aadarsh
-
నిజ జీవిత సంఘటన ఆధారం ‘గీతా సాక్షిగా’.. ఆసక్తి పెంచుతున్న టీజర్
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. ఈ టీజర్లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి హీరోను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో ఆదర్శ్ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యున్ని కాదని, వాడి బాబు అర్జునున్ని రా అంటూ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్రలతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
కరోనా వచ్చిందని సినిమాలో నుంచి తీసేశారు
కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్న ఎంతోమంది ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. కరోనా వైపరీత్యం వల్ల పలువురు నటీనటులు సినిమా అవకాశాలను కోల్పోతున్నారు. తాజాగా బిగ్‌బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ కూడా అదే కోవలోకి చేరాడు. కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి కుటుంబం మొత్తం కూడా కోవిడ్ బారిన పడింది. దీంతో పేరెంట్స్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనను ఓ సినిమాలో నుంచి తీసివేశారని బాధపడ్డాడు. తనతోపాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం సినిమా టీమ్‌కు చెప్పాడట ఈ నటుడు. అయితే వాళ్లు అండగా నిలబడాల్సింది పోయి తన స్థానంలో ఇంకో నటుడిని తీసుకున్నారట. కనీసం ఒక మాటైనా చెప్పకుండా ఇలా అర్ధాంతరంగా తనను సినిమా నుంచి తొలగించారని అభిమానులతో వాపోయాడు ఆదర్శ్. ఆదర్శ్‌కు జరిగిన అన్యాయానికి అభిమానులు చింతిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇది కాకపోతే ఇంకొకటి.. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాయి' అని ఆదర్శ్‌కు ధైర్యం చెప్తున్నారు. చదవండి: ‘బిగ్‌బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్ ఆ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్ -
బిగ్‌బాస్: శివబాలాజీ దూషణ.. ఆదర్శ్ కన్నీళ్లు
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 23 ఎపిసోడ్లను పూర్తి చేసి 24వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే హౌస్‌లో ఓ ఛాలెంజ్ టాస్క్ ‘ముళ్ల కుర్చీ’ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోతారని, నిర్దేశించిన కుర్చీలో ఒక గ్రూపు సభ్యులు కూర్చొని ఉండాలని మిగతా వాళ్లు కుర్చీల్లో కూర్చున్నవారిని లేపటానికి ప్రయత్నిస్తారని బెల్ మోగిన తర్వాత రెండో గ్రూపు కుర్చీల్లో కూర్చుంటారని ఈ టాస్క్ మొత్తం మహేష్ కత్తి ఆధ్వర్యంలో జరుగుతుందని బిగ్ బాస్ గేమ్స్ రూల్స్ తెలియజేశారు. ఈ టాస్క్ చివర్లో బెస్ట్ అండ్ వరస్ట్ ఫెర్ఫామెన్స్‌ని ప్రకటిస్తామని అందుకు లగ్జరీ బడ్జెట్‌తో పాటు శిక్షలు కూడా ఉంటాయని బిగ్ బాస్ ‘ముళ్ల కుర్చీ ’ టాస్క్ ఇచ్చారు. ఇక టాస్క్‌లో భాగంగా హరితేజ, అర్చన, కల్పన, ప్రిన్స్, శివబాలాజీలు ఒక గ్రూపుగా ఉండగా.. దీక్ష, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధన్‌రాజ్ మరో గ్రూపుగా ఉన్నారు. ఈ టాస్క్‌లో మొదటిగా శివ బాలాజీ గ్రూప్ కుర్చీల్లో కూర్చొని టాస్క్‌లో పాల్గొనగా.. ఆదర్శ్ గ్రూప్ వాళ్లను కుర్చీనుండి లేపడానికి ప్రయత్నించారు. ఇక కత్తి కార్తీక చపాతి పిండితో చేసిన బల్లిని చూసి అర్చన భయంతో వణికిపోగా కుర్చీ దిగకుండా గేమ్ కంటిన్యూ చేసింది. ఇప్పటివరకూ బిగ్ బాస్‌లో పెద్ద వివాదాలు లేకపోయినా ఈ రోజు ఎపిసోడ్లో ఆదర్శ్, శివబాలాజీలు పరస్పర దూషణలకు దిగారు. ముఖ్యంగా శివబాలాజీ వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ధన్‌రాజ్ సూచనతో శివబాలాజీ ఆదర్శ్‌ను క్షమాపణ కోరి శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. చివరిగా.. ముళ్ల కుర్చీ టాస్క్‌లో ధన్‌రాజ్, ముమైత్ ఖాన్ల కారణంగా ఆదర్శ్ అండ్ టీం ఓడిపోగా.. శివబాలాజీ టీం గెలిచింది. ఓడిపోయిన టీం సభ్యులకు ఎలాంటి శిక్షలు పడ్డాయో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.