పటాస్ డైరెక్టర్తో ఎన్టీఆర్ | Ntr Next with patas fame anil ravipudi | Sakshi
Sakshi News home page

పటాస్ డైరెక్టర్తో ఎన్టీఆర్

Published Tue, Sep 13 2016 3:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

పటాస్ డైరెక్టర్తో ఎన్టీఆర్

పటాస్ డైరెక్టర్తో ఎన్టీఆర్

పటాస్ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ను మలుపు తిప్పిన దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ మరోసారి నందమూరి హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుప్రీం సినిమాతో రెండో సక్సెస్ అందుకున్న అనీల్, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు.

జనతా గ్యారేజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అనీల్ రావిపూడి. ఎన్టీఆర్తో సినిమా ఛాన్స్ కోసం ఇప్పటికే ఫైనల్ అయిన రామ్ సినిమాను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడట. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement