుండా ఉంటే వృత్తిపరంగా, ఆర్థికంగా, పాషన్పరంగా ఎంతో మెరుగయినది ‘డిస్కో జాకీయింగ్!’ - జాయ్