ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ-2024 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
అతడి బౌలింగ్‌ను ముంబై బ్యాటర్లు ఊతికారేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే అర్జున్‌ను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జూనియర్ టెండూల్కర్.. 12.00 ఏకానమీతో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా అర్జున్ సాధించలేకపోయాడు.
అర్జున్ అమ్ముడుపోతాడా?
ఈ క్రమంలో నవంబర్ 24, 25వ తేదీల్లో జరిగే ఐపీఎల్-2025 మెగా వేలంలో అర్జున్ అస్సలు అమ్ముడు పోతాడా అన్నది ప్రశ్నర్ధాకంగా మారింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్-2023, 2024 సీజనల్లో ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు సీజన్లలో మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.
దీంతో ఈసారి అతడిని ముంబై కూడా కొనుగోలు చేసే సూచనలు కన్పించడం లేదు. ఈ వేలంలో రూ. 30 లక్షల కనీస ధరగా నమోదు చేసుకున్న అర్జున్.. ఈసారి అమ్ముడుపోకపోయినా ఆశ్చర్యపోన్కర్లేదు.
శ్రేయస్ అయ్యర్ ఊచకోత..
ఇక ఈ మ్యాచ్‌లో గోవాపై 26 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(130) సెంచరీతో మెరిశాడు.
అనంతరం లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment