
నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది.
ఈ టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి హీరోను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో ఆదర్శ్ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యున్ని కాదని, వాడి బాబు అర్జునున్ని రా అంటూ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్రలతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment