లక్ష్మి మంచు 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' | Lakshmi Manchu excited about television comeback | Sakshi
Sakshi News home page

లక్ష్మి మంచు 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు'

Published Sat, May 16 2015 7:29 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

లక్ష్మి మంచు

లక్ష్మి మంచు

చెన్నై: లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై తన ప్రత్యేకతను నిలుపుకున్న నటి, నిర్మాత  లక్ష్మి మంచు మళ్లీ మరో కొత్త టీవీషోతో మెరవనున్నారు. 'మళ్లీమళ్లీ ఇది రానిరోజు' అనే కార్యక్రమంతో బుల్లితెర పునఃప్రవేశానికి సిద్ధమవుతున్నారు.

బుల్లితెరపై పునఃప్రవేశానికి తాను ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు లక్ష్మి మంచు చెప్పారు. తన మునుపటి కార్యక్రమాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. అద్భుతమైన ఈ అవకాశం పట్ల తాను  చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.  

ఈ షోకు కావలసిన సెట్ పని జరుగుతోందన్నారు. ఈ నెల 25 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్లో జూన్ 1 నుంచి ఈ షో ప్రారంభమవుతుందని  లక్ష్మి మంచు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement