Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే? | Bigg Boss 7 Telugu Host Nagarjuna Yellow Sweat T-Shirt Cost Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: నాగార్జున ఎల్లో స్వెట్ టీ-షర్ట్.. అంత కాస్ట్‌లీనా?

Published Mon, Dec 11 2023 6:42 PM | Last Updated on Mon, Dec 11 2023 7:06 PM

Bigg Boss 7 Telugu Host Nagarjuna Sweat T-Shirt Cost Details - Sakshi

బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున డౌన్ అయిపోతున్నాడు. గత కొన్ని సీజన్లలో పర్వాలేదనిపించినప్పటికీ.. ఈ సారి మాత్రం తేలిపోయాడు. ప్రతి వీకెండ్ అంటే ఒకప్పుడ నాగ్ హోస్టింగ్ కోసం షో చూసేవారు. ఇప్పుడు దీనికోసం కాకుండా.. నాగ్ వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా ఆదివారం అలాంటి ఓ స్వెట్ టీ-షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)

ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా పసుపు రంగు చలికోటు లాంటిది వేసుకుని వచ్చాడు. చాలా వదులుగా ఉన్న ఈ టీ-షర్ట్ చూడటానికి డిఫరెంట్‌గా అనిపించింది. అమర్‌దీప్ కూడా.. ;మీ స్వెట్ టీ-షర్ట్ బాగుంది, నాకు ఇస్తారా సర్?' అని నాగార్జునని అడిగాడు. దీంతో ఇస్తానులే అని మాటిచ్చాడు.

మహా అయితే ఈ టీ-షర్ట్ ఎంత ఖరీదు ఉంటుందిలే అని మీరనుకోవచ్చు. కానీ దీని ధర అక్షరాలు రూ.2,11,190 అని తెలుస్తోంది. buyma.us అనే వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇకపోతే తాజా వీకెండ్‌లో శోభాని ఎలిమినేట్ చేసి పంపేశారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో టాప్-6 మాత్రమే ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది ఈ ఆదివారం అంటే డిసెంబరు 17న తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement