బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు | Baahubali Took Away 2 Blockbusters From Rana | Sakshi
Sakshi News home page

బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు

Published Thu, Jan 7 2016 7:53 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు - Sakshi

బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు

సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్ లోనే బాహుబలి లాంటి భారీ చిత్రంలో విలన్ పాత్రకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో నటించడానికి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా కాదనుకున్నాడు రానా.

2015 మొదట్లో ఘనవిజయం సాధించిన మాస్ మాసాలా ఎంటర్టైనర్ పటాస్.. ఈ సినిమా కథను మొదట రానాకే వినిపించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. అయితే అప్పటికే బాహుబలికి డేట్స్ ఇచ్చేయటంతో ఆ ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ హిట్ తనీ ఒరువన్ కథను కూడా రానాకే వినిపించాడు దర్శకుడు రాజా. రానా హీరోగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించాలనుకున్నారు. అయితే రానా కాదనటంతో ఆ ప్రాజెక్ట్ రవి చేతికి వెళ్లింది. ఇలా బాహుబలి కోసం భారీ హిట్లను కాదనుకున్న రానా, భల్లాలదేవ పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement