ఆ రికార్డ్ను టార్గెట్ చేశాడు | 40 crore business on Sai Dharam Tej Supreme | Sakshi
Sakshi News home page

ఆ రికార్డ్ను టార్గెట్ చేశాడు

Published Wed, Mar 9 2016 1:57 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

ఆ రికార్డ్ను టార్గెట్ చేశాడు - Sakshi

ఆ రికార్డ్ను టార్గెట్ చేశాడు

తొలి సినిమా రిలీజ్ ఆలస్యం అయినా, తొలి సినిమాగా రిలీజ్ అయిన రెండో సినిమాతో ఆకట్టుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్. దిల్రాజు నిర్మాణంలో ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు సాయి. ఈ సినిమాతో 20 కోట్ల వసూళ్లను రాబట్టి తన మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత రేయ్ సినిమా నిరాశపరిచినా, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి ఆకట్టున్నాడు.

హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో పాతిక కోట్ల క్లబ్లో చేరి తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు అదే జోరులో సుప్రీమ్ సినిమాతో 40 కోట్ల మార్క్ మీద కన్నేశాడు. మంచి ఫాంలో ఉన్న సాయితో పాటు పటాస్ లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతుండటంతో సప్రీమ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మంచి విజయం సాధిస్తే సాయి ఆశపడ్డట్టుగా 40 కోట్ల వసూళ్లు పెద్ద కష్టమేమి కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement