
తెలుగులో పలు సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. అలానే బిగ్ బాస్ తొలి సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. చాన్నాళ్లు తెరపై కనిపించిన ఇతడు.. తాజాగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని చెబుతూ తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు)
ఆదర్శ్ పోస్ట్ చేసిన వీడియో బట్టి చూస్తే.. మోకాలి మజ్జ దగ్గర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. తర్వాత ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ లాంటివి కూడా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి, త్వరలో కమ్ బ్యాక్ ఇస్తానని రాసుకొచ్చాడు.
2005 నుంచి ఆదర్శ్.. ఇండస్ట్రీలో ఉన్నాడు. హ్యాపీడేస్, గోవిందుడు అందరివాడేలే, సరైనోడు, గరుడ వేగ, కలర్ ఫోటో, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటించాడు. మరి ఈ మధ్య ఏమైందో ఏమో తెలీదు గానీ కాలికి సర్జరీ చేయించుకున్నాడు.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)