ఆరు సినిమాలతో బిజీ | Jayam Ravi Busy With 6 Films | Sakshi
Sakshi News home page

ఆరు సినిమాలతో బిజీ

Published Sun, Apr 7 2019 12:18 PM | Last Updated on Sun, Apr 7 2019 12:18 PM

Jayam Ravi Busy With 6 Films - Sakshi

సాధారణంగా హీరోయినే ఏక కాలంలో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటిది ఒక స్టార్‌ హీరో అరడజనుకు పైగా చిత్రాలకు ఒప్పందం చేసుకోవడం అనేది అరుదైన విషయమే అవుతుంది. అదీ ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకునే నటుడు జయంరవి ఒకేసారి అరడజను చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈయన అడంగుమరు చిత్రం తరువాత తాజాగా కోమాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జంటగా నటి కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మరో నాయకిగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది. ఇది సమ్మర్‌ తరువాత తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల జయం రవి ఒకేసారి మూడు చిత్రాలు చేయడానికి స్క్రీన్‌ సీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో ఒప్పుందం కుదుర్చుకున్నారు. ఇదీ అరుదైన విషయమే అవుతుంది. వాటిలో ఒక చిత్రానికి ఎండ్రెండ్రుం పున్నగై, మనిదన్‌ చిత్రాల ఫేమ్‌ అహ్మద్‌ దర్శకత్వం వహించనున్నారు. మణిరత్నం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించడానికి సై అన్నారు. ఇవి కాక తన సోదరుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తనీఒరువన్‌–2 చిత్రం చేయాల్సి ఉంది.

ఇకపోతే మరో ప్రముఖ దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించానికి జయంరవి ఓకే చెప్పినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు కండుకొండేన్‌ కండుకొండేన్‌ తరువాత ఈ దర్శకుడు ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా సర్వం తాళ మయం చిత్రాన్ని తెరకెక్కించారు. తదుపరి జయంరవితో చేసే చిత్ర స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement