Bigg Boss Telugu 7: AP High Court Issues Notice To Nagarjuna - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: మళ్లీ ఆ వివాదం.. నాగార్జునకు నోటీసులు!

Jul 27 2023 8:28 AM | Updated on Sep 2 2023 2:34 PM

Bigg Boss 7 Telugu High Court Notice Nagarjuna - Sakshi

తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే చాలామంది 'బిగ్ బాస్' గుర్తొస్తుంది. ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ ప్రారంభం కాబోతుంది. దాదాపు నాలుగు సీజన్ల నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున.. మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ మధ్య టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు షో మొదలవడానికి ముందే ఆయనకు కోర్టు నోటీసులు పంపించింది.

(ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?)

ఏం జరిగింది?
బిగ్ బాస్ షో ప్రారంభ సీజన్లు సక్సెస్ అయ్యాయి గానీ తర్వాత తర్వాత మాత్రం షోలో కంటెంట్ తక్కువై, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే సీపీఐ నాయకుడు నారాయణ చాలాసార్లు కౌంటర్స్ వేశారు. ఈ షో చూడటం వల్ల పిల్లలు, యువత చెడిపోతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్స్ మధ్య అశ్లీలత, అసభ్యత సీన్స్ ఎక్కువయ్యాయని పిటీషన్ కూడా వేశారు. ఈ క్రమంలోనే షోని నిలిపేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

నాగ్‌కు నోటీసులు
గతంలో దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఏపీ హైకోర్ట్.. నాగార్జునతోపాటు సదరు ఛానెల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. అలానే ఈ కేసు తదుపతి విచారణని 4 వారాలకు వాయిదా వేసింది. గతంలోనూ షోపై విమర్శలు రావడంతో ఇలాంటి పిటిషన్స్ దాఖలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా షో నడిచింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement