టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. భువీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ యష్ ధుల్‌ను ఔట్ చేసిన భువీ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 287 టీ20 మ్యాచ్‌లు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మొత్తం 300 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న మూడో భారత బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.
టీ20 ఫార్మాట్‌లో భువీ కంటే ముందు భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ (354), పీయూష్ చావ్లా (314), ఆర్ అశ్విన్ (310)లు ఈ ఫీట్‌ను సాధించారు. కానీ ఫాస్ట్ బౌలర్లలో మాత్రం భువీ తప్ప మిగితా ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు.
అయితే భువీ తర్వాతి స్ధానంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 300 వికెట్ల మైలు రాయిని చేరుకోవడానికి బుమ్రా 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. బమ్రా ఇప్పటివరకు 233 మ్యాచ్‌లు ఆడి 295 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2025: సచిన్ కొడుకుకు చుక్కలు చూపించారు? వేలంలో ఎవరైనా కొంటారా?
Comments
Please login to add a commentAdd a comment