బిగ్‌బాస్: శివబాలాజీ దూషణ.. ఆదర్శ్ కన్నీళ్లు
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 23 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 24వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే హౌస్‌లో ఓ ఛాలెంజ్ టాస్క్ ‘ముళ్ల కుర్చీ’ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోతారని, నిర్దేశించిన కుర్చీలో ఒక గ్రూపు సభ్యులు కూర్చొని ఉండాలని మిగతా వాళ్లు కుర్చీల్లో కూర్చున్నవారిని లేపటానికి ప్రయత్నిస్తారని బెల్ మోగిన తర్వాత రెండో గ్రూపు కుర్చీల్లో కూర్చుంటారని ఈ టాస్క్ మొత్తం మహేష్ కత్తి ఆధ్వర్యంలో జరుగుతుందని బిగ్ బాస్ గేమ్స్ రూల్స్ తెలియజేశారు.
ఈ టాస్క్ చివర్లో బెస్ట్ అండ్ వరస్ట్ ఫెర్ఫామెన్స్‌ని ప్రకటిస్తామని అందుకు లగ్జరీ బడ్జెట్‌తో పాటు శిక్షలు కూడా ఉంటాయని బిగ్ బాస్ ‘ముళ్ల కుర్చీ ’ టాస్క్ ఇచ్చారు. ఇక టాస్క్‌లో భాగంగా హరితేజ, అర్చన, కల్పన, ప్రిన్స్, శివబాలాజీలు ఒక గ్రూపుగా ఉండగా.. దీక్ష, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధన్‌రాజ్ మరో గ్రూపుగా ఉన్నారు.
ఈ టాస్క్‌లో మొదటిగా శివ బాలాజీ గ్రూప్ కుర్చీల్లో కూర్చొని టాస్క్‌లో పాల్గొనగా.. ఆదర్శ్ గ్రూప్ వాళ్లను కుర్చీనుండి లేపడానికి ప్రయత్నించారు. ఇక కత్తి కార్తీక చపాతి పిండితో చేసిన బల్లిని చూసి అర్చన భయంతో వణికిపోగా కుర్చీ దిగకుండా గేమ్ కంటిన్యూ చేసింది. ఇప్పటివరకూ బిగ్ బాస్‌లో పెద్ద వివాదాలు లేకపోయినా ఈ రోజు ఎపిసోడ్‌లో ఆదర్శ్, శివబాలాజీలు పరస్పర దూషణలకు దిగారు.
ముఖ్యంగా శివబాలాజీ వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆదర్శ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ధన్‌రాజ్ సూచనతో శివబాలాజీ ఆదర్శ్‌ను క్షమాపణ కోరి శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. చివరిగా.. ముళ్ల కుర్చీ టాస్క్‌లో ధన్‌రాజ్, ముమైత్ ఖాన్‌ల కారణంగా ఆదర్శ్ అండ్ టీం ఓడిపోగా.. శివబాలాజీ టీం గెలిచింది. ఓడిపోయిన టీం సభ్యులకు ఎలాంటి శిక్షలు పడ్డాయో రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.