జబర్దస్త్, పటాస్ షోలకు ఝలక్!
హైదరాబాద్: పలు విమర్శలకు కారణమవుతున్న జబర్దస్, పటాస్ టీవీ షో నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది.
కామెడీ పేరుతో ఈ షోలలో బూతును ఎక్కువ ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను గతంలో బాలానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హెచ్‌ఆర్సీని ఆశ్రయించానని దివాకర్ తెలిపారు. దీంతో స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ రెండు టీవీ షోల దర్శకులకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసిందన్నారు. మహిళలు, చిన్నపిల్లలను కించపరిచేలా ఈ షోల్లో కొన్ని స్కిట్స్ ప్రదర్శిస్తున్నారని, రెండు కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం వల్ల సమాజంలోకి చెడు సందేశం వెళుతున్నదని ఆయన అన్నారు.