thanioruvan
-
ఆరు సినిమాలతో బిజీ
సాధారణంగా హీరోయినే ఏక కాలంలో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటిది ఒక స్టార్ హీరో అరడజనుకు పైగా చిత్రాలకు ఒప్పందం చేసుకోవడం అనేది అరుదైన విషయమే అవుతుంది. అదీ ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకునే నటుడు జయంరవి ఒకేసారి అరడజను చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈయన అడంగుమరు చిత్రం తరువాత తాజాగా కోమాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో నాయకిగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది. ఇది సమ్మర్ తరువాత తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జయం రవి ఒకేసారి మూడు చిత్రాలు చేయడానికి స్క్రీన్ సీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో ఒప్పుందం కుదుర్చుకున్నారు. ఇదీ అరుదైన విషయమే అవుతుంది. వాటిలో ఒక చిత్రానికి ఎండ్రెండ్రుం పున్నగై, మనిదన్ చిత్రాల ఫేమ్ అహ్మద్ దర్శకత్వం వహించనున్నారు. మణిరత్నం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించడానికి సై అన్నారు. ఇవి కాక తన సోదరుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తనీఒరువన్–2 చిత్రం చేయాల్సి ఉంది. ఇకపోతే మరో ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో నటించానికి జయంరవి ఓకే చెప్పినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు కండుకొండేన్ కండుకొండేన్ తరువాత ఈ దర్శకుడు ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా సర్వం తాళ మయం చిత్రాన్ని తెరకెక్కించారు. తదుపరి జయంరవితో చేసే చిత్ర స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. -
బాహుబలి కోసం ఆ రెండూ వదులుకున్నాడు
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్ లోనే బాహుబలి లాంటి భారీ చిత్రంలో విలన్ పాత్రకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో నటించడానికి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా కాదనుకున్నాడు రానా. 2015 మొదట్లో ఘనవిజయం సాధించిన మాస్ మాసాలా ఎంటర్టైనర్ పటాస్.. ఈ సినిమా కథను మొదట రానాకే వినిపించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. అయితే అప్పటికే బాహుబలికి డేట్స్ ఇచ్చేయటంతో ఆ ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ హిట్ తనీ ఒరువన్ కథను కూడా రానాకే వినిపించాడు దర్శకుడు రాజా. రానా హీరోగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించాలనుకున్నారు. అయితే రానా కాదనటంతో ఆ ప్రాజెక్ట్ రవి చేతికి వెళ్లింది. ఇలా బాహుబలి కోసం భారీ హిట్లను కాదనుకున్న రానా, భల్లాలదేవ పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. -
దక్షిణాదిలో తొలిసారిగా జాంబీ మూవీ!
ఇండియన్ స్క్రీన్ మీద డ్రాక్యులా, ప్రిడేటర్, జాంబీ తరహా సినిమాలు చాలా అరుదు, అలాంటి అరుదైన జానర్లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. అది కూడా మన సౌత్ ఇండస్ట్రీలో కావటం మరో విశేషం. ఇటీవల తనీఒరువన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయం రవి మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒక వైరస్ కారణంగా మృగాలుగా మారిన మనుషులను ఓ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనే కథతో రూపొందిన మిరుదన్ సినిమాతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నాడు. సాధారణంగా ఇలా జాంబీ జానర్లో తెరకెక్కిన సినిమాలు మన ఇండస్ట్రీలలో కనిపించవు. అయితే ఇటీవల కాలంలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి సినిమాలు ప్రాంతీయభాషల్లో కూడా వస్తున్నాయి. జయం రవి, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో శక్తి సౌందర్ రాజన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ హీరోగా తెరకెక్కిన ఐయామ్ లెజెండ్ తరహాలో కనిపిస్తున్న ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. -
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
-
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
'తనీఒరువన్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దక్షిణాదినే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎం రాజా తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ స్టార్ హీరోలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ కు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు అంతగా టాప్ స్టార్స్‌ను ఆకర్షించడానికి ఈ సినిమాలో ఏముంది. 'తనీఒరువన్' ఓ థ్రిల్లర్ కథాంశం. ఐపీఎస్ పాసైన హీరో మిత్రన్ ( జయం రవి ) ప్రొబేషన్‌లో ఉండగా తన మిత్రులతో కలిసి నగరంలో జరుతున్న నేరాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో తమతో కలిసిన మహిమ ( నయనతార ) తో ప్రేమలో పడతాడు. నగరంలో జరుగుతున్న చిన్న చిన్న నేరాల వివరాలను సేకరించిన మిత్రన్ ఈ నేరాలన్నింటి వెనకాల ఉన్న వ్యక్తి ఒకడే అని గ్రహిస్తాడు. పద్మశ్రీ అవార్డ్ గ్రహిత అయిన ఫేమస్ సైంటిస్ట్ సిద్దార్ధ్ అభిమన్యు ( అరవింద్ స్వామి ) తన వ్యక్తిగత అవసరాల కోసం సైన్స్‌ను, పాలిటిక్స్‌ను తప్పుదారిలో ఉపయోగిస్తున్నాడని తెలుసుకొని అతని ఆటకట్టిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఇన్విస్టిగేషన్ డ్రామాలా సాగే తనీఒరువన్.., సెకండ్ హాఫ్ అంతా మైండ్ గేమ్‌లా నడుస్తుంది. కేవలం స్క్రిప్ట్ మీద 9 నెలల పాటు వర్క్ చేసిన దర్శకుడు రాజా ప్రతీ సీన్లోనూ క్లారిటీ చూపించాడు. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఒక్క ఫ్రేమ్ కూడా ఆడియన్ బోర్ ఫీలవ్వకుండా తెరకెక్కించాడు. జయం రవి, అరవింద్ స్వామి, నయనతారల నటన, ఎం రాజా డైరెక్షన్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవ్వటంతో 'తనీఒరువన్' టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు మరో నాలుగు పరిశ్రమలు 'తనీఒరువన్' రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు ఎం రాజా తెలుగులో మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ ఇంత వరకు రీమేక్ సినిమా చేయలేదు. దీంతో మహేష్ కాకపోతే రామ్ చరణ్ తో అయినా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందీలో సల్మాన్ హీరోగా తనీ ఒరువన్‌ను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. హిందీ వర్షన్ ను తానే డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజా. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన సల్మాన్ టీం రీమేక్‌కు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇక కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సౌత్ లో మంచి పరిచయాలు ఉన్న జెనీలియా కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరాఠీలో ఈ సినిమాను నిర్మించాలని ట్రై చేస్తుంది హాసిని. బెంగాలీ భాషలోనూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. దృశ్యం సినిమా తరువాత అదే స్ధాయిలో అన్ని భాషల్లో ఈ 'తనీఒరువన్' రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.