Patas
-
కుర్రాడు లోకల్
తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్ బాయ్’. ధనుష్ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్ చంద్ర విలన్‌గా నటించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘పటాస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టై¯Œ మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘లోకల్ బాయ్’ పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు. సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. గతంలో ధనుష్, సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మ యోగి’ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. -
జబర్దస్త్, పటాస్ షోలకు ఝలక్!
హైదరాబాద్: పలు విమర్శలకు కారణమవుతున్న జబర్దస్, పటాస్ టీవీ షో నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. కామెడీ పేరుతో ఈ షోలలో బూతును ఎక్కువ ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను గతంలో బాలానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని దివాకర్ తెలిపారు. దీంతో స్పందించిన హెచ్ఆర్సీ ఈ రెండు టీవీ షోల దర్శకులకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసిందన్నారు. మహిళలు, చిన్నపిల్లలను కించపరిచేలా ఈ షోల్లో కొన్ని స్కిట్స్ ప్రదర్శిస్తున్నారని, రెండు కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం వల్ల సమాజంలోకి చెడు సందేశం వెళుతున్నదని ఆయన అన్నారు. -
'పటాస్' కాంబినేషన్లో మరో సినిమా
దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది. అదే జోష్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మూడో సినిమాను ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కించాలని భావించినా., ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి పటాస్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇజం సినిమా పూర్తి చేసిన కళ్యాణ్ రామ్, మరోసారి అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న జూనియర్, నెక్ట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు అనీల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. -
పటాస్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్
పటాస్ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ మరోసారి నందమూరి హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుప్రీం సినిమాతో రెండో సక్సెస్ అందుకున్న అనీల్, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అనీల్ రావిపూడి. ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్ కోసం ఇప్పటికే ఫైనల్ అయిన రామ్ సినిమాను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడట. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమా
దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది. అదే జోష్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మరోసారి పటాస్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడా అనీల్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. -
పటాస్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది
దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది. అదే జోష్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మరోసారి పటాస్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడా అనీల్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. -
తేజు కోసం ఈ కథ రాయలేదు
‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మలి చిత్రం ‘సుప్రీమ్’ నేడు తెరపైకి వస్తోంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ చెప్పిన విశేషాలు... ‘పటాస్’ ఫస్ట్ కాపీ చూసి ‘దిల్’ రాజుగారు అభినందించారు. అప్పటి నుంచి ఎమోషనల్‌గా ఆయనకు కనెక్ట్ అయిపోయా. మా కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్నప్పుడు తేజు (సాయిధరమ్ తేజ్)ని హీరోగా అనుకోలేదు. కథ రెడీ చేశాక, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించి తనను ఎంచుకున్నాం ఇందులో హీరో క్యాబ్ డ్రైవర్. ఆ క్యాబ్ పేరే ‘సుప్రీమ్’. ఈ కథలో హనుమంతుడి లాంటి ట్యాక్సీ డ్రైవర్ ఎవరి కోసం వాయు వేగంతో వెళ్లాడన్నది సప్పెన్స్ చిరంజీవిగారి ‘అందం హిందోళం...’ పాట ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని రీమిక్స్ చేయలేదు. నాకున్న ప్యాషన్‌తో చేశా. ‘పటాస్’లో కామెడీ టైమింగ్ బావుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాలోనూ అలానే ఉంటుంది. దానికి కారణం రాజేంద్రప్రసాద్‌గారు, జంధ్యాలగార్ల చిత్రాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే బాలకృష్ణగారితో ‘రామారావు’ చిత్రం చేయాలనుకున్నా. ఏప్రిల్‌లోపు కథ పూర్తి చేసి, చెప్పమన్నారు. ‘సుప్రీమ్’తో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో అవకాశమొస్తే ఆయనతో సినిమా చేస్తా. -
ఆ రికార్డ్‌ను టార్గెట్ చేశాడు
తొలి సినిమా రిలీజ్ ఆలస్యం అయినా, తొలి సినిమాగా రిలీజ్ అయిన రెండో సినిమాతో ఆకట్టుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. దిల్‌రాజు నిర్మాణంలో ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు సాయి. ఈ సినిమాతో 20 కోట్ల వసూళ్లను రాబట్టి తన మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత రేయ్ సినిమా నిరాశపరిచినా, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి ఆకట్టున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో పాతిక కోట్ల క్లబ్లో చేరి తన మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు అదే జోరులో సుప్రీమ్ సినిమాతో 40 కోట్ల మార్క్ మీద కన్నేశాడు. మంచి ఫాంలో ఉన్న సాయితో పాటు పటాస్ లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతుండటంతో సప్రీమ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మంచి విజయం సాధిస్తే సాయి ఆశపడ్డట్టుగా 40 కోట్ల వసూళ్లు పెద్ద కష్టమేమి కాదు. -
బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్ లోనే బాహుబలి లాంటి భారీ చిత్రంలో విలన్ పాత్రకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో నటించడానికి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా కాదనుకున్నాడు రానా. 2015 మొదట్లో ఘనవిజయం సాధించిన మాస్ మాసాలా ఎంటర్టైనర్ పటాస్.. ఈ సినిమా కథను మొదట రానాకే వినిపించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. అయితే అప్పటికే బాహుబలికి డేట్స్ ఇచ్చేయటంతో ఆ ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ హిట్ తనీ ఒరువన్ కథను కూడా రానాకే వినిపించాడు దర్శకుడు రాజా. రానా హీరోగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించాలనుకున్నారు. అయితే రానా కాదనటంతో ఆ ప్రాజెక్ట్ రవి చేతికి వెళ్లింది. ఇలా బాహుబలి కోసం భారీ హిట్లను కాదనుకున్న రానా, భల్లాలదేవ పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. -
కళ్యాణ్‌రామ్ హీరోగా మరో కామెడీ యాక్షన్
హిట్, ఫ్లాప్‌లతో సంబందం లేకుండా తనకు నచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నాడు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్. చాలా కాలం తరువాత 'పటాస్' సినిమా హిట్ ట్రాక్‌లోకి వచ్చినట్టుగానే కనిపించినా.. తరువాత రిలీజ్ అయిన 'షేర్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అయితే ముందుగా చెప్పినట్టుగానే సక్సెస్, ఫెయిల్యూర్లను సింపుల్‌గా తీసుకునే కళ్యాణ్ రామ్... మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. 'పటాస్' ఇచ్చిన కిక్ కళ్యాణ్ రామ్ కెరీర్‌పై ఇంకా పనిచేస్తూనే ఉంది. అందుకే సక్సెస్ఫుల్ దర్శకులు, బడా నిర్మాతలు ఈ నందమూరి హీరోతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి హిట్ సినిమాను అందించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో సినిమా మీద ఇప్పటినుంచే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఏఎస్ రవికుమార్‌చౌదరి, గోపిచంద్ హీరోగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా రిలీజ్ తరువాత కళ్యాణ్‌రామ్‌తో చేయబోయే సినిమా పని మొదలు పెట్టనున్నాడు. పటాస్ తరహాలోనే కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. -
మా అబ్బాయికి...దానవీరశూరకర్ణ చూపించా!
‘నిన్ను నువ్వు నమ్ముకొంటే, ఆలస్యమైనా సరే విజయం అనివార్య’మనే పాఠానికి తాజా ఉదాహరణ - నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. సినిమాల్లోనూ, వ్యక్తిగతంగానూ అనేక ఎదురుదెబ్బలు తగిలినా, ఆయన ఎట్టకేలకు ఇప్పుడు ‘పటాస్’ చిత్రంతో మంచి వాణిజ్య విజయం సాధించారు. వివాద రహితుడూ, మంచి మనిషి అయిన కళ్యాణ్ రామ్‌కు సక్సెస్ రావాలని పరిశ్రమలో అందరూ కోరుకున్నారంటే, ఆయన సంపాదించుకున్నది కోట్లకు మించిన సంపద అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పదేళ్ళ కష్టానికీ, నిరీక్షణకూ దక్కిన ఫలితం ఎంత తీయగా ఉంటుందో స్వయంగా చవిచూసిన ఈ యువ హీరో ‘పటాస్’ విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. తప్పొప్పుల్ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటూనే, బాబాయ్‌తో 100వ సినిమా మొదలు కుటుంబ విలువల దాకా అనేక అంశాలపై ఆయన మనసు విప్పి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ‘పటాస్’ బాగా పేలినట్లుంది... చాలాకాలం తరువాత అందరి నుంచి ఏకగ్రీవంగా విజయానికి అభినందనలందుకోవడం ఎలా ఉంది? (నవ్వుతూ...) బాగుంది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సక్సెస్ అనే మాట వినడం ఎనర్జీనిస్తుంది. మన ప్రయత్నాన్ని ఎవరైనా మెచ్చుకోవడాన్ని మించి ఆనందం ఇంకేముంటుంది! ‘అతనొక్కడే’ (2005) తరువాత ‘హరేరామ్’ వాణిజ్యపరంగా విజయవంతమైనా, జనం నుంచి ఇంత స్పందన రాలేదు. ‘పటాస్’ను అందరూ మెచ్చుకొన్నారు. ఇన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురుచూడడం, నిరాశ పడకుండా శ్రమించడం అంత సులభం కాదేమో! పదేళ్ళుగా ఒంటరి పోరాటం చేస్తున్నా. నిరాశపడ్డ సందర్భాలున్నాయి. అయితే, నన్ను నేను నమ్మాను. ‘మన ప్రయత్నం మనం కష్టపడి చేద్దాం... ఫలితం ప్రేక్షకులకు వదిలేద్దాం’ అని నిశ్చయించుకున్నా. సినిమా ఫెయిలైతే, లోతుగా విశ్లేషించుకుంటా. ఎందుకంటే, మా కుటుంబమంతా సినిమా మీదే బతుకుతోంది. మరి, మీరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసిన గత చిత్రం ‘ఓం-3డి’ ఫెయిల్యూర్పైనా విశ్లేషించుకున్నారా? కచ్చితంగా! నా వ్యక్తిగత విశ్లేషణ ఏమిటంటే, సినిమాను కొత్తగా చెప్పాలనీ, చాలా మలుపులు ఉండాలనీ నేను ప్రయత్నిస్తుంటా. అయితే, ఇవాళ జనం బయట సవాలక్ష పనులు, సమస్యల నుంచి విరామం కోసం హాలుకు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నదే అందుకోసం కాబట్టి, రెండున్నర గంటల పాటు వాళ్ళు తమ జీవితంలోని కష్టాలను మర్చిపోయేలా వినోదింపజేయాలి. ఇక్కడ వినోదమంటే కేవలం నవ్వించడమనే కాదు... ఫీల్‌గుడ్ సినిమా, ప్రేమ కథ, యాక్షన్ - ఇలా ఏదైనా కావచ్చు. వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకూడదు. కానీ, ‘ఓం - 3డి’లో ట్విస్టులు, లింకులతో ప్రేక్షకులపై భారం మోపాం. అదే ఇబ్బంది అయింది. ఏదైనా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పాలని అర్థమైంది.‘ఓం-3డి’తో పోలిస్తే, ‘పటాస్’ ఎంటర్టైనింగ్ సినిమా కాబట్టి, ప్రతిరోజూ ఒక పండగలాగా సాగిపోయింది. ఇందులోని స్ట్రెయిట్ నేరేషన్, సినిమాలో ఉన్న ‘పార్థాయ...’ లాంటి రకరకాల ప్రత్యేక అంశాలు, దర్శకుడి ప్రతిభ సక్సెస్‌కు తోడ్పడ్డాయి. ముఖ్యంగా, తల్లులే పిల్లలకు బుద్ధి చెప్పడమనే ఘట్టం చాలా మందికి నచ్చింది. నూటికి నూరుపాళ్ళు జనం వినోదించారు. చాలాకాలం సక్సెస్‌కు దూరంగా ఉండి, కోట్ల కొద్దీ డబ్బు నష్టపోయినప్పుడు మీకు అండగా నిలిచిందెవరు ఇంకెవరు! నా కుటుంబమే! మా అమ్మా నాన్న, నా భార్య, నా బావమరిది, ఆప్తమిత్రులు కొందరు - వీళ్ళే నాకెప్పుడూ కొండంత అండ. వాళ్ళెవరూ నన్ను నిరుత్సాహపరచలేదు. పెపైచ్చు, విజయం సాధించగలవంటూ నన్ను ముందుకు నెట్టారు, ప్రోత్సహించారు. మీడియా దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సారి నాకు విజయం రావాలని మనసారా కోరుకున్నారు. వాళ్ళందరి ఆశీస్సులూ ఫలించాయి. ఇంతకీ, ‘పటాస్’ చూసి, మీ నాన్న గారు, బాబాయ్ బాలకృష్ణ వాళ్ళు ఏమన్నారు? (మెరిసే కళ్ళతో...) చాలా కాలంగా నా విజయం కోసం ఎదురుచూస్తున్న నాన్న గారు చాలా హ్యాపీ. నా సినిమా సక్సెసైతే గుడికి వెళతానని మొక్కుకున్నట్లున్నారు. రిలీజ్ రోజున నేను ఫోన్ చేసి, ‘సినిమా బాగుందట’ అనే లోపుగానే, తనకు విషయం తెలిసిందంటూ, మేమెక్కడికో రమ్మన్నా రాకుండా, వెంటనే గుడికి వెళ్ళారు. బాలకృష్ణ బాబాయ్ కూడా సినిమా చూసి, సంతోషించారు. తమ్ముడు తారక్ (చిన్న ఎన్టీయార్) ‘అన్నా! నీ కెరీర్లో అత్యుత్తమ అభినయం!’ అంటూ మెచ్చుకున్నాడు. మా కుటుంబం కళ్ళల్లో ఆనందబాష్పాలు చూశాను. మీ పిల్లలిద్దరికీ సినిమా నచ్చిందా? వాళ్ళ ముత్తాత పెద్ద ఎన్టీఆర్ గురించి చెబుతుంటారా? మేము బతుకుతున్నదే మా తాత ఎన్టీఆర్ గారి పేరు మీద! ఆయన నుంచి మా నాన్న గారు... మా నాన్న గారి నుంచి మేము నేర్చుకున్న కుటుంబ విలువలు, అనుబంధాలు మా పిల్లలకు కూడా అలవడేలా చూస్తుంటా. మా అమ్మాయి తారక అద్వితకు నాలుగేళ్ళు. చిన్నపిల్ల. అబ్బాయి శౌర్యరామ్కు ఆరున్నరేళ్ళు. వాడు ఇప్పటికే రెండుసార్లు ‘పటాస్’ చూశాడు. వాడికి సినిమా బాగా నచ్చేసింది. నా చదువు, తదితర కారణాల వల్ల నేను ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడుతుంటా. కానీ, పిల్లలకు తెలుగు బాగా రావడం కోసం చిన్నప్పటి నుంచి శ్రద్ధ చూపిస్తున్నా. మా వాడు చూసిన మొదటి సినిమా - వాళ్ళ ముత్తాత గారి ‘దానవీరశూర కర్ణ’. అలాగే, పెద్దాయన ‘ఆలీబాబా 40 దొంగలు’, బాబాయ్ ‘భైరవద్వీపం’ అంటే వాడికి చాలా ఇష్టం. కొత్త దర్శకులతో, అదీ సొంత సినిమాలే తప్ప బయటవాళ్ళకు సినిమాలు చేయరేం? అదేమీ లేదు. నాకు వేరే వ్యాపారాలు తెలియవు. ఆలోచనలు లేవు. మా తాత గారి పేరు మీద ఈ ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ సంస్థ పెట్టాను. నా దగ్గరకు కొత్త దర్శక, రచయితలు వస్తారు. వాళ్ళు చెప్పిన కథ నచ్చితే, మరోమాట లేకుండా చేసేస్తుంటా. మా సంస్థను విస్తరించాలనే ఉద్దేశంతో సురేంద్రరెడ్డి-రవితేజలతో ‘కిక్2’ నిర్మిస్తున్నా. సెట్స్ మీద ఉన్న నా ‘షేర్’ బయటి నిర్మాతలదే. అలాగే, నా తదుపరి చిత్రం కూడా బయటవాళ్ళదే. తారక్, నాగ చైతన్య, నాగ్‌లతో సినిమాలు చేయాలని యత్నిస్తున్నట్లున్నారు! అవును. చైతన్యకు గతంలో స్క్రిప్ట్ చెప్పాను. ఆ ప్రాజెక్ట్‌ను పట్టాల మీదకు ఎక్కించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘బాలగోపాలుడు’లో నన్ను బాలనటుడిగా పరిచయం చేసి, నటనలో ఓనమాలు దిద్దించిన బాబాయ్ బాలకృష్ణ 100వ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నా. మీ తమ్ముడు తారక్‌తో మునుపటి కన్నా అనుబంధాలు బాగా పెరిగినట్లున్నాయి..! మేమంతా ఒకే కుటుంబం కదండీ! గతాన్ని తవ్వుకోదలుచుకోలేదు. మునుపటితప్పులు మళ్ళీ జరగకూడదని జాగ్రత్త పడుతుంటా. 1983 వరకు మా తాత గారి దగ్గర ఉమ్మడి కుటుంబంలో పెరిగినవాణ్ణి. కుటుంబ బంధాలు, విలువలు తెలుసు. ఎప్పుడూ వాటికి విలువనిస్తా. ఇన్నాళ్ళుగా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లలో మీరు కనిపించరు! వివాదాలు, ఆర్భాటాలకూ దూరమే! వాటన్నిటికీ నేను దూరం. ‘ఇష్టం లేకపోతే మాట్లాడకు. అంతే తప్ప మాట తూలితే వెనక్కి తీసుకోలేం నాన్నా! జాగ్రత్త’ అని తాత గారు, నాన్న గార్ల నుంచి నేర్చుకున్నదే పాటిస్తుంటాను. వివాదాల జోలికి పోను. నేను ఎవరి గురించి, దేని గురించీ మాట్లాడను. ‘నీ సినిమా బాగుండాలని కోరుకో! అంతేకానీ, పక్కవాడిది పోవాలనుకోకు’ అని నా సిద్ధాంతం. ఇల్లు, ఆఫీసు, షూటింగ్ తప్ప నాకు వేరే తెలియదు. అయితే, ఇంటికి చాలా ప్రాముఖ్యమిస్తారన్న మాట! పెళ్ళయినవాణ్ణి కాబట్టి ఇంటికే ప్రాధాన్యమిస్తా. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతా. ఖాళీ సమయం దొరికితే, మూడ్‌ను బట్టి రకరకాల టీవీ చానల్స్ చూస్తుంటా. అలాగే, ఇంట్లో ఉంటే కుటుంబమంతా కలిసే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తాం. అందరం కలసి తినాలనే ఆ పద్ధతినీ, కుటుంబ విలువలనూ తప్పనిసరిగా పాటిస్తుంటా. అలాగే, చిర్రుబుర్రులాడుతూ ఉండేవాళ్ళ కన్నా, చిరునవ్వుతో ఉండేవాళ్ళంటే నాకిష్టం. లొకేషన్‌లోనూ సీరియస్‌గా ఉండేవాళ్ళకు నేను దూరం. రాజకీయాల పట్ల మీరు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించరేం? (గంభీరంగా...) ఏ పని చేస్తుంటే, దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలనేది నా తత్త్వం. రాజకీయం పెద్ద వ్యవస్థ. అవగాహన లేని దానిలో వేలు పెట్టను. మీ అన్నయ్య జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం... (చెమర్చిన కళ్ళతో...) అది మా కుటుంబమంతటికీ తీరని బాధ. మా నాన్న గారెప్పుడూ తాత గారి పనుల వ్యవహారాల్లో ఉండేవారు కాబట్టి, చిన్నప్పటి నుంచి మా విషయాలన్నీ అన్నయ్యే చూసుకొనేవాడు. వాడు మాకు నాన్న తరువాత నాన్న లాంటివాడు. మా అన్నయ్యకు సినిమాలంటే బాగా ఇష్టం. అయితే, పెద్దగా బయటకు వచ్చేవాడు కాదు. ఏదైనా మంచి సినిమా, పాట, రీరికార్డింగ్ చూస్తే, ఆ రిఫరెన్స్‌లు నాకు ఇస్తుండేవాడు. ‘పటాస్’ ఫస్ట్‌లుక్ రిలీజయ్యాక చూసి, ‘నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ సినిమా హిట్టవుతుంది’ అని చెప్పాడు. అలాంటివాడు కొన్ని వందల సార్లు తిరిగిన రోడ్డు మీదే ప్రమాదానికి గురై చనిపోవడం విధి విలాసం. అందుకే, ‘పటాస్’ మొదట్లో నేను, తారక్ అందరికీ మెసేజ్ ఇవ్వాలని ‘రోడ్డు ప్రమాదం జాగ్రత్తలు’ చెప్పాం. మీ నాన్న గారికీ ఎప్పుడైనా సలహాలిస్తుంటారా? బాబాయ్‌తో... (మధ్యలోనే అందుకుంటూ...) వాళ్ళ మార్గదర్శకత్వంలో పెరిగినవాళ్ళం. వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వగలిగినంత వాళ్ళం కాదు. మాదంతా ఒక కుటుంబం. అన్ని కుటుంబాలలో లాగానే మాకూ చిన్న చిన్న అలకలు, కోపతాపాలు ఉంటాయి. అయితే, అవేవీ శాశ్వతం కాదు. అన్నీ వచ్చిపోతుంటాయి. మేమంతా ఎప్పుడూ ఒక్కటే! ఎప్పటికైనా ‘మనం’ లాగా మా కుటుంబంలో మా నాన్న, బాబాయ్, నేను, తమ్ముడు తారక్ - ఇలా మూడు తరాల వాళ్ళం కలసి సినిమా చేయాలని నా కోరిక. అలాంటి అవకాశం, అదృష్టం మన తెలుగు పరిశ్రమకే ఉండడం విశేషం. మీ అమ్మాయి పేరును ‘ఓం’ చిత్రం నిర్మాణ బాధ్యతల్లో వేశారు. ఇక మీ అబ్బాయిని నటుణ్ణి చేస్తారా? (నవ్వేస్తూ...) చిన్నపిల్లలు... వాళ్ళకు కావాల్సినట్లుగా వాళ్ళను ఉండనివ్వండి. పెద్దయ్యాక వాళ్ళకు ఏది చేయాలనిపిస్తే, అది చేస్తా. అంతేతప్ప, సినిమాల్లోకే రమ్మని బలవంతపెట్టను. మా అబ్బాయికి సినిమాలంటే ఇష్టం. వాళ్ళ అమ్మను తోడు తీసుకొని, ప్రతివారం సినిమాలకు వెళతాడు. నేను ఎంత ఒత్తిడిలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి పిల్లలే నాకు పెద్ద రిలీఫ్. ఆ సంగతి చెబితే అర్థం కాదు... పిల్లలున్నవాళ్ళకు ఎవరికి వారికి అనుభవంలోకి వస్తుంది. - రెంటాల జయదేవ -
'పటాస్' సినిమా పోస్టరుపై ఫిర్యాదు
హైదరాబాద్ క్రైం: జాతీయ చిహ్నమైన మూడు సింహాలను అవమానించే విధంగా 'పటాస్' సినిమా పోస్టర్లు ఉన్నాయని నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. వివరాలు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని సినిమా థియేటర్లో పటాస్ సినిమా పోస్టర్లు యువతను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పీఅండ్‌టీ కాలనీ బీజేపీ అధ్యక్షుడు డోర్నాల జయప్రకాష్ చైతన్యపురి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. థియేటర్లో ప్రదర్శిస్తున్న పోస్టర్లలో అర్థనగ్నంగా ఉన్న మహిళ జాతీయ చిహ్నమైన మూడు సింహాలపై చేయి వేసి నిల్చొని ఉండటం యువతను పెడదోవ పట్టించే విధంగా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ పోస్టరులో హీరో ధూమపానం చేస్తూ కనిపించడం అభ్యంతరకరంగా ఉందన్నారు. సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకొని యువత ఇలాంటి సంఘటనలతో తప్పుదోవ పడుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఏసీపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
‘పటాస్’ చిత్ర యూనిట్ సందడి
చిత్ర విజయంలో జిల్లావాసుల ప్రతిభ పూల వర్షం కురిపించిన అభిమానులు ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ‘పటాస్’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ మేరకు నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించి నటించిన పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా శనివారం చిత్రంలో నటించిన నటులు గోరంట్ల కాంప్లెక్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. స్థానిక సంఘమిత్ర ఆసుపత్రి నుంచి ర్యాలీగా కొనసాగి గోరంట్ల కాంప్లెక్స్‌కి చేరుకున్నారు. తమ అభిమాన హీరో నందమూరి కల్యాణ్‌రామ్, సాయికుమార్ ఇతర నటులపై పూల వర్షం కురిసిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సభలో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ తాను నిర్మించిన నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లో గతంలో అతనొక్కడే చిత్రం విజయవంతమయిందని, చాలాకాలం తరువాత ‘పటాస్’ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయపథంలో నిడిపించిన దర్శకులు రావిపూడి అశోక్, సంగీత దర్శకుడు కార్తీక్, పాటల రచయిత బరూరి సుబ్బరాయశాస్త్రి ప్రకాశం జిల్లా వారు కావడం జిల్లా పవరేంటో అర్ధమవుతుందన్నారు. అటువంటి జిల్లాలో తాము విజయ యాత్ర చేయడం సంతోషకరమన్నారు. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ తాను గతంలో పోలీస్ స్టోరీ చిత్రం చేస్తే ప్రజలు ఆదరించారని, ఈ చిత్రంలో పోలీసులకు వ్యతిరేకంగా ఉండే పాత్ర చేయడం కొత్తగా ఉందని, దీన్ని కూడా ప్రజలు ఆదరించడం సంతోషకరమన్నారు. ప్రకాశం జిల్లాతో తనకి ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ పాల్గొని మాట్లాడుతూ నందమూరి అభిమానులకు వరుస విజయాలు చేకూరాయన్నారు. ఈ యాత్రలో నిర్మాత దిల్‌రాజు, హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిబ్యూటర్ హరి, గోరంట్ల కాంప్లెక్స్ యాజమాన్యం గోరంట్ల వీరనారాయణ, పూరిమిట్ల శ్రీనివాసరావు, ఆలపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబాయ్, తమ్ముడుతో కలిసి నటిస్తా
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే పదేళ్ల తరువాత ఓ హిట్ వచ్చిం దని సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శనివా రం ఉదయం నైవేద్య విరామ సమయంలో ‘పటాస్’ చిత్ర యూనిట్ తో కలసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఁపటాస్రూ. చిత్రం విజయవంతమైన నేపథ్యంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని విజయయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో తిరుమలకు వచ్చామన్నారు. మంచి కథ వస్తే ఈ ఏడాదిలోనే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలసి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం చాలా రోజుల నుంచి వేచి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ‘షేర్’ చిత్రంలో నటిస్తున్నాని తెలిపారు. తమ బ్యానర్లో చిత్రీకరిస్తున్న ‘కిక్2’ సినిమా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు వెల్లడించారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తన చిత్రాన్ని హిట్ చేసిన వారందరికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వీరితో పాటు పటాస్ చిత్రంలో నటించిన నటులు రాఘవ, ప్రభాస్ శ్రీను, సురేష్, శివనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
పోలీస్ గెటెప్స్ వేసిన అన్నదమ్ములు
-
పటాస్ టీంతో చిట్ చాట్
-
డిమాండ్ చేస్తే.. బికినీకి ఓకే!
‘‘పరభాషలో హిట్ సాధిస్తే ఆ మజాయే వేరు. భవిష్యత్తు బంగారంలా ఉంటుందనే నమ్మకాన్ని ఆ హిట్ కలగజేస్తుంది.ప్రస్తుతం ఆ నమ్మకంతోనే ఉన్నా’’ అని శ్రుతీ సోథీ చెప్పారు. కల్యాణ్‌రామ్ నటించిన ‘పటాస్’ ద్వారా నాయికగా పరిచయమయ్యారీ ఉత్త రాది భామ. మాతృభాష పంజాబీలో మూడు చిత్రాల్లో నటించారామె. సినిమాల్లోకి రాక ముందు శ్రుతి ఓ టీవీ చానల్లో న్యూస్ ప్రెజెంటర్‌గా చేశారు. ఆ పాత్రనే ‘పటాస్’లో చేయడం ఆనందంగా ఉందన్నారు శ్రుతి. ‘‘హిందీలోకి అనువదించిన తెలుగు చిత్రాలను టీవీ చానల్స్‌లో చూశాను. ఆ విధంగా ఇక్కడి చిత్రాలు ఎలా ఉంటాయో తెలిసింది. తెలుగులో తొలి చిత్రమే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి సన్నివేశాన్నీ స్పష్టంగా చెప్పేవారు. భాష తెలియకపోయినా బాగా నటించగలగడానికి అదే కారణం’’ అని చెప్పారు. సంప్రదాయబద్ధ పాత్రలకే పరిమితం కావాలనుకోవడంలేదనీ, సన్నివేశం డిమాండ్ చేస్తే బికినీ ధరించడానికి వెనకాడననీ అన్నారు. -
స్వప్నలిపి
బాస్... మీ కలలో పటాస్ పేలిందా?! పటాస్ పేలిన శబ్దం వినబడి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాం. చుట్టూ చూస్తాం. ఎక్కడా పటాసుల జాడ ఉండదు. పటాసుల శబ్దం కలలోనిదనేది అర్థమైపోతుంది. ‘ఇదేం దీపావళి సీజన్ కాదు కదా! ఇలాంటి కల వచ్చింది’ అనే సందేహం కూడా మనకు రావొచ్చు. దీనికి సంబంధించి మానసిక , ధార్మిక కోణాలలో ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి. కలలో పటాసులు పేలడం అనేది చాలా సందర్భాలో మీలో తారాస్థాయికి చేరిన సంతోషాన్ని, జీవనోత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ‘జడత్వం’ లో నీరసం తప్ప శబ్దమేదీ వినిపించదు. కార్యశీలతలోనే ‘ఉత్సాహం’ అనే శబ్దం ఉంటుంది. కలలో కనిపించి వినిపించే పటాస్ శబ్దం సరిగ్గా అలాంటిదే! కొన్ని పాశ్చాత్య విశ్లేషణల ప్రకారం... రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించే కల ఇది. సందర్భాన్ని బట్టి మీరు ఈ కల గురించి ఒక అంచనాకు రావచ్చు. -
పోలీస్ పాత్రలో... పటాస్
బాక్సాఫీస్ వద్ద ‘పటాస్’ మోత మోగించడానికి కల్యాణ్‌రామ్ సంసిద్ధమయ్యారు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ మోత మోగించడం ఏంటి? అనుకుంటున్నారా! ఆయన తాజా సినిమా పేరు ‘పటాస్’. రచయిత అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ... నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడు కూడా ఆయనే. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నందమూరి జానకీరామ్ కెమెరా స్విచాన్ చేయగా, జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. ‘కిక్’ సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి హరికృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా విజయం సాధించాలని ఆహూతులందరూ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రమే ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘కందిరీగ, ఆగడు’ చిత్రాలకు రచయితగా పనిచేసిన నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి కృతజ్ఞతలు. ఆసక్తికరమైన మలుపులతో సాగే... యాక్షన్ ఎంటర్టైనర్ ‘పటాస్’. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే అంశాలు ఇందులో ఉంటాయి. కల్యాణ్‌రామ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపిస్తారు. నేటి నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. కొత్తమ్మాయి కథానాయికగా పరిచయమయ్యే ఈ సినిమాలో సాయికుమార్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: తమ్మిరాజు.