తేజు కోసం ఈ కథ రాయలేదు
‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మలి చిత్రం ‘సుప్రీమ్’ నేడు తెరపైకి వస్తోంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ చెప్పిన విశేషాలు...
‘పటాస్’ ఫస్ట్ కాపీ చూసి ‘దిల్’ రాజుగారు అభినందించారు. అప్పటి నుంచి ఎమోషనల్‌గా ఆయనకు కనెక్ట్ అయిపోయా. మా కాంబినేషన్‌లో సినిమా చేయాలనుకున్నప్పుడు తేజు (సాయిధరమ్ తేజ్)ని హీరోగా అనుకోలేదు. కథ రెడీ చేశాక, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించి తనను ఎంచుకున్నాం ఇందులో హీరో క్యాబ్ డ్రైవర్. ఆ క్యాబ్ పేరే ‘సుప్రీమ్’. ఈ కథలో హనుమంతుడి లాంటి ట్యాక్సీ డ్రైవర్ ఎవరి కోసం వాయు వేగంతో వెళ్లాడన్నది సప్పెన్స్ చిరంజీవిగారి ‘అందం హిందోళం...’ పాట ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని రీమిక్స్ చేయలేదు.
నాకున్న ప్యాషన్‌తో చేశా. ‘పటాస్’లో కామెడీ టైమింగ్ బావుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాలోనూ అలానే ఉంటుంది. దానికి కారణం రాజేంద్రప్రసాద్‌గారు, జంధ్యాలగార్ల చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడమే బాలకృష్ణగారితో ‘రామారావు’ చిత్రం చేయాలనుకున్నా. ఏప్రిల్‌లోపు కథ పూర్తి చేసి, చెప్పమన్నారు. ‘సుప్రీమ్’తో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో అవకాశమొస్తే ఆయనతో సినిమా చేస్తా.