ముంబై: శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే వర్గాలకు మరాఠీలు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే పాగా వేయబోతోంది. ఫలితాల వేళ.. మహాయుతి కూటమి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మెజారిటీని ఇప్పటికే దాటేయగా.. ప్రభుత్వ ఏర్పాటునకు కసరత్తులు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. రెండు వందలకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మహాయుతి కూటమి(ఎన్డీయే). ఇందులో బీజేపీ 100+తో అతిపెద్ద పార్టీగా నిలవడం గమనార్హం. అయితే.. మహారాష్ట్రలో ఎన్డీయే ఫ్లస్ అయిన అంశాలను పరిశీలిస్తే..
శివసేన(షిండే), ఎన్సీపీ(శరద్ పవార్).. మరికొన్ని పార్టీలను చేర్చుకుని బీజేపీ మహాయుతి కూటమిగా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లింది. శివసేన, ఎన్సీపీలో చీలికలతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే మహా ప్రజలు మాత్రం మహాయుతికే పట్టం కట్టారు.
ఎన్నికల హామీలు, నినాదాలు మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఫ్లస్ అయ్యాయి. పథకం కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏక్‌తో సేఫ్ హై నినాదం బాగా పని చేసింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందనే విశ్లేషణలకు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment