బాబాయ్, తమ్ముడుతో కలిసి నటిస్తా
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే పదేళ్ల తరువాత ఓ హిట్ వచ్చిం దని సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శనివా రం ఉదయం నైవేద్య విరామ సమయంలో ‘పటాస్’ చిత్ర యూనిట్ తో కలసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఁపటాస్‌రూ. చిత్రం విజయవంతమైన నేపథ్యంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని విజయయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో తిరుమలకు వచ్చామన్నారు. మంచి కథ వస్తే ఈ ఏడాదిలోనే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్‌టీఆర్‌తో కలసి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇందుకోసం చాలా రోజుల నుంచి వేచి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ‘షేర్’ చిత్రంలో నటిస్తున్నాని తెలిపారు. తమ బ్యానర్‌లో చిత్రీకరిస్తున్న ‘కిక్2’ సినిమా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు వెల్లడించారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తన చిత్రాన్ని హిట్ చేసిన వారందరికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వీరితో పాటు పటాస్ చిత్రంలో నటించిన నటులు రాఘవ, ప్రభాస్ శ్రీను, సురేష్, శివనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.