Jabardasth Rohini Anchoring TV Show On Wheel Chair - Sakshi
Sakshi News home page

Jabardasth Rohini: ఆరోగ‍్యం సెట్ కాలేదు.. అయినా సరే!

Aug 9 2023 12:15 PM | Updated on Aug 9 2023 12:29 PM

Jabardasth Rohini Tv Show Anchoring Wheel Chair - Sakshi

కామెడీ చూడటానికి హాయిగా ఉంటుంది. కానీ చేసేవాళ్లని అడిగితే అదెంత కష్టమో చెబుతారు. ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ ఉన్నంతమంది లేడీస్ లేరు. టీవీ షోల వల్ల ఇప్పుడిప్పుడే పలువురు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమ్ తెచ్చుకుంది రోహిణి. ఉత్తరాంధ్రకు చెందిన ఈమె... తొలుత సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసింది. 'జబర్దస్త్'లో చేసి ఓ రేంజు క్రేజ్ సంపాదించింది.

(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?

షోలు, సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రోహిణి.. సరిగ్గొ కొన్నాళ్ల ముందు ఆస్పత్రిలో చేరింది. కాలికి పెద్దకట్టుతో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. 2016లో విజయవాడ నుంచి కారులో వస్తుండగా రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమె కాలిలో రాడ్ పెట్టారు. ఇప్పుడు అది తీయించుకుందామని వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంది. షోలు చేయడం మొదలుపెట్టేసింది.

రోహిణి కాలి నుంచి రాడ్ నుంచి కొన్ని నెలలు అయినా కాలేదు. అప్పుడే తెలుగులోని ఓ ఛానెల్‌లో ప్రసారమైన షోలో కనించింది. వీల్ ఛైర్‌లోనే స్టేజీపైకి వచ్చి రవితో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. తాజాగా ఆదివారం ఈ షో టెలికాస్ట్ అయింది. అయితే ఈ షోని చాలా నెలల క్రితమే ఒప్పుకొందని, వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆరోగ్యం కుదటపడనప్పటికీ షో చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement