పటాస్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది | anil ravipudi to direct kalyan ram again | Sakshi
Sakshi News home page

పటాస్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది

Published Thu, Jun 30 2016 1:10 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

anil ravipudi to direct kalyan ram again

దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ కోసం ఎదురు చూసిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కోరిక తీర్చిన హిట్ సినిమా పటాస్. కొత్త దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పటాస్, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు హీరో దర్శకులకు మంచి బ్రేక్ ఇచ్చింది.

అదే జోష్లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను రూపొందించాడు అనీల్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించటంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయిన తరువాత మరోసారి పటాస్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ కూడా అనీల్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement