కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్న ఎంతోమంది ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. కరోనా వైపరీత్యం వల్ల పలువురు నటీనటులు సినిమా అవకాశాలను కోల్పోతున్నారు. తాజాగా బిగ్‌బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ కూడా అదే కోవలోకి చేరాడు. కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి కుటుంబం మొత్తం కూడా కోవిడ్ బారిన పడింది. దీంతో పేరెంట్స్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ఈ సందర్భంగా తనను ఓ సినిమాలో నుంచి తీసివేశారని బాధపడ్డాడు. తనతోపాటు ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకిన విషయం సినిమా టీమ్‌కు చెప్పాడట ఈ నటుడు. అయితే వాళ్లు అండగా నిలబడాల్సింది పోయి తన స్థానంలో ఇంకో నటుడిని తీసుకున్నారట. కనీసం ఒక మాటైనా చెప్పకుండా ఇలా అర్ధాంతరంగా తనను సినిమా నుంచి తొలగించారని అభిమానులతో వాపోయాడు ఆదర్శ్. ఆదర్శ్‌కు జరిగిన అన్యాయానికి అభిమానులు చింతిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇది కాకపోతే ఇంకొకటి.. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాయి' అని ఆదర్శ్‌కు ధైర్యం చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment