సాక్షి, అమరావతి: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని పలువురు రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. హెల్త్ వర్సిటీకి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని తప్పు పట్టే నైతిక అర్హత వారికి లేదన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్లు చేశారు.
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు, తండ్రిని పదవీచ్యుతుడిని చేసేందుకు జరిగిన కుట్రలో భాగస్వామి అయిన చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ హెల్త్ వర్సిటీ పేరు మార్పును విమర్శిస్తే ఎవరూ నమ్మెందుకు సిద్ధంగా లేరన్నారు. మంత్రుల ట్వీట్లు ఇలా ఉన్నాయి..
ఎంత గొప్ప మనుషులురా బాబూ మీరు
వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారు. ఎంత గొప్ప మనుషులురా బాబు మీరు.
– పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.
ఎన్టీఆర్‌ను చంపేశాకే కదా మీరు ఆయన పేరు పెట్టింది
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయన్ని మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా? టీడీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టుకున్నారు?
– సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జున
బాబు చెప్పులేయించారు.. జగన్ పూలు వేయించారు
చంద్రబాబు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయిస్తే, సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు.
– పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య. యూనివర్సిటీ అనేది చిన్నది. జిల్లాకు పేరు చాలా పెద్దది బాలయ్యా. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిల్చిపోతుంది. ఇది వాస్తవం.
– సాగునీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు
వైద్య రంగానికి టీడీపీ చేసిన మేలేమిటి?
నాన్ టీడీపీ 8.. వైఎస్సార్ 3.. సీఎం జగన్ 17.. ఇదీ ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లెక్క. మరి ఎన్టీఆర్ ఎక్కణ్నుంచి వచ్చారు? ఇంతకీ వైద్య రంగానికి టీడీపీ చేసిన గొప్ప మేలు ఏమిటి? వైఎస్సార్, సీఎం జగన్ చేయని మేలు ఏమిటీ?
– మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా
ఎన్టీఆర్‌పై చెప్పులేసినప్పుడు ఈ పౌరుషం ఏమైంది?
గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్‌గా, సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేసే ఆస్పత్రులుగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్.. మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది. ఇది కరెక్టేనా? ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన? 104, 108 వాహనాలను పాడుపెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా? సిగ్గుండాలి.
ఎన్టీఆర్‌కు అత్యంత మానసిక క్షోభ మిగిల్చిన వ్యక్తి, ఆయనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. చంద్రబాబు తన కుర్చీ లాగేసినప్పుడు ఎన్టీ రామారావు కంట తడి పెడితే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన సమయంలో కుటుంబ సభ్యుల పౌరుషం ఏమైంది?
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (ట్వీట్‌తో పాటు విజయవాడలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేసిన ఈ విమర్శలు చేశారు)
వెన్నుపోటుదారులు ఎన్టీఆర్ భక్తులా?
Published Sun, Sep 25 2022 4:04 AM | Last Updated on Sun, Sep 25 2022 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment